యాప్నగరం

Nagarjuna: శ్రీముఖిని గాడిదతో పోల్చిన నాగార్జున.. సీరియస్ వార్నింగ్

Bigg Boss Telugu 3: బిగ్ బాస్ హౌస్‌లో శ్రీముఖి ప్రవర్తిస్తున్న తీరుపై మండిపడ్డారు హోస్ట్ నాగార్జున. ఆమెను గాడిదతో పోల్చుతూ సీరియస్ కామెంట్స్ చేశారు.

Samayam Telugu 14 Sep 2019, 8:19 pm
బిగ్ బాస్ హౌస్ హాట్ హాట్‌గా మారింది. ఎప్పుడూ మోడల్స్‌లో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ.. హుషారెత్తించే నాగార్జున నేటి ఎపిసోడ్‌లో చాలా సీరియస్‌గా ఉన్నారు. ఈరోజు డాన్స్‌లు పాటలు వద్దు.. నాకు మండిపోతుంది.. బిగ్ బాస్ హౌస్‌ కంటెస్టెంట్స్‌పై పీకలదాకా కోపం ఉంది. వెంటనే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలి అంటూ మహేష్, శ్రీముఖి, పునర్నవిలకు క్లాస్ పీకుతున్నారు.
Samayam Telugu nagarjuna and sreemukhi


Read Also: షూ పాలిష్ చెత్తపనా? స్టేజ్‌పై పాలిష్ చేసిన నాగ్.. మహేష్‌ ఔట్!

నేటి రాత్రి 9 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానున్న ‘బిగ్ బాస్’ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో శ్రీముఖిని గాడిదతో పోలుస్తూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు బిగ్ బాస్. గత రాత్రి ఎపిసోడ్‌లో.. ఆమె ఇంటి సభ్యుల్ని తప్పుదారి పట్టించి విధానాన్ని పాయింటౌట్ చేస్తూ నాగార్జున ఈ వ్యాఖ్యలు చేశారు.

‘శ్రీముఖి.. నీ ఆట ఎలా ఉందో తెలుసా? కూసి గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు ఉంది. నువ్ బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్‌వి కాదు.. బిగ్ బాసే అందరికీ బాస్.. నీ ఆట నువ్ ఆడుకో’ అంటూ గట్టి క్లాస్ పీకారు నాగార్జున.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.