యాప్నగరం

Jessie Bigg Boss: నాకు కాబోయే భార్య సిరిలా ఉండాలి.. ఆ క్వాలిటీస్ ఉండాలి: జెస్సీ

సిరి హనుమంత్ శ్రీహాన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది.. చాలా ఏళ్లుగా అతనితో రిలేషన్‌లో ఉంది.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. కానీ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తరువాత షణ్ముఖ్‌తో కనెక్ట్ అయ్యింది.. హగ్‌లు కిస్‌లతో బిగ్ బాస్ హౌస్‌లో డర్టీ పిక్చర్ చూపిస్తోంది.

Samayam Telugu 1 Dec 2021, 6:42 pm
బిగ్ బాస్ హౌస్‌ నుంచి హెల్త్ ఇష్యూస్‌తో బయటకు వచ్చేశాడు జెస్సీ అలియాస్ జస్వంత్ పడాల. షణ్ముఖ్, సిరి, జెస్సీలకు బిగ్ బాస్ హౌస్‌లో త్రిమూర్తులుగా పేరు.. ఈ ముగ్గురి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ బాండ్ ఉండేది. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా గేమ్ ఆడేవారు. జెస్సీ అనారోగ్యం పాలైన టైంలో సిరి ఇతనికి అన్నీ తానై చూసుకుంది. దీంతో సిరి అంటే జెస్సీకి విపరీతమైన అభిమానం ఉండేది. కొన్ని సందర్బాల్లో షణ్ముఖ్‌తో అయినా దూరంగా ఉన్నాడు కానీ.. సిరి‌తో క్లోజ్‌గా ఉండేవాడు జెస్సీ. అయితే ఎలిమినేషన్ తరువాత కూడా సిరిపై అదే అభిమానాన్ని చూపిస్తున్నాడు జెస్సీ.
Samayam Telugu సిరి హనుమంత్-జెస్సీ
Siri Hanmanth


బయట శ్రీహాన్‌తో రిలేషన్‌లో ఉండి.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీగా ఉన్న సిరి.. బిగ్ బాస్ హౌస్‌కి వెళ్ళిన తరువాత షణ్ముఖ్‌కి దగ్గరైంది. కుదిరితే హగ్.. కుదరకపోతే కిస్ అన్నట్టుగా ఈ ఇద్దరూ రొమాన్స్‌లో తేలిపోతూ బిగ్ బాస్ హౌస్‌ను హీటెక్కిస్తున్నారు. అటు సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ వచ్చి.. వదిలేస్తున్నావా? అని అడిగే పరిస్థితి వరకూ వీళ్ల మ్యాటర్ వచ్చిందంటే సిరి-షణ్ముఖ్‌లు ఏ రేంజ్‌లో హద్దులు దాటేశారో అర్ధం చేసుకోవచ్చు.

ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి.. వీళ్లిద్దరికీ చురకలేసి వెళ్లినా కూడా సిరి-షణ్ముఖ్‌ల ప్రవర్తనలో మార్పురాలేదు.. మళ్లీ హగ్‌ల యుద్ధం మొదలుపెట్టేశారు. షణ్ముఖ్ నీతో హగ్‌లు వద్దమ్మా అని పైకి అంటున్నా.. సిరి కోరి కోరి ఇస్తున్న హగ్‌లను కాదనలేకపోతున్నాడు. మొత్తంగా ఈ ఇష్యూలో సిరి హనుమంత్‌పై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్స్ వస్తున్నాయి. ఆమె ప్రియుడు ముందు తప్పును ఒప్పుకుని గుంజీలు తీసినా.. ఆమె పద్దతి ఏమాత్రం మారలేదంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో ఏకిపారేస్తున్నారు. సినీ నటి మాధవీలత అయితే.. సిరి ఆడదే కాదంటూ అదో ఆడపాము అంటూ తీవ్ర విమర్శలు చేసింది.

ఈ నేపథ్యంలో సిరి స్నేహితుడు.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన జెస్సీ తనకి సిరిలాంటి అమ్మాయి భార్యగా కావాలంటే షాకింగ్ కామెంట్స్ చేశాడు.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత నాకు లవ్ ప్రపోజ్‌లు వస్తున్నాయి.. నేనే చేస్తుంటా.. నేను మోడల్‌గా ఉన్నప్పుడు ఎవరైనా ఐ లవ్యూ చెప్తే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది.. ఇప్పుడు అందరూ జెస్సీ ఐ లవ్యూ ఐ లవ్యూ అంటున్నారు. అది ఏ లవ్వో అర్థం కావడంలేదు.. అందుకే నేను తిరిగి ఐ లవ్యూ చెప్తున్నా. కలిసి మాట్లాడుకున్నప్పుడు అభిప్రాయాలు కలుస్తాయి.

నాకు కాబోయే భార్య ఎలా ఉండాలంటే.. సిరిలా ఉండాలి. సిరిలో ఉన్న క్వాలిటీస్ నాకు కాబోయే భార్యకి ఉండాలి. సిరి నన్ను ఎలా చూసుకుందో మీరంతా చూశారు.. అంత కేరింగ్‌ చూసుకోవాలి. సిరి తిట్టినా సరే.. మళ్లీ వెంటనే వచ్చి నాకు వాల్సింది చేసేది. తినిపించేది.. హెడ్ మసాజ్ చేసేది. సిరి నన్ను ఫ్యామిలీ పర్సన్‌లా చూసింది. ఏదైనా చెప్తే సిరి వింటుంది.. అందుకే ఆమె నాకు నచ్చుతుంది’ అని ప్రేమ కురిపించాడు జెస్సీ.

అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా.. సిరి హనుమంత్ శ్రీహాన్‌తో రిలేషన్‌లో లేకపోతే తాను ట్రై చేసే వాడినని ఓపెన్‌గానే చెప్పాడు జెస్సీ. అంతేకాదు.. ముద్దు పెట్టు హగ్ ఇవ్వి అని సిరిని జెస్సీ అడుక్కున్న సందర్బాలు చాలానే ఉన్నాయి. మొత్తానికైతే సిరిపై ఉన్న అమితమైన ప్రేమను ఇలా వ్యక్తపరిచాడు జెస్సీ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.