Aame Katha Telugu Serial Written Updates 11 March 2020; Rajendra's Evil Plan
‘ఆమెకథ’ మార్చి 11 ఎపిసోడ్ : రాణీ రాక్షసానందం! మహేశ్వరి గదితో సహా అంతా సీసీ కెమెరాలు
బుల్లి తెరను ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘ఆమెకథ’ రోజు రోజుకీ ఆసక్తిగా మారుతోంది. ముందు ఎపిసోడ్లో ఏం జరిగిందో రఫ్‌గా చూసి.. స్టోరీలోకి వెళ్దాం.(గత ఎపిసోడ్‌ని ఆల్ రెడీ ఫాలో అయిన వాళ్లు ఈ పేరా వదిలి తరువాత పేరా నుంచి ఫాలో కావచ్చు) రాణీ, రాజమాత, గౌతమ్ ఒక రూమ్‌లో మాట్లాడుకుంటూ ఉంటే.. వెంకట్ మనిషి.. రాజు అక్కడికి వచ్చి దొంగ చాటుగా వాళ్ల మాటలు వింటాడు. ‘బర్త్ సర్టిఫికెట్ వచ్చేవరకు నన్ను నువ్వు అత్తయ్యా అని పిలవద్దు’ అని రాజమాత రాణీకి చెప్పడం, మహేశ్వరి దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్పడం అంతా వినేస్తాడు. అయితే అతడు వెళ్తున్న సమయంలో ఓ వస్తువు కింద పడి అలికిడి కావడతో.. భయపడి దాక్కుంటాడు. చివరికి కోట మొత్తం వెతికి.. రాజుని పట్టుకుంటారు. రాజమాత చంపడానికి సిద్ధపడితే.. రాణీ అందుకు సహకరిస్తూ ఉంటుంది. అయితే గౌతమ్ వాళ్లని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ మాట వినిపించుకోకుండా రాజుని చంపేస్తుంది రాజమాత. అదంతా వెంకట్ ఫోన్లో విని బాధపడతాడు. ‘అప్పుడు జానకి, ఇప్పుడు రాజు ఇద్దరు నా వల్ల ప్రాణాలు కోల్పోయారు..’ అని ఫీల్ అవుతాడు వెంకట్. photo courtesy star maa and hotstar
Samayam Telugu13 Mar 2020, 6:50 pm
బుల్లి తెరను ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘ఆమెకథ’ రోజు రోజుకీ ఆసక్తిగా మారుతోంది. ముందు ఎపిసోడ్లో ఏం జరిగిందో రఫ్‌గా చూసి.. స్టోరీలోకి వెళ్దాం.(గత ఎపిసోడ్‌ని ఆల్ రెడీ ఫాలో అయిన వాళ్లు ఈ పేరా వదిలి తరువాత పేరా నుంచి ఫాలో కావచ్చు) రాణీ, రాజమాత, గౌతమ్ ఒక రూమ్‌లో మాట్లాడుకుంటూ ఉంటే.. వెంకట్ మనిషి.. రాజు అక్కడికి వచ్చి దొంగ చాటుగా వాళ్ల మాటలు వింటాడు. ‘బర్త్ సర్టిఫికెట్ వచ్చేవరకు నన్ను నువ్వు అత్తయ్యా అని పిలవద్దు’ అని రాజమాత రాణీకి చెప్పడం, మహేశ్వరి దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్పడం అంతా వినేస్తాడు. అయితే అతడు వెళ్తున్న సమయంలో ఓ వస్తువు కింద పడి అలికిడి కావడతో.. భయపడి దాక్కుంటాడు. చివరికి కోట మొత్తం వెతికి.. రాజుని పట్టుకుంటారు. రాజమాత చంపడానికి సిద్ధపడితే.. రాణీ అందుకు సహకరిస్తూ ఉంటుంది. అయితే గౌతమ్ వాళ్లని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ మాట వినిపించుకోకుండా రాజుని చంపేస్తుంది రాజమాత. అదంతా వెంకట్ ఫోన్లో విని బాధపడతాడు. ‘అప్పుడు జానకి, ఇప్పుడు రాజు ఇద్దరు నా వల్ల ప్రాణాలు కోల్పోయారు..’ అని ఫీల్ అవుతాడు వెంకట్.
photo courtesy star maa and hotstar
రాజమాత చేతికి రక్తం.. మహేశ్వరి కంగారు..
