యాప్నగరం

Swathi Deekshith: హారిక.. అభితో ఉండేది రోజులో గంట మాత్రమే.. మిగతా టైం అంతా అతనితోనే.. కానీ అది చూపించరు: స్వాతి దీక్షిత్ ఓపెన్

ఒకప్పుడు మోనాల్ ఎక్కడ ఉంటే.. అభిజిత్ అక్కడే ఉండేవాడు. అయితే మోనాల్‌తో గొడవ తరువాత అభిజిత్ ఆమెకు దూరమయ్యాడు. అప్పటి నుంచి హారిక ఎక్కడ ఉంటే అభిజిత్ అక్కడేఅన్నట్టుగా చూపిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందంటూ గుసగుసలు మొదలయ్యాయి.

Samayam Telugu 5 Nov 2020, 5:29 pm
బిగ్ బాస్ హౌస్ అంటే రూమర్లు, ఎఫైర్లకు కొదువే ఉండదు. అమ్మాయిలు అబ్బాయిలు ఒకేచోట ఉండటంతో.. వాళ్ల మధ్య చిన్న చిన్న అట్రాక్షన్స్ లాంటివి జరిగినా.. వాటిని లవ్ ట్రాక్‌గా జనంలోకి వెళ్లేలా చేస్తుంటాడు బిగ్ బాస్. ఇలా ప్రతి సీజన్‌లోనూ రెండు మూడు జంటలు లవ్ ట్రాక్ పేరుతో హాట్ టాపిక్ అవుతుంటారు.
Samayam Telugu స్వాతి దీక్షిత్
swathi deekshith interview


అయితే ఈ సీజన్‌లో అఖిల్-మోనాల్-అభిజిత్-హారిక-అవినాష్-అరియానా ఇలా చాలామందే ఉన్నారు. అఖిల్-మోనాల్-అభిజిత్ మధ్య మొదట్లో ట్రై యాంగిల్ కథ నడిపించగా.. ఇప్పుడు అభిజిత్-హారికతోటి.. అఖిల్-మోనాల్‌తో సెట్ అయ్యారు. ఇక అవినాష్-అరియానాలు కూడా పులిహోర కలపే కార్యక్రమాల్లో బిజీగా కనిపిస్తున్నారు.

వాళ్ల సంగతి పక్కన పెడితే... మోనాల్‌కి దూరమైన తరువాత అభిజిత్.. హారికకు బాగా దగ్గరౌతూ కనిపిస్తున్నాడు. హారిక అయితే అభిజిత్‌ అంటే ఇంట్రస్ట్ చూపిస్తుంది. ఎప్పుడూ అభిజిత్‌తో కబుర్లు చెప్తూ.. ముచ్చట్లు పెట్టడం హగ్ చేసుకోవడం ముద్దు ముచ్చట్ల కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఫ్రెండ్ షిప్‌లో భాగమే మచ్చా అని హారిక చాలా క్లియర్‌గా ఉన్నా బయట మాత్రం ఈ ఇద్దర మధ్య సంథింగ్ సంథింగ్ నడిచేస్తుండంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఈ తరుణంలో వీళ్ల రిలేషన్‌పై ఓపెన్ అయ్యింది స్వాతి దీక్షిత్. బిగ్ బాస్ హౌస్‌కి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి.. వారం తిరక్కుండా బయటకు వచ్చేసిన స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ హౌస్‌లో జరుగుతున్న లవ్ ట్రాక్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

హారిక గురించి మాట్లాడుతూ.. ‘వాళ్లిద్ధరి మధ్య ఏం లేదు.. జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. హారికను చిన్న పిల్లలా చూస్తారు అందరూ.. అభిజిత్ కూడా ఆమెను అలాగే ట్రీట్ చేస్తాడు తప్పితే వేరు ఉద్దేశం ఏం ఉండదు.

కానీ బిగ్ బాస్ వాళ్లు ఏం చూపిస్తున్నారో అదే అర్థం అవుతుంది. హారిక అభిజిత్‌తో మాత్రమే క్లోజ్‌గా ఉండదు.. అంతకు ముందు నోయల్‌తో బాగా క్లోజ్‌గా ఉండేది. కానీ ఎక్కువగా అభిజిత్‌తో ఉన్నట్టే చూపిస్తున్నారు. అభిజిత్‌లో హారిక ఉండేది రోజులో మహా అయితే ఒక గంట మాత్రమే.. మిగతా టైం అంతా నోయల్‌తో ఉండేది. ఆమెను బాగా ఏడిపించేవాడు. వాళ్లిద్దరూ బాగా క్లోజ్.

హారిక అభిజిత్‌తో ఎలా ఉంటుందో నోయల్‌తో కూడా అలాగే ఉండేది. ఆమె చాలా పొసిస్సివ్.. నాకే సొంత అనుకునే టైప్. అభిజిత్ ఆమెకు ఫ్రెండ్ కాబట్టి పొసిస్సివ్‌ చూపిస్తుంది. నేను కూడా ఆమెకు ఫ్రెండ్‌నే. నేను క్లోజ్ అయ్యాక ఆమెకు టైం ఇవ్వకపోతే పొసిస్సివ్‌నెస్ చూపిస్తుంటుంది. హారిక క్యారెక్టరే అంతా.. డిఫరెంట్ పర్శనాలిటీ. చిన్నపిల్ల టైప్. ఏది చేసినా ఫ్రెండ్లీగానే.. తన ఫ్రెండ్ తనకి సపోర్ట్ చేయాలని అనుకుంటుంది అంతే తప్ప అభిజిత్‌కి క్లోజ్‌గా ఉంటుంది ఏదో జరుగుతుంది అనడానికి ఏం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది స్వాతి దీక్షిత్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.