యాప్నగరం

Bigg Boss Telugu 3: పెళ్లికి ‘అమల’ దొరకలేదట.. నాగ్‌కి పంచ్ ఇచ్చిన రౌడీ

హీరో నుండి ప్రొడ్యుసర్‌గా మారిన విజయ్ దేవరకొండ తన మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్‌కి వచ్చారు. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి కంటెస్టెంట్స్‌తో సందడి చేస్తున్నాడు. పనిలో పనిగా తన పెళ్లిపై కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

Samayam Telugu 27 Oct 2019, 3:56 pm
దీవాళి సెలబ్రేషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్‌కి విజయ్ దేవరకొండను తీసుకువచ్చారు నాగార్జున. అందరిలా అలా వచ్చి ఇలా వెళిపోతే అతను రౌడీ ఎందుకు అవుతాడు అందుకే అందరిలా కాకుండా ఈ రౌడీ తనదైన శైలిలో కంటెస్టెంట్స్‌ని ఆటాడిస్తున్నాడు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Samayam Telugu Vijay Devarakonda In Bigg Boss
విజయ్ దేవరకొండ, నాగార్జున


బిగ్ బాస్ హౌస్‌కి స్పెషల్ గెస్ట్ వస్తున్నారని విజయ్‌ని ఇంట్రడ్యూస్ చేసిన నాగార్జున.. విజయ్ పెళ్లిపై ఆసక్తికరమైన విషయాన్ని లేవనెత్తారు. ‘నీ పెళ్లి గురించి ప్రతి ఆరునెలలకు ఒక రూమర్ వస్తూనే ఉంటుంది కదా... నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావ్‌’ అని అడగ్గా.. ‘ఇంకా తన అమల దొరకలేదు’ అంటూ పంచ్ పేల్చాడు విజయ్. దీంతో నాగార్జున ‘నీకు నీ అమల త్వరగా దొరకాలని కోరుకుంటున్నా’ అని బదులిచ్చారు.

ఒక్కో కంటెస్టెంట్‌ను కన్ఫెషన్ రూంకి పిలిచి సర్ ప్రైజ్ ఇస్తున్నాడు ఈ రౌడీ. ఇక ఈ 14 వారాల్లో హౌస్‌లో జరిగిన సీక్రెట్‌ను తనతో షేర్ చేసుకోవాలని విజయ్ అడుగుతుండగా.. ఒక్కొక్కరూ తెల్లముఖాలు వేస్తున్నారు. ఒకవైపు శ్రీముఖి మీద మీ అభిప్రాయం ఏంటని బాబా భాస్కర్‌ని అడుగుతూనే.. బాబా గురించి శ్రీముఖిని అడుగుతున్నారు. ఇక పునర్నవి గురించి రాహుల్ దగ్గర ముచ్చటిస్తున్నారు. శివజ్యోతి.. నువ్ అడ్డూగా అయినవ్ అంటూ తన యాసతో ఆకట్టుకుంది. అనంతరం నామినేషన్స్‌లో ఉన్న వాళ్లకు బెలూల్స్ ఇచ్చి సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి బిగ్ బాస్ హౌస్‌లో రౌడీ సందడి చూడాలంటే నేటి బిగ్ బాస్ షో చూడాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.