యాప్నగరం

RGV: వర్మతో అరియానా ఎఫైర్.. బోల్డ్ ఇంటర్వ్యూలో పచ్చి నిజాలు.. A సర్టిఫికేట్ మూవీని మించి

రామ్ గోపాల్ వర్మ.. పచ్చిగా నిస్సిగ్గుగా బోల్డ్ సినిమాలు తీయడంతో దిట్ట అయితే.. యాంకర్ అరియానా అంతే నిస్సిగ్గుగా బోల్డ్ యాంకర్‌గా పేరు. ఈ ఇద్దరు కలిసి చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలో పచ్చి నిజాలను బయటపెట్టారు.

Samayam Telugu 19 Jun 2021, 2:52 pm
సాధారణ ఓ మామూలు యాంకర్‌ అరియానా గ్లోరీ.. బిగ్ బాస్‌కి వెళ్లడం ద్వారా క్రేజ్ దక్కించుకుంది. అయితే ఆమె బిగ్ బాస్ వెళ్లడానికే కారణం వివాదాల దర్శకుడు వర్మ. ఆయనతో అరియానా చేసిన ఇంటర్వ్యూ ద్వారా బిగ్ బాస్ ఛాన్స్ అందుకుని.. అనూహ్యంగా ఫైనల్‌కి వెళ్లింది అరియానా.
Samayam Telugu అరియానా, రామ్ గోపాల్ వర్మ
ariyana rgv interview


‘నీ ఫిగర్ అంటే ఇష్టం.. నీ తొడలు అంటే ఇష్టం.. నిన్ను బికినీలో చూడాలని ఉంది’ అంటూ వర్మ.. అరియానా ఇంటర్వ్యూలో పచ్చిగా నిస్సిగ్గుగా మాట్లాడటంతో యాంకర్ అరియానా పాపులర్ అయ్యి హాట్ టాపిక్ అయ్యింది.

అయితే అరియానా బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా.. వర్మ ట్వీట్ చేసి ఆమెకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అసలు బిగ్ బాస్ షోనే చూడని వర్మ.. అరియానా గురించి ట్వీట్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ పుకార్లు షికారు చేశాయి.

కాగా ఈ పుకార్లకు మరింత బలాన్ని ఇస్తూ.. తాజాగా అరియానా వర్మలు రెచ్చిపోయారు. ‘అరియానా బోల్డ్ టాక్ విత్ ఆర్జీవీ’ అంటూ తాజా ఇంటర్వ్యూకి సంబంధించిన టీజర్ విడుదల చేయగా అందులో అరియానా జిమ్ డ్రెస్‌లో అందాల ప్రదర్శన చేస్తుంటే వర్మ ఆమెను ఎక్కడెక్కడో పట్టుకుంటూ ఆ టీజర్‌ని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రమోట్ చేశారు.

దీంతో ఈ ఇంటర్వ్యూ ఫుల్ వీడియో ఎప్పుడెప్పుడు చూద్దామా? వర్మ, అరియానా అభిమానుల ఆసక్తిగా ఎదురుచూడగా.. శనివారం నాడు ఫుల్ వీడియో విడుదల చేశారు. అయితే టీజర్ నుంచి ఎక్స్ పెక్ట్ చేసినట్టుగానే ఈ ఫుల్ ఇంటర్వ్యూ వీడియో ఓ రేంజ్‌లో ఉంది. అరియానా అంగాంగ ప్రదర్శనను వర్మ మార్క్ డైరెక్షన్ వివిధ భంగిమల్లో చూపించారు. నగ్నం సినిమాలో హీరోయిన్ శ్రీరాపాకను చూపించినట్టుగా ఎక్కడెక్కడో కెమెరాలు పెట్టి వర్మ తన దర్శకత్వ ప్రతిభను చూపించారు.

