యాప్నగరం

షన్నూతో లోపల ఎలా ఉన్నానో బయటకూడా అలాగే ఉంటా.. చెడు ఉద్దేశ్యమే ఉంటే కెమెరాల ముందు చేస్తామా?

అమ్మ వచ్చింది చెప్పింది.. వినలే, ప్రియుడు వచ్చి చెప్పాడు వినలే.. ఎలిమినేట్ అయిన స్నేహితుడు కొట్టినట్టు చెప్పాడు అయినా లెక్కచేయలేదు.. చివరికి హోస్ట్ నాగార్జున కూడా నలుగురికి ఆదర్శంగా ఉండాలి కానీ.. ఇలా మాత్రం ఉండకూడదనే పరిస్థితి తెచ్చుకోకు అని చెప్పారు.. అయినా వినలేదు. చేయాాల్సింది చేశాక.. జరగాల్సిన నష్టం జరిగాక ఇప్పుడు కళ్లు తెరిచింది సిరి.

Samayam Telugu 21 Dec 2021, 6:31 pm
బిగ్ బాస్ సీజన్ 5 అని కాదు.. అంతకు ముందు జరిగిన ఏ సీజన్‌లో కూడా ఈ సీజన్‌లో కనిపించినన్ని అరాచకాలు ఆడియన్స్ చూసి ఉండరు. బిగ్ బాస్‌లో గబ్బులేపుతూ సిరి-షణ్ముఖ్‌లు A సర్టిఫికేట్ సినిమా చూపించేశారు. ఒక ఎపిసోడ్ కాదు.. రెండు ఎపిసోడ్‌లు కాదు.. ఏకదాటిగా 106 ఎపిసోడ్‌లు.. ఫినాలే ఎపిసోడ్‌తో సహా.. హగ్‌లు రొమాన్స్‌తో బిగ్ బాస్ హౌస్‌ను హీటెక్కించారు.
Samayam Telugu సిరి హనుమంత్
Bigg Boss Siri


ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత తామిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని అనేశారు. అయితే స్వయంకృపరాధంతో తమ ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయ్యిందో తెలుసుకుని ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. షణ్ముఖ్ తన బిహేవియర్‌తో బిగ్ బాస్ టైటిల్‌తో పాటు క్యారెక్టర్‌ని కూడా కోల్పోగా.. సిరి పరిస్థితి కూడా అంతే.

అయితే తనపై జరుగుతున్న నెగిటివిటీని చూసి ఎమోషనల్ అయ్యింది సిరి హనుమంత్. ఓ యూట్యూబ్ ఛానల్‌లో పదే పదే.. సిరి-షణ్ముఖ్‌ల హగ్‌లపైనే ప్రశ్నలు వేయడంతో అసహనం వ్యక్తం చేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయింది సిరి. ఆ తరువాత సదరు యాంకర్ ఆమెను బతిమాలి మళ్ళీ తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టగా.. తన గోడు వెళ్లబోసుకుంది.

హగ్‌ల ఇష్యూపై మాట్లాడుతూ.. ‘మా అమ్మ వచ్చి హగ్‌లు చేసుకోవద్దని చెప్పారు.. అప్పుడే మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. అలా అనకూడదమ్మా.. మా ఉద్దేశ్యం అది కాదు అని అక్కడే చెప్పాను. నాకు అన్నీ వాడే చూసుకున్నాడని మొత్తం హౌస్‌లో జరిగేది చెప్పిన తరువాత అమ్మ రియలైజ్ అయ్యింది.. అయ్యో అలా అని ఉండాల్సింది కాదని అమ్మ కూడా ఒప్పుకుంది. ఆ తరువాత మా ఇద్దరికీ క్లారిటీ వచ్చేసింది.

నిజంగా అమ్మ వచ్చిన తరువాత నేను నా పద్దతి మార్చుకుంటే అప్పటివరకూ నేను చేసింది తప్పని నేను ఒప్పుకున్నట్టు. నేనే ఆడియన్స్‌తో డైరెక్ట్‌గా చెప్పినట్టు. నేను తప్పుచేశాను.. మా మమ్మీ వచ్చి సరిదిద్దారు అని ఒప్పుకున్నట్టు.. అది నాకు ఇష్టం లేదు. నేను అలా ఉండటం జనానికి ఇష్టం కాలేదేమో.. వాళ్లకి నచ్చకపోతే సారీ.. నాపై వస్తున్న కామెంట్స్ చూడలేకపోతున్నా.. నా లైఫ్‌లో ఎప్పుడూ అన్ని కామెంట్స్ చూడలేదు. కొంతమంది అయితే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు నన్ను టాప్‌లో పెట్టారు.. గెలుపులోనే కాదు.. ఓటమిని కూడా యాక్సెప్ట్ చేయాలి.. నాకు ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి.. దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఈ కామెంట్లను యాక్సెప్ట్ చేయాలి. అందుకే ఆ కామెంట్లను తీసుకుంటున్నా.

నాపై ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారో వాళ్లందిరికీ నేను ఒకటే చెప్తున్నాను.. నిజంగానే మా ఇద్దరిలో చెడు ఉద్దేశ్యమే ఉంటే కెమెరాల ముందు ఎందుకు చేస్తాం.. ఇంకేదైనా ప్లేస్‌లో చేసేవాళ్లం మాకు నిజంగానే అలాంటి చెడు ఉద్దేశ్యం లేదు. మేం లోపల ఎంత జన్యూన్‌గా ఉన్నామో బయట కూడా అలాగే ఉంటాం.. మా ఫ్రెండ్ షిప్ అలాగే కొనసాగుతుంది. దయచేసి మీరు నెగిటివ్‌గా తీసుకోకండి’ అని ఎమోషనల్ అయ్యింది సిరి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.