యాప్నగరం

Ali Reza: వాళ్లిద్దరి మధ్యే అసలు పోటీ.. బిగ్ బాస్ విన్నర్ సోహెల్.. పీఆర్ టీమ్ ఉంటేనా..!!

ఈ సారి తన దృష్టిలో బిగ్ బాస్ విజేత సోహైల్ అంటూ ఓపెన్ కామెంట్స్ చేశాడు అలీ రెజా. మొదటినుంచి సోహైల్‌ని సపోర్ట్ చేస్తున్న ఆయన ఈ సారి ఏకంగా ట్రోఫీ అతనిదే అనేయడం హాట్ టాపిక్ అయింది.

Samayam Telugu 19 Dec 2020, 7:06 pm
బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు చేరుకుంది. ఇన్ని రోజులపాటు బిగ్ బాస్ హౌస్‌లో ఆట ఆడిన కంటిస్టెంట్లలో ఫైనల్ విన్నర్ ఎవరనేది తేలే సమయం రానేవచ్చింది. ఈ ఆదివారం జరగబోతున్న గ్రాండ్ ఫినాలే కోసం బుల్లితెర ప్రేక్షకలోకం ఆతృతగా ఎదురుచూస్తోంది. హౌస్‌లో ఫైనల్‌గా మిగిలిన ఐదుగురిలో విన్నర్ ఎవరు కాబోతున్నారనే దానిపై జనాల్లో చర్చలు ముదిరాయి. సొహైల్, అరియానా, హారిక, అఖిల్, అభిజిత్‌లు ఫైనల్ పోరులో ఉన్నారు. అయితే ఇందులో అభిజీత్ గెలవొచ్చు అనే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్న తరుణంలో సోహైల్‌ని సపోర్ట్ చేస్తూ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అలీ రెజా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Samayam Telugu Ali Reza: వాళ్లిద్దరి మధ్యే అసలు పోటీ.. బిగ్ బాస్ విన్నర్ సోహెల్..!
Ali reza Sohel


ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో వచ్చిన ఓటింగ్స్ పరంగా చూస్తే అంతా అభిజిత్‌కి పట్టం కట్టారని తెలుస్తోంది. సోహైల్ రన్నర్ అవుతాడని రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. కానీ అలీ రెజా మాత్రం తన దృష్టిలో బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ సోహైల్ అని గట్టిగా చెబుతున్నాడు. ముందు నుంచి సోహెల్‌కు అలీ రెజా మద్దతిస్తున్నసంగతి తెలిసిందే. ఇక ఫైనల్ స్టేజ్‌కి రావడంతో మరింత స్ట్రాంగ్‌గా సోహెల్‌కు తన సపోర్ట్ తెలిపాడు అలీ రెజా.

సోహెల్ తనకు ఎనిమిదేళ్లుగా తెలుసని, అతను సోదరుడితో సమానమని చెప్పిన అలీ రెజా.. అయితే అతన్ని సపోర్ట్ చేయడానికి మతం కారణం కాదని అన్నాడు. ''బిగ్ బాస్ షోలోకి వెళ్లేముందు సపోర్ట్ చేయమని సోహైల్‌ నన్ను అడిగాడు. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటేనే స‌పోర్ట్ చేస్తానని అప్పుడే చెప్పాను. అయితే బిగ్ బాస్ మొదలైన రెండు మూడు వారాల తరువాత సోహెల్ ఆట చూసి సపోర్ట్ చేయడం ప్రారంభించాను. అప్పుడే అనుకున్నా సోహైల్ టాప్ 5 కంటిస్టెంట్లలో ఒకరిగా ఉంటాడని.

Also Read: Bigg Boss 4 Telugu Vote: ఓటింగ్ రిజల్ట్.. విన్నర్ అభి, రన్నర్ సొహైల్/అరియానా, తారుమారైన ఓటింగ్, లీస్ట్‌లో

కొంద‌రు అత‌డు ముస్లిం కాబ‌ట్టి స‌పోర్ట్ చేస్తున్నా అంటున్నారు కానీ నేను మతపరంగా అస్సలు ఆలోచించడం లేదు. ఇలా మ‌తాల‌ను అడ్డు పెట్టుకుని ఇలా చేసే వ్యక్తిని కాదు. సోహైల్‌ ఎంతో ప్యూర్, జెన్యూన్, చిన్న పిల్లాడి మనస్తత్వం.. అవి చూసే అతన్ని సపోర్ట్ చేస్తున్నాను. షోకి వెళ్లే ముందే ట్రోఫీ గెలవడం కంటే నీ ప్రత్యేకత చాటుకోవడం ముఖ్యమని సోహైల్‌తో చెప్పాను. నువ్వు నీలాగే ఉండమని అన్నా. అదే చేసి సోహైల్ ఇప్పుడు ప్రజల అభిమానాన్ని సంపాదించాడు. టైటిల్ రేస్‌లో ఉన్నాడు.

Also Read: బిగ్‌ బాస్ గ్రాండ్ ఫినాలేకు అంతా సిద్ధం.. గంగవ్వతో సుజాత పంచాయితీ! ఇద్దరూ రెచ్చిపోయారులే..

లేడీ బిగ్ బాస్ విన్నర్‌కి ఈ సారి ఛాన్స్ లేదు. సోహైలే ట్రోఫీ గెలిచేందుకు అన్నివిధాలా అర్హుడు. సోష‌ల్ మీడియా ప్ర‌కారం అభిజిత్‌, సోహైల్ మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉంది. ఒకవేళ సోహైల్ కూడా మంచి పీఆర్ టీమ్‌ను పెట్టుకొని ఉంటే ఫ‌లితం వేరేలా ఉండేది. అయితే అత‌డి కుటుంబానికి పీఆర్ టీమ్ పెట్టుకునేంత ఆర్థిక స్థోమ‌త లేదు కాబట్టి పెట్టుకోలేదు. అయినా ఇప్ప‌టికీ సోహైల్ గెలిచే అవ‌కాశాలున్నాయి. సోహైల్ వల్లే ఈ సీజ‌న్ రసవత్తరంగా సాగింది త‌ప్ప అభిజిత్ వ‌ల్ల కాదు'' అని అలీ రెజా చెప్పడం గమనార్హం.
View this post on Instagram A post shared by Ali Reza (@i.ali.reza)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.