యాప్నగరం

Priyanka Elimination: ప్రియాంక ఎలిమినేట్.. వెళ్తున్నా మానస్.. బై బై మా‘నస’

13 వారం నామినేషన్స్‌లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. సిరి, మానస్, శ్రీరామ్, ప్రియాంక, కాజల్ ఈ ఐదుగురు నామినేషన్స్‌లో ఉండగా.. వీరిలో ఈవారం ఎలిమినేట్ అవుతారన్న లీక్ బయటకు వచ్చేసింది.

Samayam Telugu 4 Dec 2021, 8:30 pm
బిగ్ బాస్ సీజన్ 5 క్లైమాక్స్ ఫైట్ ఉత్కంఠగా సాగుతోంది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండగా.. వారిలో సిరి, ప్రియాంక, కాజల్, మానస్, శ్రీరామ్.. ఈవారం నామినేషన్స్‌లో ఉన్నారు. షణ్ముఖ్ కెప్టెన్ కావడం వల్ల నామినేషన్స్ నుంచి తప్పించుకోగా.. సన్నీని ఎవరూ నామినేట్ చేయకపోవడంతో ఈవారం నామినేషన్స్ నుంచి మినహాయింపు జరిగింది.
Samayam Telugu ప్రియాంక సింగ్ ఎలిమినేట్
Pinky Eliminated


అయితే గత వారం రవి ఎలిమినేషన్స్‌తో అంచనాలు తలకిందులయ్యాయి. టాప్ 5లో పక్కా అనుకున్న రవి ఎలిమినేషన్స్‌తో లెక్కలు మొత్తం మారిపోయాయి. దీంతో అసలు ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఓట్ల ఆధారంగా ఎలిమినేషన్స్ జరగడం లేదని గత వారం బిగ్ బాస్ షోని దుమ్మెత్తిపోశారు ఆడియన్స్.

కాగా ఈవారం అందరూ ఊహించనట్టే.. ప్రియాంక ఎలిమినేట్ అయినట్టు తాజా సమాచారం. ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. మానస్, శ్రీరామ్, కాజల్‌లు ముందే సేఫ్ కాగా.. చివరికి ప్రియాంక-సిరిలను ఉంచి వాళ్లలో ప్రియాంకను ఎలిమినేట్ చేసి.. సిరిని సేవ్ చేసినట్టు తెలుస్తోంది.

నిజానికి షణ్ముఖ్ ఈవారం నామినేషన్స్‌లో లేడు.. అతని ఓట్లు అన్నీ దండిగా సిరికి పడతాయి.. అందుకు తగ్గట్టుగానే ఆమె ఈవారం పక్కా స్ట్రాటజీతో గేమ్ ఆడింది. అయినప్పటికీ ఆమె ఓటింగ్‌లో లీస్ట్‌‌లోకి వెళ్లి ఎలిమినేషన్స్‌లో ప్రియాంకతో పోటీపడిందంటే పరిస్థితులు ఎలా మారాయో ఊహించుకోవచ్చు.


‘సమయం’ పోల్ రిజల్ట్..
ప్రతివారం మాదిరే ఈవారం కూడా ఎలిమినేషన్స్‌పై ఆడియన్స్ నుంచి ఒపీనియన్ పోల్ నిర్వహించింది సమయం తెలుగు. ఈ పోల్‌లో కూడా ప్రియాంక ఎలిమినేట్ అవుతుందని స్పష్ఠమైన అభిప్రాయాన్ని తెలియజేశారు.
ప్రియాంక-సిరిల ఈ ఎలిమినేషన్స్‌లో మధ్య టఫ్ ఫైట్ నడిచింది. 37.13 శాతం మంది ప్రియాంక ఎలిమినేట్ అవుతుందని ఓట్లు వేయగా.. 36.54 శాతం మంది సిరి ఎలిమినేట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరికీ కేవలం ఒక్క శాతం ఓట్లు తేడా ఉండటం విశేషం. ఆ తరువాతి స్థానంలో 19.84 శాతం ఓట్లతో కాజల్ ఉండగా.. శ్రీరామ్‌కి 4.13 శాతం.. మానస్‌కి 2.36 శాతం ఎలిమినేట్ అవుతారని ఓట్లు పడ్డాయి.

మొత్తానికి ప్రియాంక ఎలిమినేషన్స్‌తో మానస్ స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానస్.. మానస్ అంటూ అతని ఆట అతన్ని ఆడుకోనీయకుండా విపరీతమైన ప్రేమ చూపించి చిరాకు పుట్టించేది ప్రియాంక. ఆమె ఎలిమినేషన్స్‌తో మానస్ పుంజుకుంటాడేమో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.