వీడియో స్టార్టింగ్ నుంచి రచ్చ ప్రారంభమైపోయింది. ఆర్జీవీ జిమ్‌లో ఉండగా.. ఆయ్ ఆర్జీవీ సార్ అంటూ ఎంట్రీ ఇచ్చింది అరియానా. ఆమెను చూసిన వర్మ షాకైపోయి.. అరియానా అందాలను వర్ణించడం మొదలుపెట్టాడు. ‘దివి నుంచి దేవత దిగివచ్చినట్టుగా ఉంది.. వావ్ అరియానా.. వాట్ ఏ fU*** డ్రెస్. బ్లాక్ అండ్ గోల్డ్.. నా ఫేవరెట్ కలర్స్.. అన్నింటికన్నా నీ క్యాస్ట్యూమ్స్ కంటే నీ బెటర్ క్యాస్టూమ్స్ దేవుడు ఇచ్చిన నీ తొడలు.. నీ థైస్ అంటే నాకు చాలా ఇష్టం ఇంతకు ముందు కూడా చెప్పానని వర్మ అనడంతో పొంగిపోయిన అరియానా.. వర్మని మించిపోతూ.. ‘మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చా’ అని అడగడంతో.. వర్మ భలే ఛాన్స్‌లే అనుకుని.. వావ్ ఈరోజు నా రోజు.. రా అని అరియానా పట్టుకుని గట్టిగా హగ్ చేసుకున్నాడు.

ఆ తరువాత రా అరియానా నాతో పాటు జిమ్‌లో జాయిన్ అవ్వు అంటే.. నాకు వర్కౌట్స్ రావని చెప్పింది అరియానా. దీంతో వర్మ.. ‘నీకు జిమ్ అలవాటు లేకపోతే ఇంత మంచి ఫిగర్ ఎలా వచ్చింది’ అని అన్నారు. బ్లెస్సింగ్స్ వల్ల నాకు ఈ ఫిగర్ వచ్చి ఉంటుంది అని చెప్పింది అరియానా. ఆ తరువాత ఏం పర్లేదు నీకు వర్కౌట్స్ నేను నేర్పిస్తా రా అని అనడంతో అరియానా జిమ్ డ్రెస్‌లోకి మారిపోయింది. ఆ తరువాత మొదలైంది అసలు రచ్చ.

బ్లాక్ జిమ్ డ్రెస్‌లో నాభి, ఎదభాగం మొత్తం కనిపించేట్టుగా అరియానా డ్రెస్ వేసుకోగా.. వర్మ ఆమెకు ఎక్కడెక్కడో కెమెరాలు పెట్టి.. A సర్టిఫికేట్ సినిమా మించి అరియానాను వివిధ భంగిమల్లో చూపించాడు.

ఆ తరువాత అరియానా వర్కౌట్స్ చేస్తూనే వర్మను ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది. ‘మీరు అసలు బిగ్ బాస్ చూడరు కదా.. నాకోసం బిగ్ బాస్ చూసి ట్వీట్ చేశారు’? ఎందుకు అని అడిగింది.

వర్మ జవాబు..
నేను ఫస్ట్ టైం బిగ్ బాస్ సన్నీ లియోని కోసం చూశాను.. ఎందుకంటే.. ఆమె ఫోర్న్ స్టార్, ఆమె అందం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నీకోసం ఎందుకు చూశానంటే.. నాకు నువ్వంటే ఇష్టం.. నీ అందం అంటే ఇష్టం. కానీ మనిద్దరమే ఉన్నప్పుడు నిన్నొక్కదాన్నీ చూస్తాను కానీ.. నిన్ను చూడటానికి బిగ్ బాస్ చూసి.. ఆ మిగిలిన 15 వెధవ ముఖాలను చూడాల్సిన అవసరం నాకేంటి?

అరియానా: బిగ్ బాస్‌లో నాకోసం ట్వీట్ చేశారు కదా.. దాని వల్ల మీకు నాకు ఎఫైర్ ఉందని అంటున్నారు. మీకు నేను చాలా క్లోజ్ అని చాలామంది అనుకుంటున్నారు. దీనిపైఏమంటారు?

వర్మ: ఎస్.. చాలామంది ఫ్రెండ్ షిప్ అంటే తట్టుకోలేరు. వాడు అలాంటోడు.. ఇది ఇలాంటిది అని చెప్పకపోతే సోషల్ మీడియాలో ఉన్నవాళ్లకి నిద్ర పట్టదు. వాళ్ల మాటల్ని పట్టించుకోవాల్సిన పనిలేదు.

అరియానా: నేను చాలా బోల్డ్‌గా ఉంటా.. అందుకే అబ్బాయితో ఫ్రెండ్ షిప్ అంటే ఎఫైర్ అని.. వీళ్లిద్దరికీ ఏదో ఉందని అనుకుంటారు. ఆ టైంలో అమ్మాయి, అబ్బాయి ఎలా రియాక్ట్ అవ్వాలి?

వర్మ: వాళ్లకి ఇష్టం వచ్చింది చేయాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.