యాప్నగరం

ట్రోలింగ్ దెబ్బకు డిప్రెషన్ వెళ్లిపోయిన సిరి.. షన్ను-దీప్తి నా వల్ల విడిపోలేదంటూ క్లారిటీ

Shanmukh Jaswanth - Deethi Sunaina : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో షణ్ముక్, సిరి మధ్య ఏర్పడిన ఎమోష‌న‌ల్ బాండింగ్ న‌చ్చ‌కే , ష‌న్నుకి దీప్తి సున‌య‌న బ్రేక‌ప్ చెప్పేసిందంటూ ట్రోలింగ్ చేశారు. దీనిపై సిరి హ‌న్మంత్ రియాక్ట్ అయ్యారు.

Samayam Telugu 14 Jan 2022, 10:23 pm

ప్రధానాంశాలు:

  • షణ్ముక్ - దీప్తి సునయన బ్రేకప్‌పై సిరి స్పందన
  • తన వల్ల షన్ను, దీప్తి విడిపోలేదన్న సిరి
  • డిప్రెషన్‌కి గురైయ్యానన్న సిరి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu సిరి
Siri Hanmanth
తెలుగు రియాలిటీ బిగ్ బాస్ సీజ‌న్ 5 ముగిసి చాలా రోజులైంది. వీజే స‌న్నీ ఇందులో విన్న‌ర్‌గా నిల‌వ‌గా.. ర‌న్న‌ర్‌గా ష‌ణ్ముక్ జ‌శ్వంత్ నిలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్‌లో ష‌ణ్ముక్ జ‌శ్వంత్‌, సిరి హ‌న్మంత్ చేసిన ర‌చ్చ మామూలుగా లేదు. ఇద్ద‌రు ముద్దులు, హ‌గ్గుల‌తో రెచ్చిపోవ‌డం వంటి పనులు చేశారు. ఇది ఓ ర‌కంగా ష‌న్ను ఇమేజ్‌కు డ్యామేజ్‌ను క‌లిగిచింది. స‌రే! ఇమేజ్ పోతే పోయింది. చివ‌ర‌కు ష‌ణ్ముక్‌తో అత‌ని ప్రియురాలు దీప్తి సున‌య‌న కూడా బ్రేక‌ప్ చెప్పేసింది. ఇది ష‌న్ను ఊహించ‌చ‌ని ప‌రిణామం. ష‌న్ను, దీప్తి సున‌య‌న విడిపోవ‌డం వెనుక సిరి హ‌న్మ‌కొండను నెటిజన్స్ ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు.
బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ష‌న్ను.. దీప్తి త‌న‌కు మంచి స్నేహితురాల‌ని చెప్పుకొచ్చారు. మ‌రో వైపు సిరితో ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ బ‌య‌ట‌కు బ‌హిరంగంగా చెప్ప‌లేదు కానీ.. ఎడ‌మోహం పెడ‌మోహం అన్న రీతిలోనే ఉంటున్నాడు. ఈ నేప‌థ్యంలో సిరి హ‌న్మంత్ సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్ కోసం వైజాగ్ వెళ్లింది. అక్క‌డ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఆమె వెల్ల‌డించింది.

‘‘బిగ్ బాస్ హౌస్‌లో ష‌ణ్ముక్‌, జెస్సీ నాకు బెస్ట్ ఫ్రెండ్స్‌. త‌ర్వాత ర‌వి బ్ర‌ద‌ర్‌లా ఉన్నారు. నా, ష‌న్ను మ‌ధ్య ఉండేది కేవ‌లం స్నేహం మాత్ర‌మే. బ‌య‌ట ఉన్న‌ప్పుడు వంద మంది ఎమోష‌న్స్‌ను చూస్తుంటాం. అదే బిగ్ బాస్ హౌస్‌లో అయితే 19 మంది ఎమోష‌న్స్ మాత్ర‌మే మ‌న‌కు క‌నిపిస్తాయి. ఎమోష‌న‌ల్‌గా ఫీల్ కావ‌డం అనేది సాధార‌ణంగా జ‌రుగుతుంది. అయితే నాకు, ష‌న్నుకు మ‌ధ్య అది కాస్త ఎక్కువ‌గా జ‌రిగింది. దీప్తి సున‌య‌న నాకు స్నేహితురాలే. త‌న‌తో క‌లిసి వ‌ర్క్ కూడా చేశాను. నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ట్రోల్స్ చూసి కంప్లీట్‌గా డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయాను. త‌ర్వాత కాస్త సెట్ అయ్యింది.

అయితే అప్పుడ‌న‌గానే దీప్తి సున‌య‌న బ్రేక‌ప్ అని స్టేట‌స్ పెట్ట‌గానే మ‌ళ్లీ నా మీద నెగ‌టివ్ వ‌చ్చింది. బ్రేక‌ప్ అయిపోయేంత వీక్ ల‌వ్ వాళ్ల‌ద‌ని నేను అనుకోవ‌డం లేదు. ప్యూర్ రిలేష‌న్ అనేది కేవ‌లం 100 రోజుల జ‌ర్నీ కార‌ణంగా బ్రేక్ అయ్యిందంటే.. బిగ్ బాస్ వ‌ల్ల‌నే అని అయితే అనుకోను’’ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.