యాప్నగరం

Sravanthi Bigg Boss: బిగ్ బాస్‌ 5లో హాట్ యాంకర్ స్రవంతి చొక్కరపు.! ప్రమోషన్స్ కోసం రంగంలోకి పీఆర్వోలు

బిగ్ బాస్ ప్రారంభమైన తరువాత ఆ ఆర్మీ ఈ ఆర్మీ అంటూ బోలెడు ఆర్మీలు పుట్టుకొస్తుంటాయి. అయితే వీటిలో అభిమానంతో ఏర్పడేవి కొన్నైతే.. ఓన్ ప్రమోషన్స్ ద్వారా డబ్బులు ఖర్చుపెట్టి దొంగ ఆర్మీలను ఏర్పాటు చేసి ప్రమోషన్స్ చేస్తుకుంటారనే విమర్శలు చాలా ఉన్నాయి.

Samayam Telugu 22 Jun 2021, 6:14 pm
ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా కరోనా ఉధృతి కారణంగా బిగ్ బాస్ సీజన్ 5 మరింత ఆలస్యం కాబోతుంది. అయితే ఈ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్‌కి సంబంధించిన ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారు నిర్వాహకులు. ఇప్పటికే అనేమంది పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ సోషల్ మీడియాలో వినిపించిన పేర్లన్నీ కూడా ప్రచారంలో ఉన్నవి మాత్రమే. ఎందుకంటే బిగ్ బాస్ నిబంధనల ప్రకారం హౌస్‌లోకి అడుగుపెట్టేవరకూ కూడా తాము బిగ్ బాస్‌లోకి వెళ్తున్నామనే విషయాన్ని బహిర్గతం చేయకూడదు. అయితే స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల ద్వారా ప్రతి సీజన్‌కి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ అవుతూనే ఉంటుంది.
Samayam Telugu యాంకర్ స్రవంతి
Anchor Sravanthi


అయితే షణ్ముఖ్ జస్వంత్, బమ్ చిక్ బబ్లూ, టిక్ టాక్ స్టార్ మహాతల్లి, యాంకర్ రవి, లోబో, మంగ్లీ ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మరో హాట్ యాంకర్ పేరు ఈ లిస్ట్‌లో చేరింది. అంతేకాదు.. దాదాపు ఆమె బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లడం ఖాయం అయినట్టే కనిపిస్తుంది. ఆమె ఎవరో కాదు.. స్ర‌వంతి చొక్క‌ర‌పు.
View this post on Instagram A post shared by Sravanthi Prashanth (@sravanthi_chokarapu)

రీసెంట్‌గా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కామెడీ షోలో మెరుస్తున్న ఈ బ్యూటీ యాంకర్‌కి బిగ్ బాస్ ఆఫర్ వరించినట్టు తాజా సమాచారం. దీనిలో భాగంగా ఆమె ప్రమోషన్స్‌ని కూడా వేగవంతం చేసింది. ఇందుకోసం కొంతమంది పీఆర్వోలను సైతం రంగంలోకి దించిందట.
View this post on Instagram A post shared by Sravanthi Prashanth (@sravanthi_chokarapu)

సాధారణంగా సినిమా ప్రమోషన్స్ కోసం పీఆర్వీలు పనిచేస్తుంటారు. అయితే గత రెండు సీజన్లుగా అంటే కౌశల్ మందా విన్నర్ అయిన తరువాత సీజన్ నుంచి సీన్ మారిపోయింది. పాపులారిటీ ఎంత ఉన్నా.. కంటెస్టెంట్స్ హౌస్‌లో ఉన్నప్పుడు బయట ప్రమోషన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్న చాలామంది.. ప్రత్యేకించి ప్రమోషన్ ఏజెంట్‌లను నియమించకుంటున్నారు. వారి వారి సోషల్ మీడియా ఖాతాలను డీల్ చేయడం.. ఓట్లు విరివిగా పడటానికి విపరీతమైన ప్రచారం కల్పించడం కోసం సొంతంగా ప్రమోషనల్ ఏజెంట్‌లను నియమించుకుని ఓన్ పబ్లిసిటీ చేయించుకుంటున్నారు.

అయితే రీసెంట్.. వివిధ మీడియా గ్రూప్‌లలో యాంకర్ స్ర‌వంతి చొక్క‌ర‌పును ప్రమోట్ చేస్తూ కొంతమంది పీఆర్వోలు ప్రెస్ నోట్‌లు పంపించడంతో ఆమె బిగ్ బాస్ వెళ్లడం ఖాయమని దీనిలో భాగంగానే ఆమె కొంతమంది ప్రమోటర్స్‌ని రంగంలోకి దించిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత సీజన్‌లో అరియానా గ్లోరిని ఇదే మాదిరిగా ప్రమోట్ చేశారు కొంతమంది పీఆర్వోలు.

View this post on Instagram A post shared by Sravanthi Prashanth (@sravanthi_chokarapu)

ఇంతకీ స్రవంతి చొక్కరపు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తుందా? లేదా అన్న విషయాన్ని పక్కనపెడితే.. ఆమెలో ఉన్న ప్రత్యేకత ఏంటి..? బిగ్ బాస్ ఆఫర్ వరించేటంత క్వాలిటీస్ ఈమెలో ఏమున్నాయ్ అన్న విషయానికి వస్తే.. ‘అందం, ఆకట్టుకునే రూపంతో స్ర‌వంతి చొక్క‌ర‌పు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. యాంకర్‌గా పెద్దగా పాపులర్ కాలేకపోయినప్పటికీ.. తన హాట్ నెస్‌తో ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటుంది. మాటివి ద్వారా త‌న యాంక‌రింగ్ ప్ర‌స్థానాన్ని మొద‌లుపెట్టిన స్ర‌వంతి.. స్టూడియో ఒన్‌‌లో కొన్ని పోగ్రామ్స్ చేసి పాపులర్ అయ్యింది. అలానే జెమెనిలో ప్ర‌తి రోజు 10 గంట‌ల‌కి లైవ్‌లో ప్రేక్ష‌కుల‌తో మాట్లాడుతూ న‌వ్విస్తూ త‌న డ్ర‌స్సింగ్ స్ట్రైల్‌తో అల‌రిస్తుంది.
View this post on Instagram A post shared by Sravanthi Prashanth (@sravanthi_chokarapu)

అంతేకాకుండా ప్ర‌ముఖ యూట్యూబ్ ఛాన‌ల్స్‌లో సెల‌బ్రిటి ఇంట‌ర్యూస్ చేస్తూ పాపులర్ అయ్యింది. తాజాగా ‘శ్రీదేవి డ్రామా కంపెని’లో క‌మెడియ‌న్ ఇమాన్యూల్‌కి జోడీగా ఫేమ‌స్ అయ్యింది. అయితే అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో హీట్ పెంచే ఫొటో షూట్‌లతో హాట్ యాంకర్‌గా క్రేజ్ దక్కించుకుంది స్రవంతి చొక్కరపు.
View this post on Instagram A post shared by Sravanthi Prashanth (@sravanthi_chokarapu)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.