యాప్నగరం

​Geetu Royal​: థియేటర్‌లో రచ్చరచ్చ చేసిన గీతూ.. 'ఆ గెంతుడేంది, ఆ అరుపులు ఏందక్కా'!

గీతూ రాయల్ గుర్తుందా? అయ్యో ఇదేం ప్రశ్నరా వెర్రి బాగులోడా అనుకుంటున్నారా? అవునులే గీతూను ఎలా మర్చిపోతారు.. బిగ్‌బాస్-6లో మరి గీతూ చేసిన హంగామా ఆ రేంజ్‌లో ఉంది కదా. తాజాగా థియేటర్‌లో గీతూ రచ్చ రచ్చ చేసింది.

Authored byఆర్ కే మురళీ కృష్ణ | Samayam Telugu 8 Apr 2023, 3:51 pm
బుల్లితెర ప్రేక్షకులు ఎన్ని బిగ్‌బాస్‌లు చూసినా 'బిగ్‌బాస్-6' మాత్రం వేరంతే. ఎందుకంటే ఈ సీజన్‌లో వచ్చిన గొడవలు, హౌస్‌మేట్స్, వాళ్ల ఎఫైర్లు, పంచాయితీలు చూసి ఆడియన్స్ బుర్రలు బాదుకున్నారు. మరి ఈ సీజన్ కంటెస్టెంట్లలో ఒకరైన గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గీతూ వాయిస్ వింటేనే మిగిలిన కంటెస్టెంట్లు పారిపోయేవారు. ఇక గొడవ పెట్టుకుంటే చిత్తడి అయిపోయేది.
Samayam Telugu Geetu Royal
: గీతూ రాయల్


హౌస్‌లోనే గీతూ అలా ఉంటే మరి బయట ఎలా ఉంటుందో చెప్పాలా? తాజాగా గీతూ వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. థియేటర్లో సినిమా చూడకుండా గీతూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మరి ఆ సంగతేంటో చూసేద్దాం రండి.

రచ్చరచ్చ చేసేసింది

ఏదో ఫ్యాన్స్ హ్యాపీనెస్ కోసం ఈ మధ్య వాళ్ల అభిమాన హీరోల సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్నారు. దీనికి రెస్పాన్స్ కూడా గట్టిగానే వస్తుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా 'దేశముదురు' సినిమాను రీ-రిలీజ్ చేశారు. ఇంకేముంది ఫ్యాన్స్ థియేటర్లకు పొలోమని పోయారు. అందరిలానే మన గీతు అక్క కూడా పోయింది. వెళ్లింది.. సినిమా చూసి ప్రశాంతంగా వచ్చిందా అంటే.. లేదే. స్క్రీన్‌పైన అల్లు అర్జున్ చెప్పే డైలాగులన్నీ గీతూనే చెప్పేసింది. అది కాకుండా మళ్లీ స్క్రీన్ దగ్గరికి వెళ్లి గెంతులేసి, డ్యాన్స్‌లు, అరుపులు, కేకలు, ఈలలు.. అబ్బబ్బా గీతూ చేసిన రచ్చ, హడావిడి మాములుగా లేదు.

View this post on Instagram A post shared by Geetu Royal (@geeturoyal_)

ఇవన్నీ వీడియోలు తీసి గీతూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అసలే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎదురుచూసే నెటిజన్లు ఈ వీడియోలు చూసి కామెంట్ బాక్సును నింపేశారు. "ఆ గెంతుడేంది, ఆ కేకలు ఏంది అక్కా, మమ్మల్ని ప్రశాంతంగా సినిమా చూడనీవా, సినిమా మొత్తం చెప్పెస్తావా" అంటూ పిచ్చ కామెంట్లు పెట్టారు.

View this post on Instagram A post shared by Geetu Royal (@geeturoyal_)

ఇంతకీ ఎవరి ఫ్యాన్

థియేటర్‌లో ఫ్యాన్స్ రచ్చ చేయడం మాములే.. కానీ గీతూ కుదురుగా కూర్చున్న వాళ్లని లేపి మరి కేకలు, ఈలలు వేయిస్తుంది. మొన్నా మధ్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజుకు రీ- రిలీజ్ చేసిన ఆరెంజ్ సినిమాకు కూడా గీతూ వెళ్లింది. అక్కడ కూడా ఇదే తంతు. ఇప్పుడు దేశముదురు సినిమాకు వెళ్లి ఇలా రచ్చ చేసి వచ్చింది. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు.. "అక్కా నువ్వు ఇంతకీ ఎవరి ఫ్యాన్" అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది అయితే గలాటా గీతూ అనే పేరుకు తగ్గట్లే పనులు ఉన్నాయి అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram A post shared by Geetu Royal (@geeturoyal_)
Subhasya Seeghram: సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయి.. కానీ: 'శుభస్య శీఘ్రం' హీరోయిన్
రచయిత గురించి
ఆర్ కే మురళీ కృష్ణ
ఆర్‌కే మురళీ కృష్ణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.