యాప్నగరం

Bigg Boss Telugu 4: 'బిగ్ బాస్ 4' కీలక అప్‌డేట్.. రంగంలోకి దిగిన నాగార్జున.. ప్రోమో షూట్ ఫినిష్

ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన 'బిగ్ బాస్ 4' కోసం ప్రేక్షకలోకం ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షోకి సంబంధించిన కీలక అప్‌డేట్ బుల్లితెర ఆడియన్స్‌ని హుషారెత్తిస్తోంది.

Samayam Telugu 1 Aug 2020, 12:11 pm
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 4' ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. కరోనా కారణంగా ఈ ఏడాది బిగ్ బాస్ ఉండదేమో అని జనాల్లో ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఇటీవలే ఈ షో టైటిల్ ప్రోమో రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించింది బిగ్ బాస్ యాజమాన్యం. అయితే ఈ షో ఎప్పుడు ప్రారంభమవుతుంది? హోస్ట్ ఎవరు? అనే దానిపై జనాల్లో క్యూరియాసిటీ నెలకొన్న నేపథ్యంలో తాజాగా అప్‌డేట్‌తో దీనిపై క్లారిటీ వచ్చేసింది.
Samayam Telugu బిగ్ బాస్ 4 కీలక అప్‌డేట్.. రంగంలోకి దిగిన నాగార్జున.. ప్రోమో షూట్ ఫినిష్
Bigg Boss 4


అందరూ అనుకున్నట్లుగానే 'బిగ్ బాస్ 4' హోస్ట్‌గా మరోసారి నాగార్జుననే కనిపించబోతున్నారు. 'బిగ్ బాస్ 4' ప్రోమో షూట్ కోసం చాలాకాలం తర్వాత సెట్స్ పైకి వచ్చారు నాగార్జున. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్స్‌లో ఈ షో ప్రోమోను చిత్రీకరించారు. దీనికి దర్శకుడు కల్యాణ్ కృష్ణ (సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్) దర్శకత్వం వహించగా, ప్రముఖ కెమెరామేన్ కె.కె.సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు. ఈ షూటింగ్‌తో అన్నపూర్ణ స్టూడియోస్‌ వాతావరణం సందడిగా మారింది. ఇందులో నాగార్జున గెటప్ అదిరిందని అంటున్నారు.

Also Read: నాగచైతన్య అంటే ఇష్టం ఆ కోరిక తీరితే చాలు.. సమంత ఫీలైతే నాకేంటి? జబర్దస్త్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

తాజాగా షూట్ చేసిన ఈ 'బిగ్ బాస్ 4' ప్రోమో వీడియోను త్వరలోనే టీవీల్లో కూడా ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ షోలో కనిపించబోయే పార్టిసిపెంట్స్ ఎంపిక కూడా పూర్తయిందని తెలుస్తోంది. అతిత్వరలో షూట్ స్టార్ట్ చేసి ఆగస్టు నెలలోనే ప్రసారం చేసేలా ఏర్పాట్లు ముమ్మరం చేశారట. కాగా గత సీజన్‌లా 100 రోజులు కాకుండా ఈ సారి కేవలం 75 రోజుల్లోనే ఈ షో ఫినిష్ చేయబోతున్నారని టాక్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.