యాప్నగరం

Relangi Mavayya Baladitya: బాలాదిత్య రియల్ లైఫ్‌లోనూ రేలంగి మామయ్యేనా? వాళ్లు ఛీటర్స్.. చివరికి మంచే గెలుస్తుంది: బాలదిత్య భార్య

Baladitya Bigg Boss: బిగ్ బాస్ 6 సీజన్‌లో బాలాదిత్యను అంతా రేలంగి మామయ్య అంటున్నారు. ఆయనపై బోలెడన్ని ట్రోల్స్ నడుస్తున్నాయి. అందరితోనూ మంచి అనిపించుకోవడానికి బాలాదిత్య మాస్క్ వేసుకుని ఆడుతున్నాడనే విమర్శలపై స్పందించారు బాలాదిత్య భార్య మానస లక్ష్మి.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 23 Sep 2022, 6:06 pm
బిగ్ బాస్ హౌస్‌లో ప్రతి సీజన్ ఒకరిద్దరు రేలంగి మామయ్యలు ఉంటారు.. అది అలా కాదు.. ఇది ఇలా.. అంటూ అందరి ఆట వాళ్లే ఆడేస్తూ అందరితోనూ మంచి అనిపించుకోవడానికి తెగ ప్రయత్నిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ల ఆట వాడు ఆడకుండా.. హౌస్‌లో ఉన్న వాళ్లని ఆడనీయకుండా చేస్తుంటారు. అయితే ఈ సీజన్‌లో బాలాదిత్య (Baladitya)కు రేలంగి మామయ్య అంటూ ట్రోలింగ్స్ నడుస్తున్నాయి.
Samayam Telugu Relangi Mavayya Baladitya
రేలంగి మామయ్య బాలాదిత్య


అందరితోనూ మంచి అనిపించుకోవాలనే ప్రయత్నంలో ఆయన ఆట రెండోవారం నుంచి గాడి తప్పింది. దీంతో హోస్ట్ నాగార్జున గట్టిగానే చురకలేశారు. ఈ సీజన్‌లో తొలి కెప్టెన్ అయిన బాలాదిత్య రియల్ క్యారెక్టర్ ఏంటి? అసలు ఆయన రియల్ గానే ఉంటున్నారా? లేదంటే మంచి అనిపించుకోవడానికి మాస్క్ వేసుకుని ఆడుతున్నారా? బాలాదిత్య వ్యక్తిత్వం ఏంటన్నదానిపై ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది బాలాదిత్య భార్య మానస లక్ష్మి (Baladitya Wife Manasa Lakshmi)

ఆయన ఎప్పుడూ ఒకే ఒక్క మాట చెబుతూ ఉంటారు.. ధర్మో రక్షతి రక్షితః అని చెప్తూ ఉంటారు. ఎందుకండీ అంత మంచితనం అని నేను అంటూ ఉంటాను.. కానీ ఆయన ధర్మాన్ని నమ్ముకుని ఉంటే అదే మనల్ని కాపాడుతుందని అంటారు. అలాంటి లక్షణాలు ఉన్న భర్త దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా. మంచి ఎప్పుడూ గెలుస్తుంది.. స్టార్టింగ్‌లో సమస్యలు వస్తాయి.. కానీ చివరికి మంచే గెలుస్తుంది. చెడు వెళ్లినంత ఈజీగా మంచి వెళ్లదు.. అందరికీ అర్ధం కాదు కూడా. మంచి ఒకసారి అర్ధం అయితే దాన్ని ఎవరూ కొట్టలేరు.

మా ఆయన చాలా ఎమోషనల్.. ఆయన రియల్ లైఫ్‌లో ఎలా ఉంటున్నారో.. బిగ్ బాస్ హౌస్‌లో కూడా అలాగే ఉంటున్నారు. ఫేక్ గేమ్.. సేఫ్ గేమ్ కాదు.. బై బర్త్ ఆయన అలాగే ఉన్నారు.. మనకి కనిపించే బాలాదిత్య ఒరిజినల్.. ఆయన మాస్క్ వేసుకుని ఆడటం లేదు. మా ఇంట్లో ఎలా ఉంటారో.. మంచి చెప్తారో.. బిగ్ బాస్‌ హౌస్‌లో కూడా అలాగే ఉన్నారు.

బిగ్ బాస్ టైటిల్ గెలవాలి అనుకుంటే.. స్ట్రాటజీ కూడా ముఖ్యం. అన్నింటికీ ఒకటే మందు అంటే కుదరదు. పరిస్థితిని బట్టి మారిపోవాలి. వ్యక్తిని బట్టి స్ట్రాటజీ మార్చుకోవాలి. ఇప్పుడు ఆయనకి ఎవరేంటో తెలిసింది కాబట్టి.. ఖచ్చితంగా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. ఆయన అందర్నీ నమ్ముతున్నారు.. కానీ హౌస్‌లో చాలామంది ఛీటర్స్ ఉన్నారు. నేనైతే ఎవర్నీ నమ్మను.. ఆయన అందర్నీ నమ్మేస్తారు. ఆయన గేమ్ స్టైల్ అది’ అంటూ చెప్పుకొచ్చింది బాలాదిత్య భార్య మానస లక్ష్మి.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.