యాప్నగరం

బిగ్ బాస్: సూర్య కిరణ్ ఎక్స్‌ట్రాలు, మోనాల్ ఏడుపు తగ్గిస్తే మంచిది.. తాట తీసిన దివి

గత నాలుగు రోజులుగా బిగ్ బాస్ హౌస్‌లో హీరోయిన్ దివి పొరపాటున కూడా మాట్లాడింది లేదు.. నిన్నటి ఎపిసోడ్‌లో కూడా యోగా చేసుకుంటూ తన పని తాను చూసుకుంది తప్పితే హౌస్‌లో ఇప్పటివరకూ ఆమె సింగిల్ డైలాగ్ కూడా లేదు.

Samayam Telugu 10 Sep 2020, 6:05 pm
హమ్మయ్య.. దివి మాట్లాడిందండోయ్.. గత నాలుగు రోజులు బిగ్ బాస్ హౌస్‌లో మౌన ప్రదర్శన చేస్తుందో ఏమో తెలియదు కాని.. పొరపాటున కూడా ఒక్క మాట మాట్లాడినట్టు కనిపించలేదు దివి (Divya Vadthya). బిగ్ బాస్ హౌస్‌లో 14వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన నటి దివి .. ఎంట్రీ సాంగ్‌తో అదరగొట్టింది. తన నాజూకు అందాలతో కుర్రకారుకి మంచి కిక్ ఇచ్చింది. పలు వెబ్ సిరీస్‌తో పాటు మమర్షి సినిమాలో మెరిసిన దివి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పేరు. అయితే పరిచయం లేకపోయిన తన పెర్ఫామెన్స్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువఅవుతానని బిగ్ బాస్ స్టేజ్‌పై చెప్పిన దివి.. హౌస్‌లోకి వచ్చిన తరువాత ఆమెకు సింగిల్ డైలాగ్ కూడా లేదు.
Samayam Telugu బిగ్ బాస్ దివి
Bigg Boss Divi


ఎడిటింగ్‌లో లేపేశారో లేక.. ఆమె నిజంగా మాట్లాడకుండా ఉండిపోయింది తెలియదు కాని.. దివి మాట్లాడినట్టు కాని.. ఇతరులతో చర్చించినట్టు కాని కనిపించలేదు. అయితే గురువారం నాటి ఎపిసోడ్‌లో హౌస్‌లోని కంటెస్టెంట్స్‌కి తన మాటలతో చుక్కలు చూపిస్తోంది.

తాజాగా గురువారం నాటి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా.. ఇందులో దివి మాట్లాడితే ఎలా ఉంటుందో శాంపిల్ చూపించింది. బిగ్ బాస్.. మిగతా సభ్యుల బిహేవియర్‌పై మాట్లాడాలనే టాస్క్ ఇచ్చారో ఏమో కాని.. ఒక్కొక్కరి గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఈ సీజన్ 4 పాతాళగంగ మోనాల్ గజ్జర్ గురించి చెప్తూ.. మోనాల్ మీరు ఏదైనా విషయం వస్తే ఊరికే ఏడ్చేస్తున్నారు.. మీరు నిజంగా బాధ కలిగి ఏడ్చినా అప్పుడు ఎవరూ పట్టించుకోరని ప్రేక్షకులకు కలిగిన అభిప్రాయాన్నే దివి కుండబద్దలు కొట్టి చెప్పింది.

ఇక అకిల్ గురించి మాట్లాడుతూ.. కొన్నిసార్లు మీ ప్రవర్తన మార్చుకుంటే బెటర్ అని చెప్పింది. ఇక లాస్య సెన్సిటివ్ మ్యాటర్‌పై కూడా క్లాస్ పీకుతూ కనిపించింది. సూర్య కిరణ్ గారు నా మాటే వినాలి అని కాస్త తగ్గించుకుంటే మంచిది అని ముఖంపైనే ఫట్ మని కొట్టినట్టు చెప్పింది. నేను తగ్గించను అంటూ అతను అంతెత్తున లేవడాన్ని ప్రోమోలో చూపించారు. మొత్తానికైతే గత నాలుగు రోజులుగా హౌస్‌లో చాలా సైలెంట్‌గా ఉన్న దివి.. ఒక్కసారిగా ఓపెన్ అయ్యి మొహమాటం లేకుండా తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. ఈ ప్రోమో చాలు దివి ఎలిమినేషన్ నుంచి గట్టెక్కడానికి అన్నట్టుగానే ఆమె పెర్పామెన్స్ ఉంది. నోటి నుంచిఏది వస్తే అది మాట్లాడినట్టు కాకుండా.. ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినట్టుగానే దివి కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.