యాప్నగరం

Punarnavi Bhupalam: పునర్నవి ఎలిమినేట్.. తట్టుకోలేక ఏడ్చేసిన రాహుల్

జోడీ వీడింది.. రాహుల్‌‌ని దు:ఖసాగరంలో వదిలేసి పునర్నవి ఎలిమినేట్ అయ్యింది. 11 వ వారం నామినేషన్స్‌లో మహేష్, వరుణ్, రాహుల్‌తో పోటీపడ్డ పున్నూ ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్‌ నుండి బయటకు వచ్చింది.

Samayam Telugu 6 Oct 2019, 11:46 pm
ఎట్టకేలకు 11 వారాలు తరువాత బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది పునర్నవి భూపాలం. టాస్క్‌ల పరంగా యాక్టివ్‌గా లేనప్పటికీ రాహుల్‌లో కెమిస్ట్రీని వర్కౌట్ చేసి.. బిగ్ బాస్ హౌస్‌కి గ్లామర్ టచ్ ఇస్తున్న పునర్నవి ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయ్యింది.
Samayam Telugu Punarnavi Bhupalam Eliminated
పునర్నవి


11వ వారం నామినేషన్‌లో రాహుల్, పునర్నవి, వరుణ్, మహేష్ విట్టాలు ఉండగా.. శనివారం నాటి ఎపిసోడ్‌లో రాహుల్ సేవ్ కాగా.. అందరూ ఊహించినట్టుగానే రెండో కంటెస్టెంట్‌గా వరుణ్ సేఫ్ అయ్యారు. ఇక మహేష్ విట్టా, పునర్నవిల మధ్య ఉత్కంఠ కలిగించగా చివరికి మహేష్ విట్టా సేవ్ అయినట్టు ప్రకటించారు నాగార్జున.

Read Also: నవరసాలతో నవరాత్రి.. ఆమె శృంగార రసాన్ని ధారబోసింది

ఇక హౌస్ నుండి బయటకు వస్తూ భావోద్వేగానికి గురైంది పున్నూ. అయితే అందరూ రాహుల్‌తో ఏం చెప్తుందని ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. అతనికి చెప్పకుండానే బయటకు వచ్చేసింది పునర్నవి. రాహుల్ మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నా.. వద్దు అంటూ సీరియస్ అయ్యింది. అయితే పునర్నవి బయటకు వచ్చిన తరువాత కన్నీటి పర్యంతం అయ్యాడు రాహుల్. ఇన్నాళ్లూ నవ్వుతూ నవ్విస్తూ హౌస్‌లో ఉన్న రాహుల్.. పునర్నవి వెళ్లిపోవడంతో తట్టుకోలేక ఏడ్చేశాడు.

ఎలిమినేషన్ తరువాత బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చిన పున్నూ ఫుల్ ఖుషీతో కనిపించింది. తన జర్నీని చూసి మురిసిపోయింది పున్నూ. ముఖ్యంగా వరుణ్‌తో రొమాంటిక్ సీన్లను చూసి మురిసింది.

ఇక రాహుల్ లోపల ఫొటో అడిగితే ఎందుకు ఇవ్వలేదని నాగార్జున అడగ్గా.. ‘ఎవరు ఏమనుకున్నా తనూ నేను మంచి ఫ్రెండ్స్.. కాని గత రెండు వారాలుగా అతను నా ఫ్రెండ్ షిప్‌కి విలువ ఇవ్వలేదు.. అందుకే నచ్చలేదు’ అంటూ చెప్పుకొచ్చింది పున్నూ. మళ్లీ బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లే ఛాన్స్ ఇస్తే తప్పుకుండా వెళ్తానంది పునర్నవి.

పునర్నవి వెళ్లిపోవడంతో ‘ఏమైపోతానే’ అనే పాటను అందుకుని గుక్కపెట్టి ఏడ్చేశాడు రాహుల్. ఎంతమంది కంట్రోల్ చేయాలని చూసినా దు:ఖ సాగరంలో మునిగిపోయాడు రాహుల్. నాగార్జున కోరడంతో హార్ట్‌లో నుండి వచ్చిన ఎమోషన్‌తో పున్నూపై ఉన్న ప్రేమను ఏడుస్తూ పాట పాడి వినిపించాడు. రేపు మళ్లీ వస్తానులే అంటూ అతన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది పునర్నవి. పునర్నవి లేకపోవడం నాకు పెద్ద లోటు. ఆమె నన్ను చాలా బాగా చూసుకుంది అంటూ ఎమోషన్ అయ్యాడు. నీ ప్రేమ ఏంటో ఎవరికి అర్ధమైనా కాకపోయినా నాకు బాగా అర్ధమైందన్నారు నాగార్జున. ఇక ఫైనల్‌గా వెళ్లిపోమాకే సాంగ్‌తో ఈ ఇద్దరి బిగ్ బాస్ ప్రేమ ప్రయాణానికి ఎండ్ కార్డ్ వేశారు నాగార్జున.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.