యాప్నగరం

బిగ్ బాస్ హౌస్‌లో అడల్ట్ సీన్స్! మాధవీలత వద్ద వీడియోలు.. బావ- మరదలు రిలేషన్‌‌పై ఓపెన్ కామెంట్స్

Bigg Boss season 5 Telugu: గత కొద్దిరోజులుగా బిగ్ బాస్ షోపై విరుచుకుపడుతున్న సినీ నటి మాధవీలత.. తాజాగా హౌస్‌లో చోటు చేసుకుంటున్న అడల్ట్ సీన్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు పెట్టింది.

Samayam Telugu 19 Nov 2021, 7:40 am
బుల్లితెర భారీ రియాలిటీ షో బిగ్ బాస్ షో గురించి ఎన్నో అనుమానాలు మరెన్నో అపోహలు. తొలి సీజన్ మొదలుకొని నేటి ఐదో సీజన్ వరకూ అలాంటి అనుమానాలకు ఫుల్‌స్టాప్ పడింది లేదు గానీ షో మాత్రం సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇది స్క్రిప్ట్డ్ అని, బిగ్ బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్ అని ఇలా ఎన్నెన్నో ఆరోపణలు వచ్చినా బిగ్ బాస్ హౌస్‌లో నడిచే రచ్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా బిగ్ బాస్ షోపై విరుచుకుపడుతున్న సినీ నటి మాధవీలత.. తాజాగా హౌస్‌లో చోటు చేసుకుంటున్న అడల్ట్ సీన్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
Samayam Telugu బిగ్ బాస్ హౌస్‌లో అడల్ట్ సీన్స్.. మాధవీలత వద్ద వీడియోలు
Bigg Boss 5- Maadhavi Latha


బిగ్ బాస్ హౌస్‌ అనేది ముద్దులు, హగ్గులు, రొమాన్స్‌కి అడ్డాగా మారిందనేది మాధవీలత చెప్పాలనుకున్న విషయం. బిగ్ బాస్ షోలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు, హోస్ట్‌పై ఓ రేంజ్‌లో మండిపడుతూ రీసెంట్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించిన మాధవీలత.. ఇందులో అనాగరిక చర్యలు జరుగుతున్నాయని ఏకిపారేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన లేటెస్ట్ ఎపిసోడ్‌, అందులోని అడల్ట్ సీన్స్ ఆమె దృష్టికి రావడంతో మరోసారి ఓపెన్ అవుతూ బిగ్ బాస్ అనేది లవర్స్ అడ్డాగా మారుతోందని పేర్కొంటూ వరుస పోస్టులు పెట్టింది.

షన్ను, సిరి, మానస్, పింకీ ఇలా బిగ్ బాస్ కంటిస్టెంట్స్ పేర్లు తీస్తూ కామెంట్స్ చేసిన మాధవీలత.. మరదలు అంటే రొమాన్స్ కాదు.. సరదా, సంతోషం. బావ- మరదలు మన సంప్రదాయంలో బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ రిలేషన్ అని పేర్కొంది. ఇక తాజా ఎపిసోడ్‌లో జరిగిన రగులుతోంది మొగలిపొద సీన్స్‌పై తనకు చాలామంది మెసేజ్ చేశారని, ఆ వీడియో దొరికితే తనకు పంపించండని తెలిపింది.
మా పెద్ద దిక్కు!.. చిరంజీవిపై బ్రహ్మాజీ కామెంట్స్.. ట్విట్టర్‌లో రచ్చ
''చక్కగా గుడ్ నైట్ చెప్పేసి చల్లగా పడుకుందాం మార్నింగ్ కార్తీక పూర్ణిమ ఉంది కదా అనుకుంటే.. బిగ్ బాస్‌లో రగులుతోంది మొగలిపొద సీన్స్ జరిగాయి, గుస గుస అని మెసేజీలు పెడితే ఎలా బజ్జుకోవాలి నేను. అయ్యో రామా ఎంత కష్టమొచ్చింది నాకు. బిగ్ బాస్ హౌస్ లవర్స్ అడ్డా.. మనం ఇందులో పడ్డా అవుతాం చెడ్డా.. కృష్ణ కృష్ణ.. పగవాడికి కూడా వద్దు ఈ బాధ'' అని పేర్కొన్న మాధవీలత.. ఆ వెంటనే 'బిగ్ బాస్ రగులుతోంది మొగలిపొద' వీడియోలు తనకు రిసీవ్ అయ్యాయని, కాకపోతే వాటిని పబ్లిష్ చేయడం కల్చర్ కాదు అని పేర్కొంది. కాగా, ఇలా బిగ్ బాస్ షోపై మాధవీలత విరుచుకుపడుతున్న తీరు జనాల్లో హాట్ టాపిక్ అయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.