యాప్నగరం

Bigg Boss Telugu 3: రాహుల్‌కి పునర్నవి ఘాటు ముద్దు.. కౌగిలింతతో ఉక్కిరిబిక్కిరి

Rahul: పునర్నవి కోసం త్యాగం చేసిన రాహుల్. నిన్నటి వరకూ గొడవపడి రాహుల్‌కి దూరంగా ఉంటున్న పునర్నవి అతను చేసిన పనికి దగ్గరకు తీసుకుని గట్టి హగ్ ఇచ్చేసింది. అంతేకాదు కౌగిలింతలతో ఉక్కిరి బిక్కిరి చేసింది.

Samayam Telugu 17 Sep 2019, 3:38 pm

బిగ్ బాస్ హౌస్‌లో వాళ్లు ఉప్పు నిప్పు. ఒకరిపై ఒకరు ఎప్పుడూ నిప్పులు కక్కుతూ ఉంటారు. కాని వాళ్ల ఇద్దరి మధ్య ఏదో జరుగుతోంది. సంథింగ్ సంథింగ్ నడుస్తోంది. లవ్ ట్రాక్ మొదలైంది.. డేటింగ్‌పై ఇద్దరి మధ్య చర్చ నడుస్తోంది.. బిగ్ బాస్ షో చూస్తున్న ప్రేక్షకులతో పాటు హోస్ట్ చేస్తున్న నాగార్జున.. గెస్ట్ హోస్ట్‌గా వచ్చిన రమ్యక్రిష్ణ సైతం ఈ ఇద్దరూ లవ్ ట్రాక్ నడుపుతున్నారనే పంచ్ పేల్చేవారు. ఆ ఉప్పు నిప్పు ప్రేమ జంటకు పెద్ద పరీక్ష పెట్టి పెట్టారు బిగ్ బాస్.
Samayam Telugu Rahul And Punarnavi


Read Also: బిగ్ బాస్ కోసం త్యాగాలు.. అన్నీ పాయే!

తొమ్మిదో వారం నామినేషన్స్‌లో భాగంగా.. పునర్నవి, రాహుల్‌లకు ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ తెలుసుకునేందుకు బిగ్ బాస్ ఇంట్రస్టింగ్ టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఉంచిన టెలిఫోన్ బూత్‌కి ఫోన్ చేసి పునర్నవితో మీరు.. ఈవారం ఎలిమినేషన్‌కి మీరు డైరెక్ట్‌గా నామినేట్ అయ్యారని దీన్నిండి తప్పించుకోవాలంటే.. రాహుల్ మీకోసం 20 గ్లాస్‌ల కాకరకాయ జ్యూస్ తాగాలని టాస్క్ ఇచ్చారు.

Read Also: బిగ్ బాస్ కెప్టెన్‌గా వితికా.. ఇదేం పెర్ఫామెన్స్ తల్లో!! ఫస్ట్ టైం ఇలా

ఇప్పటికే పునర్నవితో గొడవపడి కోపంగా ఉన్న రాహుల్‌ని పిలిచి నాకోసం కాకరకాయ జ్యూస్ తాగాలట తాగుతావా? అని అడిగింది పునర్నవి. నీకోసం కాకరకాయ రసం ఏంటి? విషం తాగమన్నా తాగేస్తా అనుకున్నాడో ఏమో కాని.. వాంతులు చేసుకుంటూ మరీ 20 గ్లాస్‌ల కాకరకాయ రసాన్ని పూన్నూ కోసం అమృతం తాగినట్టు తాగేశాడు. దీంతో రాహుల్‌ని దగ్గరకు తీసుకుని డీప్ హగ్ ఇవ్వడమే కాకుండా.. ఘాటు ముద్దు ఇచ్చేసింది పునర్నవి.

Read also : చాపకింద నీరులా హిమజ.. నామినేషన్స్ నుంచి సేవ్, ఎక్కువ ఓట్లు ఆమెకే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.