పద్మినీ పూజ చేస్తూ ఉంటుంది. దేవుడి ముందు కూర్చుని పూలను భక్తితో దేవుడిపైకి వేస్తూ మొక్కులు మొక్కుతోంది. అక్కడే కూర్చున్న వీరేంద్ర వర్మ, విమలా దేవి కూర్చుని దన్నం పెట్టుకుంటారు. ‘పాపం పిచ్చి మహేశ్వరి.. ఆ రాణీ గౌతమ్ మొదటి భార్య అని ఎప్పుడు తెలుసుకుంటుందో?’ అని ఆలోచించుకుంటుంది బాధగా.. ఇంతలో రాజమాత(శ్యామలాదేవి) కూడా వచ్చి అక్కడ కూర్చుంటుంది. పూజ పూర్తి కాగానే.. పద్మినీ రాజమాతకు.. విమలా దేవికి, వీరేంద్రకు ప్రసాదం పెడుతుంది. అయితే రాజమాత చేతిలో ప్రసాదం తింటుంటే.. అదే చేతికి ఉన్న రక్తం చూసి వీరేంద్ర, విమలాదేవీలు.. చాలా షాక్ అవుతారు. అయితే కాసేపటికి పద్మినీ చూసి.. ‘అత్తయ్యా.. రక్తం.. ఏం అయ్యింది అత్తయ్యా?’ అంటూ కంగారుగా ప్రశ్నిస్తుంది. (ఆ రక్తం రాజుని చంపుతున్నప్పుడు ఆమె చేతికి అంటుకుంటుంది). photo courtesy star maa and hotstar
అయితే రాజమాత వెంటనే.. ‘ఇదా.. పిచ్చి పిల్లా.. బాబుకి దిష్టి తగల కుండా నల్ల కోడిని రాజకోట మొత్తం తిప్పి బలి ఇచ్చాం. అప్పుడు పక్కనే ఉన్నా నా మీద కూడా ఈ రక్తం పడి ఉంటుంది. రాజగురువుగారు చెప్పారు. చెడు జరగకుండా ఉండాలంటే బలి తప్పదు అని’ అంటుంది రాజమాత మనసులో ఒక ఉద్దేశంపెట్టుకుని పైకి మంచిదానిలా నటిస్తూ.. అది విన్న వీరేంద్ర.. ‘నరబలి ఇచ్చి.. కోడి బలి అని ఎంత చక్కగా కవర్ చేసిందో’ అనుకుంటాడు మనసులో.. లాయర్.. ట్రెస్ట్ మనుషులైన రాజేంద్ర, మనోహర్‌ల దగ్గరకు వెళ్తాడు. ‘ఏంటి లాయర్ ఏం చెప్పి ఆపావు?’ అంటాడు రాజేంద్ర నవ్వుతూ.. ’బర్త్ సర్టిఫికెట్, గ్రూఫ్ ఫోటోస్ అని ఏవేవో చెప్పి ఆపాను.’ అంటాడు లాయర్. రాజేంద్ర, మనోహర్ ఇద్దరూ పెద్దగా నవ్వుతారు. photo courtesy star maa and hotstar Read also: ‘కార్తీకదీపం’ మార్చి 12 ఎపిసోడ్: దీప చెంప చెల్లుమనిపించిన కార్తీక్! ‘స్టుపిడ్.. ఎక్కడికి వెళ్లిపోయావే...’
రాజమాతకు, గౌతమ్ బాబుకి తెలిస్తే..
అయితే లాయర్ మళ్లీ మాట్లాడతాడు. ‘ఈ విషయం.. రాజమాతకు, గౌతమ్ బాబుకి తెలిస్తే.. ఇక నా పని అంతే సార్.. నన్ను నిలవునా పాతేస్తారు. నా తర్వాత మిమ్మల్నే చంపేది’ అంటాడు లాయర్ భయంతో.. ‘అంతదాకా ఎందుకు లాయర్ మన రాజేంద్ర ఓ ప్లాన్ వేశాడులే’ అంటాడు మనోహర్ నవ్వుతూ.. ‘ఇంతకీ నా వాటా ఎంత ఇస్తారు సార్?’ అంటాడు లాయర్ ముఖమాటంగా.. ‘కొత్తగా అడుగుతావేంటీ లాయరు? వచ్చిన దానిలో 10 శాతం నీదే లాయరు..’ అంటాడు రాజేంద్ర. ‘మరి ఇప్పుడు జేబు ఖాళీగా ఉంది మరి..’ అంటాడు లాయర్ మళ్లీ ఇబ్బందిగా చూస్తూ.. ‘అంత ముఖమాటంగా అడుగుతావేంటయ్యా.. ఇదిగో రెండు లక్షలు..’ అంటూ మనోహర్ 2 లక్షలు తీసి ఇస్తాడు. photo courtesy star maa and hotstar
