యాప్నగరం

shrihan : కలిసిపోయిన సిరి-శ్రీహాన్.. ఆ ఇంట్లో స్పెషల్ పార్టీ కూడా

siri hanmanth and shrihan సిరి హన్మంత్ శ్రీహాన్‌లు చాలా రోజుల తరువాత కలిసి కనిపించారు. బిగ్ బాస్ షో అనంతరం వేరువేరుగా ఉన్నట్టు అనిపించారు. ఎట్టకేలకు ఈ ఇద్దరూ కలిసి పోయారు. యాంకర్ రవి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశారు.

Samayam Telugu 4 Feb 2022, 10:28 pm

ప్రధానాంశాలు:

  • సిరి హన్మంత్ శ్రీహాన్ జోడిపై రూమర్లు
  • చాలా రోజులకు కనిపించిన జంట
  • యాంకర్ రవి వల్లే సాధ్యమైందా?
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu కలిసిపోయిన సిరి-శ్రీహాన్.. ఆ ఇంట్లో స్పెషల్ పార్టీ కూడా
Siri Shrihan Ravi
siri hanmanth-shrihan ఒక్క బిగ్ బాస్ షో రెండు జంటల మధ్య చిచ్చు పెట్టేసింది. నలుగురి జీవితాలను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ ముగిసిన తరువాత సిరి, షన్ను, దీప్తి సునయన, శ్రీహాన్ ఇలా నలుగురి మైండ్ సెట్‌లు విపరీతంగా మారిపోయాయి. బిగ్ బాస్ ఇంట్లో సిరి, షన్నులు ఎదుర్కొన్న పరిస్థితులు వేరు. బయట దీప్తి సునయన, శ్రీహాన్‌లు చవి చూసిన అనుభవాలు వేరు. మొత్తానికి బిగ్ బాస్ షో అనేది ఈ నలుగురి జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చేసింది.
బిగ్ బాస్ షోలో సిరి, షన్నులు హద్దులు దాటేశారు. హగ్గులు, ముద్దులు, రిలేషన్ అంటూ ట్రిప్ అవుతున్నా అంటూ చాలా ఓవర్ చేసేశారు. ఇక ఆ ఇద్దరి రొమాన్స్ మీద లెక్కలేనన్ని మీమ్స్, ట్రోలింగ్ వచ్చింది. హగ్గులకు మాత్రం సిరి చాలా ఫేమస్ అయింది. చివరకు కన్నతల్లి వద్దని చెప్పినా కూడా సిరి వినలేదు. ఆదే ఆమెకు ఎక్కువగా నెగెటివ్ అయింది.

ఇక తామిద్దరం స్నేహితులమేనని సిరి క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్ ఇంట్లోనూ ఇదే మాట చెప్పింది. బయటకు వచ్చాక కూడా ఇదే మాట చెప్పింది. ఇక షన్నుకి మాత్రం దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసి దూరంగా ఉంటోంది. సిరికి తన ప్రియుడు శ్రీహాన్‌కి మధ్య కూడా దూరం పెరిగిందంటూ వార్తలు వచ్చాయి. ఎందుకంటే సిరి, శ్రీహాన్‌లు బిగ్ బాస్ షో తరువాత ఎక్కడా కనిపించలేదు. కనీసం ఇన్ స్టా స్టోరీల్లో కూడా ఈ ఇద్దరూ ఒకరి గురించి మరొకరు పోస్ట్‌లు పెట్టుకోలేదు.

పైగా సిరి, షన్నులే కలిసి ఎంజాయ్ చేశారు. ఇక శ్రీహాన్ అయితే దేవదాస్‌లా మారిపోయి, భగ్న ప్రేమికుడిలా హిమాలయాలను చుట్టి వచ్చేశాడు. మొత్తానికి సిరి, శ్రీహాన్‌లు ఇప్పుడు కలిసిపోయారు. అది కూడా యాంకర్ రవి సాక్షిగా. యాంకర్ రవి ఇంట్లోనే ఈ ఇద్దరూ కలిసినట్టుగా కనిపిస్తోంది. రవి ఫ్యామిలీతో ఈ ఇద్దరూ కలిసి పార్టీలు చేసుకున్నట్టు కనిపిస్తోంది.

సిరి బు (సిరి అత్త) అంటూ వియా చేసిన అల్లరి, అందరూ కలిసి డిన్నర్ చేసుకోవడం వంటి ఫోటోలను షేర్ చేశారు. మీ ఇద్దరినీ ఇలా చూడటం సంతోషంగా ఉందని యాంకర్ రవి భార్య నిత్య సక్సేనా పోస్ట్ చేస్తే.. దానికి వదినా అంటూ సిరి రిప్లై ఇచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.