యాప్నగరం

బిగ్ బాస్ హౌస్‌లో రవి కూతురు.. కళ్లు చెమర్చే సీన్.. ఈ దెబ్బతో రవి‌పై ఉన్న నెగిటివిటీ మటాష్

Bigg Boss- 5 Promo: తాజాగా ఈ రోజు ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ వీడియో పలువురి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. నేటి ఎపిసోడ్ కోసం రవి భార్య నిత్య, కూతురిని వియా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చారు.

Samayam Telugu 26 Nov 2021, 1:31 pm
ఎప్పటిలాగే ఈ సారి కూడా బుల్లితెరపై బిగ్ బాస్ హవా నడుస్తోంది. గత రెండు నెలలకు పైగా సాగిపోతున్న ఈ షో ఇక చివరి దశకు చేరుతుండటంతో అందరిలో ఉత్కంఠ మొదలైంది. ఈ సారి బిగ్ బాస్ ట్రోఫీ ఎవరికి దక్కుతుందనే దానిపై చర్చలు షురూ అయ్యాయి. మరోవైపు ఎప్పటికప్పుడు కంటిస్టెంట్లకు ఫన్నీ అండ్ ఎమోషనల్ టాస్కులు ఇస్తూ షో రక్తి కట్టిస్తున్నారు బిగ్ బాస్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రోజు ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ వీడియో పలువురి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది.
Samayam Telugu బిగ్ బాస్ హౌస్‌లో రవి కూతురు.. కళ్లు చెమర్చే సీన్
Bigg Boss Latest Promo


గత కొన్ని రోజులుగా ఫ్యామిలీ ఎపిసోడ్స్‌తో బిగ్ బాస్ హౌస్‌ ఎమోషనల్ డ్రామాను పిండేస్తోంది. ఇప్పటికే మానస్, సిరి, శ్రీరామ్, సన్నీ, కాజల్ కుటుంబ సభ్యులను హౌస్ లోకి వచ్చారు. దీంతో యాంకర్ రవి ఫ్యామిలీ ఎప్పుడెప్పుడు హౌస్ లోకి అడుగుపెడుతుందా? రవి కూతురిని చూశాక ఆయన ఫీలింగ్స్ ఎలా ఉంటాయనే దానికోసం జనం ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఎదురుచూపులకు తెరదించుతూ నేటి ఎపిసోడ్ కోసం రవి భార్య నిత్య, కూతురు వియాను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చారు.

ఆ ఇద్దరినీ చూశాక రవి ఆనందానికి హద్దులే లేవు. ముందుగా తన భార్య నిత్యను ప్రేమగా హత్తుకున్న రవి.. ఆ తర్వాత 'పప్పా ఐ లవ్ యూ' అంటూ కూతురు వాయిస్ వినిపించగానే పరుగెత్తుకుంటూ వచ్చి తన కూతురిని కౌగిలించుకొని ఎమోషనల్ అయ్యాడు. డాడీ ఎలా ఆడుతున్నాడని ఆ చిట్టితల్లిని అడగడంతో చాలా బాగా ఆడుతున్నావని ఆమె చెప్పింది. డాడీని చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పడం, ఆ తర్వాత రవి అన్నీ మరచిపోయి తన కూతురితో సరదాగా ఆడుకోవడం చూపించి నేటి ఎపిసోడ్‌పై ఇంట్రెస్ట్ పెంచారు. ఇక రవి ఫ్యామిలీ హౌస్ నుంచి బయటకు వెళ్లే సీన్, ఆ ఎమోషన్స్ అందరి చేత కంటతడి పెట్టిస్తున్నాయి.
నాగ చైతన్య లవ్ ఎఫైర్.. స్టార్ హీరో కూతురితో చెట్టాపట్టాల్! సమంతను పెళ్లాడకముందు ఇంత జరిగిందా..?
యాంకర్‌గా బిగ్ సక్సెస్ అందుకున్న రవి.. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక ట్రోల్స్ బారిన పడ్డారు. రవితో పాటు ఆయన కూతురు వియాపై కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ హౌస్‌లో రవి కూతురు వియా ఎంట్రీ ఇవ్వడం, తండ్రీకూతుళ్ళ మధ్య చోటుచేసుకున్న ఎమోషన్స్ రవిపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. హౌస్‌లో రవి కూతురు వియా సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచిందని, ఈ దెబ్బకు రవిపై నెలకొన్న నెగిటివిటీ మటాష్ అని అంటున్నారు నెటిజన్లు. మొత్తానికి ఈ ప్రోమో కట్ చేసిన తీరు బిగ్ బాస్ పార్టిసిపెంట్‌గా రవికి బాగా ప్లస్ అయిందనే చెప్పుకోవాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.