మహేశ్వరి బాధగా కళ్లనిండా నీళ్లతో.. బాబుని ఎత్తుకుని.. లాలించి, ప్రేమగా పాలు పట్టించి ఊయాలతో వేసి ఆడిస్తూ ఉంటుంది. అయితే అందంతా తన చీర కొంగుని ముఖానికి వేసుకుని.. చేస్తూ ఉంటుంది. అయితే హాల్లో టీవీ పెట్టుకుని.. అందులోనే మహేశ్వరి ఏం చేస్తుందో అంతా.. హాల్లోనే సోపాలో ధర్జాగా కూర్చుని.. చూస్తుంటారు రాణీ, రాజమాతలు. ‘మొత్తం సీసీ కెమెరాలు పెట్టించాను. మహేశ్వరి రూమ్‌తో సహా.. రాజకోట మొత్తం కెమెరాలు పెట్టించాను.. ఇక మీదట మహేశ్వరి రూమ్‌లో ఏం చేస్తున్నా.. ఆమెని ఎవరు కలిసినా, మాట్లాడినా.. అంతా మనకు తెలిసిపోతుంది. అంతా మన ఆధీనంలో ఉంటుంది’ అంటుంది రాణీ గర్వంగా విలన్లా నవ్వుతూ.. photo courtesy star maa and hotstar Read also: ‘ప్రేమ ఎంత మధురం’ మార్చి 11 ఎపిసోడ్: అనుకి తింగరోడితో పెళ్లి? ఆర్య వర్థన్‌కి షాక్
రాణీ రాక్షసానందం..
‘మంచి పని చేశావ్.. రాణీ.. మన జాగ్రత్త మనకు చాలా ముఖ్యం’ అంటుంది రాజమాత నవ్వుతూ.. మహేశ్వరి బాబుని ఉయాల్లో వేసి బాధని ఆపుకోలేక బాగా ఏడుస్తుంది. పక్కనే ఉన్న పని మనిషి ఓదారుస్తుంది. అయితే అందంతా బయట నుంచి చూస్తున్న రాణీ, రాజమాతలు నవ్వుకుంటారు. వాళ్ల వెనుకే ఉన్న బౌన్సర్స్ కూడా అది గమనిస్తూనే ఉంటారు. రాజమాత, బౌన్సర్స్ వెళ్లిపోయిన తర్వాత.. రాణీ.. కాలు మీద కాలు వేసుకుని.. ‘ఎన్ని మాటలు అన్నావే నన్ను.. కొన్ని రోజులు ఇంకా కొన్ని రోజులంతే.. నా గౌతమ్‌ని నేను కలిస్తే.. నన్ను అన్నేసి మాటలు అంటావా? శాశ్వతంగా గౌతమ్ నా వాడు కాబోతున్నాడే... ఇక నీ కథ ముసినట్లే...’ అని మనసులో అనుకుంటూ విర్రవీగుతుంది. photo courtesy star maa and hotstar
విమలా దేవి బిల్డప్..
విమలా దేవి అటుగా వస్తూ ఓ పని మనిషిని చూసి.. ‘ఇదే మంచి అవకాశం ఇప్పుడే మనం మన రేంజ్ పెంచుకోవాలి..’ అని మనసులో అనుకుని.. సోపాలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని.. అక్కడే పని చేసుకుంటున్న ఓ పని మనిషిని.. ‘ఏయ్ ఇలా రా’ అంటూ గద్దించినట్లుగా పిలుస్తుంది. ఆమె భయపడుతూ.. ‘ఏంటమ్మా?’ అంటుంది. ‘నేను జ్యూస్ చెప్పి ఎంత సేపు అయ్యింది?’ అంటూ అరుస్తుంది విమలాదేవి కావాలనే.. ‘మీరు నాకు జ్యూస్ ఎప్పుడు చెప్పారమ్మా.. వేరే వాళ్లకి ఎవరికైనా చెప్పారేమో’ అంటుంది పని మనిషి భయపడుతూ.. ‘నాకే ఎదురు సమాధానం చెబుతావా? నీకు నేను ఎవరో తెలుసా? నా రేంజ్ ఏంటో తెలుసా?’ అంటూ అరుస్తుంది విమలాదేవి. photo courtesy star maa and hotstar
రాణీ పొగరు.. విమలా దేవి చేత కాళ్లు పట్టించుకుని..
