యాప్నగరం

Mehaboob పుచ్చ పగిలిపోద్దా? మోకాళ్ల చిప్పలు విరిగిపోతాయ్ జాగ్రత్త: నాగార్జున వార్నింగ్ మామూలుగా లేదుగా

పిచ్చ పగిలిపోద్ది అంటూ ఇంటి సభ్యుల్ని హెచ్చిరిస్తూ రౌడీలా వ్యవహరించిన మెహబూబ్‌కి నిజంగానే పుచ్చలేపేశారు హోస్ట్ నాగార్జున.

Samayam Telugu 10 Oct 2020, 7:33 pm
నాగార్జున మంచి ఫైర్ మీద ఉన్నారు.. బిగ్ బాస్ హౌస్‌లో గత వారం రోజులుగా జరుగుతున్న రచ్చపై ఒక్కొక్కరికి బుద్ధి చెప్పేందుకు కొరడా పట్టుకుని ఎంట్రీ ఇచ్చారు. శనివారం నాటి ఎపిసోడ్ ప్రోమోలను ఒక్కొటిగా విడుదల చేస్తుండగా.. అఖిల్, అభిలకు మాడు పగలగొట్టారు. అలాగే అమ్మాయిలపై అరుస్తున్న సొహైల్‌కి క్లాస్ పీకారు.
Samayam Telugu నాగార్జున, మెహబూబ్
Nagarjuna Bigg Boss


ఇక గత వారం హోటల్ టాస్క్‌లో నా జోలికొస్తే ఒక్కొక్కడికీ పుచ్చ పగిలిపోతుంది అంటూ రౌడీలా బిహేవ్ చేసిన మెహబూబ్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చారు నాగార్జున.

తాజా ప్రోమోలో.. ‘మెహబూబ్ ఏమౌతుంది?? పుచ్చ పగిలిపోతుందా?? ఏంటయ్యా ఆ మాటలు.. బయట ఏదైనా హోటల్‌కి వెళ్లి అలా మాట్లాడితే మెడ పట్టుకుని బయటకు నెట్టేస్తారు.. అంతేకాదు 100కి ఫోన్ చేసి పోలీస్‌లను రప్పిస్తారు.. వాళ్లు తీసుకువెళ్లి మోకాళ్ల చిప్పలు విరగ్గొడతారు’ అంటూ మెహబూబ్ తలపొగరు మొత్తాన్ని దించేశారు నాగార్జున.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.