యాప్నగరం

జీవితంలో చేసిన పెద్ద తప్పు ఇదే.. లైఫ్‌లోని లవ్ స్టోరీపై నోరు విప్పిన శ్రీముఖి

బుల్లితెర, వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు శ్రీముఖి. బిగ్ బాస్ షో తరువాత శ్రీముఖి కెరీర్ పూర్తిగా మారిపోయింది. అంతకు ముందు బుల్లితెరపై యమా బిజీగా ఉన్న యాంకర్‌గా టాప్ ప్లేస్‌లో దూసుకపోయారు.

Samayam Telugu 6 Jul 2021, 10:21 pm

ప్రధానాంశాలు:

  • జీవితంలో చేసిన పెద్ద తప్పు ఇదే
  • లైఫ్‌లోని లవ్ స్టోరీపై నోరు విప్పిన శ్రీముఖి
  • అభిమానులతో రాములమ్మ ముచ్చట్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu జీవితంలో  చేసిన పెద్ద తప్పు ఇదే.. లైఫ్‌లోని లవ్ స్టోరీపై నోరు విప్పిన శ్రీముఖి
Sreemukhi
బుల్లితెర, వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు శ్రీముఖి. బిగ్ బాస్ షో తరువాత శ్రీముఖి కెరీర్ పూర్తిగా మారిపోయింది. అంతకు ముందు బుల్లితెరపై యమా బిజీగా ఉన్న యాంకర్‌గా టాప్ ప్లేస్‌లో దూసుకపోయారు. అలా రెండో సీజన్ బిగ్ బాస్ షోలో ఎక్కువ రెమ్యూనరేషన్ పొందిన కంటెస్టెంట్‌గా శ్రీముఖి పేరే వినిపించింది. అలా అంతటి ఫాంలో ఉన్న శ్రీముఖికి బిగ్ బాస్ ద్వారా కాస్త నెగెటివిటీ వచ్చింది. అయితే బుల్లితెర మీద శ్రీముఖికి ఇప్పుడు అంతగా అవకాశాలు రావడం లేదు. సోషల్ మీడియాలోనే ఈ అమ్మడు తెగ సందడి చేస్తున్నారు.
ఒక్క హైద్రాబాద్ హోటల్స్‌లోనే అలా.. వరలక్ష్మీ శరత్ కుమార్ ఆవేదన
ఒకప్పుడు పటాస్ షోతో శ్రీముఖి రాములమ్మగా అందరినీ ఆకట్టుకున్నారు. మళ్లీ ఆ రేంజ్ షో ఒక్కటి కూడా శ్రీముఖి ఖాతాలో పడటం లేదు. ఈ టీవీ, జీ తెలుగు, స్టార్ మా అని ఇలా తిరుగుతోంది తప్పా.. ఒక్క షో కూడా సరైంది రావడం లేదు. అయినా కూడా సోషల్ మీడియాను వాడుకుంటూ తన క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. డ్యాన్సులతో శ్రీముఖి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు.
View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi)

ఇక శ్రీముఖి ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోలో తన బ్రేకప్ గురించి చెబుతూ అందరినీ ఎమోషనల్ చేసేశారు శ్రీముఖి. ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తితోనే ప్రేమలో ఉన్నానని, కానీ బ్రేకప్ అయిందంటూ తన వ్యక్తిగత విషయాలపై శ్రీముఖి ఓపెన్ అయ్యారు. తాజాగా మరోసారి తన పర్సనల్ విషయాలపై శ్రీముఖి స్పందించారు. తాజాగా శ్రీముఖి తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టేశారు.

ఇందులో నెటిజన్లు రకరకాల ప్రశ్నలను సంధించారు. జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏది అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దానికి శ్రీముఖి సమాధానం ఇస్తూ.. జనాలను త్వరగా నమ్మడం, ప్రేమించడం అంటూ చెప్పుకొచ్చారు. ఇక జీవితంలో ప్రేమ కథలు ఉన్నాయా? అని మరో నెటిజన్ అడిగేశాడు. అవును ఉన్నాయ్.. అద్భుతమైనవి ఉన్నాయ్ అంటూ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.