యాప్నగరం

OTTలో బిగ్ బాస్.. 24×7 లైవ్ స్ట్రీమ్.. పేరుతో పాటు కీలకమైన మార్పులు

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌కి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. తెలుగులోనే కాకుండా అన్ని ప్రాంతీయ భాషల్లోనూ బిగ్ బాస్ ప్రసారాలు జరుగుతున్నాయి. తెలుగులో ఐదో సీజన్‌కి ఏర్పాట్లు జరుగుతుండగా.. హిందీలో 15 సీజన్‌ త్వరలో ప్రసారం కానుంది.

Samayam Telugu 9 Jul 2021, 10:17 pm
తెలుగు బిగ్ బాస్ 5 త్వరలో ప్రారంభం కానుండగా.. హిందీలో ఇప్పటికే సీజన్ 15 ప్రసారానికి సన్నాహాలు పూర్తియ్యాయి. కీలకమైన మార్పులతో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 15 త్వరలో ప్రసారం కానుంది. టీవీలో కంటే ముందుగానే ఓటీటీ ( bigg boss ott)లో రానుంది. దీంతో ఈ సీజన్‌కి బిగ్ బాస్‌ పేరులో కూడా మార్పులు చేశారు. బిగ్ బాస్ ఓటీటీ అని పేరులో మార్పులు చేశారు.
Samayam Telugu బిగ్ బాస్
bigg boss ott


అయితే మొదటి ఆరువారాలు ఓటీటీలో ప్రసారం కానుండగా.. ఆ తర్వాత టీవీలో ప్రసారం చేయనున్నారు. వూట్ ఓటీటీ (voot ott platform)లో బిగ్ బాస్ 15 ప్రసారం కానుంది. అయితే మిగతా సీజన్‌కి ఈ సీజన్‌కి చాలా మార్పులు ఉన్నాయి. వూట్ యాప్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లైఫ్ ఫీడ్‌ని 24X7 చూసే అవకాశం ఉంది. టీవీలో కంటే ముందుగానే ఓటీటీలో బిగ్ బాస్ షో అంటే డిజిటల్ ఎంటర్టైన్మెంట్‌లో గేమ్ ఛేంజర్ అనే చెప్పాలి. ఆగష్టునెలలో బిగ్ బాస్ 15 ప్రసారం కానుండగా.. ఓటీటీ స్ట్రీమింగ్ తరువాత కలర్స్ ఛానల్‌లో ఎప్పటిలాగే ప్రసారం చేయనున్నారు.

అయితే తెలుగులో మాత్రం బిగ్ బాస్ ఓటీటీలో ప్రసారం అయ్యే అవకాశం చాలా తక్కువనే చెప్పాలి. హిందీతో పోల్చుకుంటే తెలుగులో ఓటీటీ వినియోగించేవారి శాతం తక్కువగా ఉండటంతో తెలుగు బిగ్ బాస్ 5 ఓటీటీ జోలికి పోదనే అనుకోవాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.