విమలాదేవి ఆ డైలాగ్ అనేటప్పటికి.. రాణీ మెట్లు దిగి వస్తూ.. ‘నీ రేంజ్ ఏంటో దానికి తెలియదు కానీ.. నేను ఏంటో నా రేంజ్ ఏంటో నీకు బాగా తెలుసు అనుకుంటా?’ అంటుంది రాణీ పొగురుగా.. ఇంతలో పని మనిషి వెళ్లిపోవడంతో.. విమలా దేవి లేచి నిలబడగా.. అదే సోపాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది రాణీ. ‘నేను ఎవరిని? నా రేంజ్ ఏంటీ?’ అంటూ గట్టిగా అడుగుతుంది రాణీ విమలాదేవిని.. భయపడిన విమలాదేవి.. ‘నువ్వు ఈ ఇంటి కోడలివి..’ అని చెప్పగానే.. ‘మరి నువ్వు?’ అంటుంది రాణీ పొగరుగా.. ‘నేను పారాయి దాన్ని.. దిక్కులేని వాళ్లుగా ఉంటే మీరు మమ్మల్ని ఆదుకున్నారు..’ అంటూ వినయంగా సమాధానం ఇస్తుంది విమలాదేవి.
దాంతో రాణీ.. నవ్వుతూ.. ‘మరి నాకు మర్యాదుల ఎలా ఉండాలి?’ అంటూ కాలు ఊపుతుంది నొక్కు అన్నట్లుగా.. దాంతో విమలా దేవి కాళ్ల దగ్గర కూర్చుని రాణీ కాళ్లు నొక్కుతుంది. ఇంతలో మహేశ్వరి పని మనిషిని వెతుక్కుంటూ వచ్చేసరికి.. రాణీ లేచి నిలబడుతుంది. (విమలా దేవి రాణీ కాళ్లు పట్టుకోవడం మహేశ్వరి చూడదు). బ్లాక్ కలర్ చీర కట్టుకున్న రాణీని చూసి.. పై నుంచి కింద దాకా ఓ చూపు చూస్తూ.. ‘నువ్వు ఈ ఇంటికి ఏం అవుతావ్?’ అంటుంది మహేశ్వరి కోపంగా.. వెంటనే విమలాదేవి మనసులో నవ్వుకుంటూ.. ‘దీనికి సరైన మొగుడు మహీనే.. ఉన్న కొన్ని రోజులైనా దీని పొగరు తగ్గించు మహేశ్వరి’ అనుకుంటుంది మనసులో.. photo courtesy star maa and hotstar
మహేశ్వరి ప్రశ్నలకు దిమ్మతిరిగి..
రాణీ భయపడుతూ కంగారుగా.. ‘పని మనిషినే కదమ్మా’ అంటుంది. ‘మరి నేను ఏం అవుతాను?’ అంటుంది మహేశ్వరి కోపంతో.. ‘మీరు.. మీరు ఈ ఇంటి కోడలు కదమ్మా’ అంటుంది రాణీ అయిష్టంగానే.. ‘మరి నువ్వు వేసుకున్న బట్టలేంటీ? నీ పొగరేంటీ? బారసాల సమయంలో నీకు ఈ చీర ఇచ్చి కట్టుకోమని ఉంటారు. అంత మాత్రాన్న కోటకి యువరాణిలా.. ఫీల్ అవుతున్నావా? ఇంత మంచి చీర కట్టుకుని తిప్పుకుంటూ తిరుగుతున్నావా?’ అని గట్టిగానే నిలదీస్తుంది. విమలాదేవి చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. రాణీ చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంది. ఇంతలో రాజమాత వచ్చి.. ‘రాణీని ఆ చీర నేనే కట్టుకోమని చెప్పాను పద్మినీ(మహేశ్వరి)..’ అంటుంది. మహేశ్వరి షాక్ అవుతుంది. ‘మీరు చెప్పారా అత్తయ్యా?’ అంటుంది మహేశ్వరి. photo courtesy star maa and hotstar
రాజమాత కవరింగ్..
‘అవునమ్మా.. బాబు ఎక్కువ సేపు నీ దగ్గర ఉండటానికి లేదుగా.. శాంతి పూజ అయ్యే వరకూ.. బాబు రాణీ దగ్గర ఉండాలి కదా.. పని వాళ్లైనా సరే.. బాబు దగ్గరకి వెళ్లేప్పుడు కాస్త శుభ్రంగా ఉండాలని అలా చెప్పానమ్మా.. నీకు ఇష్టం లేదా..’ అంటూనే.. ‘వెళ్లు రాణీ మార్చేసుకో’ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తుం ది రాజమాత. దాంతో మహేశ్వరి.. ‘వద్దులే..’ అని రాణీ ఆపి.. ‘అత్తయ్యా మీరు చెప్పారంటే అందులో కచ్చితంగా మంచే ఉంటుంది’ అంటూ లోపలికి వెళ్లిపోతుంది బాధగా.. విమలా దేవి కూడా అక్కడ నుంచి వెళ్లిపోగానే.. రాజమాత, రాణీలు నవ్వుకుంటారు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ‘ఆమెకథ’ కొనసాగుతోంది.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.