యాప్నగరం

ఆ ఇడియట్స్‌కి అవే కావాలి? ఉద్భవ్‌తో ఏం కాలేదు, ‘ఆహా’ వాళ్లు అలా చేయమన్నారు: పునర్నవి భూపాలం

‘ఉయ్యాల జంపాల’ నటి పునర్నవి భూపాలం బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో పునర్నవి రిలేషన్‌షిప్ అప్పట్లో హాట్ టాపిక్..

Samayam Telugu 1 Feb 2021, 7:13 pm

ప్రధానాంశాలు:

  • ఎంగేజ్ మెంట్, పెళ్లిపై ఓపెన్ అయిన పునర్నవి
  • ఉద్భవ్‌తో పెళ్లి కథ ఏంటి?
  • ఆ డ్రామా వెనుక అసలు కథ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu పునర్నవి
punarnavi
‘హో షిట్.. పెళ్లి లేదూ ఏం లేదు.. నా వయసు జస్ట్ 24 ఏళ్లండీ బాబూ.. ప్రజెంట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ కావాలి.. బోలెడు సినిమాలు చేయాలి.. ఇవన్నీ కావాలంటే ఓ ఆరేడేళ్లు పట్టొచ్చు. ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే సుబ్బరంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఇద్దరు పిల్లల్ని కనేసి సిటీకి దూరంగా ఉండాలి.. ఇదంతా జరగాలంటే ఓ 20 ఏళ్లు పట్టొచ్చు’.. అని తన పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి ఇదే విషయాల్ని చెప్తూ ఉంటుంది.
అయితే రీసెంట్‌గా పునర్నవి వేలుకి ఉంగరం పెట్టుకుని.. అయిపోయింది.. అంతా అయిపోయింది.. మొత్తానికి ఇలా జరిగిపోయింది.. అని ఎంగేజ్ మెంట్ రింగ్‌తో ఉన్న ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తనకు పెళ్లి కుదిరినట్టు, నిశ్చితార్థం అయిపోయినట్టు తెలియజేస్తూ ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను ఈ ఫొటోలో చూపించారు పున్ను.

వామ్మో ఇదేం ట్విస్టూ అని కొందరంటే.. ఐతే గియితే మా రాహుల్ అన్నతో అవ్వాలి.. మధ్యలో వీడెవడు అంటూ ఓ రేంజ్‌లో కామెంట్‌లు చేశారు. బిగ్ బాస్‌ హౌస్‌లో రాహుల్ సిప్లింగంజ్‌తో పునర్నవికి ఉన్న బాండింగ్ అలాంటిది మరి.. ఇక బయటకు వచ్చిన తరువాత కూడా వీళ్లిద్దరి ఒకే కూల్ డ్రింక్ రెండు స్ట్రాలు అన్నట్టుగానే హాట్ టాపిక్ అయ్యారు. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ.. ఎవరిదారి వాళ్లు వెతుక్కున్నారు. ఇప్పుడు రాహుల్ అయితే అషు రెడ్డితో కొత్త ట్రాక్ మొదలుపెట్టాడనుకోండి అది వేరే విషయం కాగా.. పునర్నవి పెళ్లి ముచ్చటకు వస్తే.. అలా ఎంగేజ్ మెంట్ రింగ్‌తో దర్శనం ఇవ్వడం ఇదేదో సినిమా ప్రమోషన్‌లాగే ఉంది అని చాలామంది కనిపెట్టేయగా.. కొందరైతే నిజంగానే పునర్నవి పెళ్లి చేసుకుంటుందేమో అని విషెష్ అందించారు.

తీరా అందరూ అనుకున్నట్టుగానే.. అది ‘కమిట్ మెంటల్’ అనే వెబ్ సిరీస్ ఫిల్మ్ ప్రమోషన్స్.. పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ ఫిల్మ్‌లో పునర్నవికి జోడీగా ఉద్భవ్ రఘునంద నటించాడు. ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో విడులైంది కూడా.

అయితే ఎంగేజ్ మెంట్ అని చెప్పడం.. రింగ్ చూపించడం.. అఫీషియల్ ఖాతాల్లో వాటిని పోస్ట్ చేయడంతో పునర్నవిని తిట్టుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. ఇకపోతే ఇది సినిమా ప్రమోషన్ అని చెప్పిన తరువాత కూడా ఉద్భవ్‌-పునర్నవిల మధ్య ఏదో నడుస్తుందని.. నిజంగానే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు రావడంతో వీటిపై క్లారిటీ ఇచ్చింది పునర్నవి.

అసలు.. ఆరోజు ఎంగేజ్‌మెంట్ అని చెప్పడానికి గల కారణాలను తెలియజేస్తూ.. తనపై రూమర్స్ క్రియేట్ చేసేవారికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది పున్నూ పాప.

తాజాగా ప్రముఖ ఆర్జే కాజల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘మా ఇద్దరి పెళ్లి అవ్వలేదు.. ఎంగేజ్‌మెంట్ కూడా కాలేదు. అది సినిమా ప్రమోషన్ కూడా కాదు. ‘ఆహా’ టీం వాళ్లు అలా చేయమన్నారు మేం అలా చేశాం.

ఈ సినిమా వస్తుంది.. చూడండి అంటే రొటీన్‌గా‌ అనిపిస్తుంది.. డిఫరెంట్ వేలో జనంలోకి తీసుకుని వెళ్లాలని అనుకున్నాం. అందుకే మా క్యారెక్టర్స్‌ని అలా పరిచయం చేశారు.

అయితే ఆ పోస్ట్ అలా పెట్టినప్పుడు చాలాకామెంట్స్ వచ్చాయి.. వేరే వ్యక్తి (రాహుల్ సిప్లిగంజ్) పేరు తీసుకువచ్చి కామెంట్ చేశారు. వాటిని నేను చూశా. ఆడియన్స్ ఎంత లవ్ చేస్తారో తెలిసింది.. అలాగే కొంతమంది ఇడియట్స్ కూడా ఉన్నారు. వాళ్లని మనం ఏం చేస్తాం.. వాళ్లకి గాసిప్‌లు ఎక్కువ కావాలి. వాళ్ల జీవితంలో ఏం జరగదు.. అందుకే ఎదుటి వాళ్ల జీవితం గురించి కావాలి వాళ్లకి. సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్ అవుతారో.. వాళ్లని గురించి ఇలా కామెంట్ చేస్తారు.

నేను మెంటల్‌గానే ప్రిపేర్ అయ్యా.. ఆహా వాళ్లు ఇలా చేద్దాం అన్నప్పుడు ఇలాంటి కామెంట్స్ వస్తాయని అనుకున్నా.. అయినప్పటికీ ప్రిపేర్ అయ్యా. ఎందుకంటే ఇది నాకు వచ్చిన ఆలోచన కాదు.. ‘ఆహా’ మార్కెటింగ్, కమింట్‌మెంటల్ టీం తీసుకున్న నిర్ణయం. మేం జనాల్ని ఫూల్స్ చేద్దాం అనే ఉద్దేశంతో చేసింది కాదు’ అని చెప్పుకొచ్చింది పునర్నవి భూపాలం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.