యాప్నగరం

లోబో గురక.. బెంబేలెత్తుతున్న కంటెస్టెంట్లు.. మింగేస్తా అంటే ఇదా? ఓర్నాయనో

బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కావడంతో సందడి మొదలైపోయింది. సోషల్ మీడియాలో తెగ హడావిడి ఉండగా.. కంటెస్టెంట్స్‌కి సంబంధించిన ఫ్యాన్ ఫాలోయింగ్ పేజ్‌లు దర్శనం ఇస్తున్నాయి.

Samayam Telugu 6 Sep 2021, 6:36 pm
ఈ సీజన్‌కి వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌లో యాంకర్ లోబో వైవిధ్యంగా కనిపిస్తున్నాడు. తలపై చిన్న పిలక.. పిల్లి గడ్డం.. మెడలో లాకెట్‌లు.. కళ్లకి చెవులకి రింగ్‌లు.. ఆ వేషం భాషా అంతా వీడెవడ్రా బాబూ అనేట్టుగానే కనిపించాడు.
Samayam Telugu లోబో
Lobo Bigg Boss


ఆరో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన లోబో.. తన దైన యాస, భాషలతో ఆకట్టుకుంటూ కనిపించాడు. అతనిపై రూపొందించిన స్పెషల్ వీడియోలో మింగేస్తా అంటూ భయపెట్టేశాడు..

అయితే అతని అసలు మింగుడు ఏంటో నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమోలో చూపిస్తున్నాడు. డుగ్గూ.. డుగ్గూ అనే బుల్లెట్ సౌండ్‌కి మంచిన రేంజ్‌లో గుర్రూ.. గుర్రూ అని గురకపెట్టి హౌస్‌లో ఉన్న వాళ్లకి కునుకు లేకుండా బెంబేలెత్తిస్తున్నాడు లోబో. మనోడి దెబ్బకు హౌస్‌లో ఉన్నవాళ్లంతా లేచి కూర్చున్నారు. ఆ గురక సౌండ్ ఆపడానికి నానా తిప్పలూ పడుతున్నారు. యాంకర్ రవి అయితే ఆ ముక్కులో ఏదైనా పెట్టండ్రా బాబూ అని ఆ గురకను ఆపడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. ఇక సిరి హనుమంతు, జెస్సీలు ఇంట్లో వాళ్ల వస్తువుల్ని కొట్టేస్తూ కెమెరాలకు చిక్కడాన్ని ప్రోమోలో చూపించారు. ఆ ప్రోమో మీకోసం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.