యాప్నగరం

Anee Master: ఆనీ మాస్టర్‌పై కాజల్ కూతురు షాకింగ్ కామెంట్స్.. శ్రీరామ చంద్ర, రవిలకు ఇచ్చిపడేసింది

మంచి ఎమోషనల్ డ్రామాతో బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్ నడుస్తోంది. బుధవారం నాటి ఎపిసోడ్‌లో ఆర్జీ కాజల్ భర్తతో పాటు కూతురు ఆర్షీన్ కూడా బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేశారు.

Samayam Telugu 25 Nov 2021, 6:12 pm
గత వారం ఎలిమినేట్ అయిన ఆనీ మాస్టర్ ప్రవర్తన చూసి ప్రేక్షకులకు చిర్రెత్తుకొచ్చింది. సాటి మహిళ అని చూడకుండా కాజల్‌ని దారుణంగా హేళన చేస్తూ విక్కిరిస్తూ డాన్స్ చేస్తూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది. దీంతో ఆనీ మాస్టర్ ఆస్కార్ పెర్ఫామెన్స్ చూడలేక ప్రేక్షకులు ఆమెను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపేశారు. అయితే కాజల్ విషయంలో ఆనీ మాస్టర్ ప్రవర్తించిన తీరుతో విమర్శలపాలైంది.
Samayam Telugu కాజల్ కూతురు
rj kajal daughter


తన తల్లిని హేళన చేస్తూ.. ఏడిపించిన ఆనీ మాస్టర్‌కి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చింది కాజల్ కూతురు ఆర్షీన్. ఫ్యామిలీ ఎపిసోడ్‌లో భాగంగా ఆర్షీన్ తన తండ్రితో కలిసి బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆనీ మాస్టర్ ఎలిమినేషన్ తరువాత శ్రీరామ చంద్ర తనలోకి అసలు రంగుని బయటపెడుతూ కాజల్‌ని టార్గెట్ చేస్తున్నాడు. ఇక రవి అయితే తొలి నుంచి కాజల్‌ని బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలా బయటకు పంపాలా అని స్కెచ్‌లు వేస్తూనే ఉన్నాడు.

అటు శ్రీరామ్.. ఇటు రవి ఈ ఇద్దరికీ కాజల్ అంటే అస్సలు పడదు. ఇప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారు. ఒకర్నొకరు నామినేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి కాజల్ కూతురు రావడంతో.. ఆమెకు శ్రీరామ్, రవిల మధ్య ఆసక్తికరమైన చర్చ నడిచింది.

‘నీకు కోపం వస్తుందా? మమ్మీని ఎవరైనా నామినేట్ చేస్తే అని అడిగాడు శ్రీరామ చంద్ర. దానికి కాజల్ కూతురు ఔను అన్నట్టుగా తల ఊపింది. దీంతో శ్రీరామ్ నవ్వుతూ కాజల్ కూతురుకి సారీ చెప్పాడు.

ఆ తరువాత యాంకర్ రవి మాట్లాడుతూ.. అమ్మతో గొడవపడతాం కదా శ్రీరామ్‌తో పాటు నన్ను ఎన్నిసార్లు తిట్టుకున్నావ్ అని అడగ్గా.. జస్ట్ 2టైమ్స్ అని చెప్పింది. అయితే మా ఇద్దరిలో ఎక్కువ ఎవర్ని తిట్టుకున్నావ్ అంటే.. ఇద్దరూ ఈక్వల్ అనేసింది. ఈ సందర్భంలోనే ఆనీ మాస్టర్ టాపిక్ వచ్చింది. మీ ఇద్దరూ కాదు కానీ.. ఆనీ మాస్టర్‌ని ఎక్కువ తిట్టుకున్నా అని చెప్పింది కాజల్ కూతురు. ఆ మాటతో ఆనీ మాస్టర్ వీర విధేయుడు శ్రీరామ్ ఆమె ఎలిమినేట్ అయిపోతుందిలే అని అంటే.. కాజల్ కూతురు.. యా ఐ యామ్ హ్యాపీ అని అనేసింది. దీంతో రవి, శ్రీరామ్‌లు తెగ నవ్వుకున్నారు.


కాజల్‌ని హేళలను చేస్తూ నాగిని డాన్స్ చేసి రెస్పెక్ట్ లేకుండా ప్రవర్తించిన ఆనీ మాస్టర్‌ని చూసి కామన్ ఆడియన్సే తిట్టుకున్నారు. ఈమె ఆస్కార్ లెవల్‌లో పెర్ఫామ్ చేస్తూ.. కాజల్‌ని ఆస్కార్ పెర్ఫామెన్స్ అంటూ హేళన చేసి... నాగార్జున ముందే నాగిని డాన్స్ చేసి దారుణంగా వెక్కిరించింది. ఆమె ప్రవర్తనతో విసుగుచెందిన ప్రేక్షకులు ఆనీ మాస్టర్‌ని ఎలిమినేట్ చేసిపారేశారు. కామన్ ఆడియన్స్‌కే ఆనీ మాస్టర్ ప్రవర్తన నచ్చనప్పుడు తన తల్లిని అంత దారుణంగా హేళన చేస్తుంటే ఏ కూతురు మాత్రం తిట్టుకోకుండా ఉంటుంది.. కాజల్ కూతురు కూడా ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు హౌస్‌లో చెప్పేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.