యాప్నగరం

వంటలక్కపై వెన్నెల కిషోర్ కామెంట్.. గూగుల్ పంచ్ మామూలుగా లేదు!!

తెలుగు రాష్ట్రాల్లో ‘కార్తీకదీపం’ సీరియల్ చూడనివారు ఉన్నారంటే అతిశయోక్తే అవుతుంది. అంతలా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ సీరియల్ కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా వంటలక్క పాత్ర ఆడియన్స్‌ను కట్టిపడేసింది.

Samayam Telugu 2 Jul 2020, 5:37 pm
ప్రముఖ హాస్యనటుడు ‘వెన్నెల’ కిషోర్ చమత్కారాలు సినిమాలో ఎలా ఉంటాయో సోషల్ మీడియాలో కూడా ఇంచుమించుగా అలానే ఉంటాయి. ఆయన చేసే ట్వీట్లు చాలా సరదాగా ఉంటాయి. ఆయన ట్వీట్స్‌కు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. అయితే, గురువారం ఆయన చేసిన ట్వీట్ బాగా వైరల్ అవుతోంది. దీనికి కారణం గూగుల్ ట్రాన్స్‌లేషన్. కిషోర్ తెలుగులో చేసిన ట్వీట్‌లో ఆయన ఒకటి రాస్తే కింద గూగుల్ ట్రాన్స్‌లేషన్ మరొకటి చూపిస్తోంది. దీంతో నెటిజన్ల నుంచి ఈ ట్వీట్‌కు మంచి స్పందన వస్తోంది.
Samayam Telugu వంటలక్క, వెన్నెల కిషోర్
Vennela Kishore


Also Read: ‘కార్తీకదీపం’ జూలై 2 ఎపిసోడ్! అదిరిపోయే ప్లాన్ వేసిన సౌందర్య! మౌనిత హైరానా..

‘కార్తీకదీపం’ సీరియల్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లో ఇంచుమించుగా ఈ సీరియల్‌ను కచ్చితంగా చూస్తారు. డాక్టర్ బాబు, వంటలక్కల మధ్య నడిచే ఈ సీరియల్ కథకు తెలుగు బుల్లితెర ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారు. అయితే, ఈ సీరియల్‌ను ఉద్దేశించి వెన్నెల కిషోర్ తెలుగులో ట్వీట్ చేశారు. ‘‘ఎందుకమ్మా అంత మంచి డాక్టర్ బాబుకి ఇంత మంచి వంటలక్క అంటే కోపం’’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ ట్వీట్‌లో రెండు ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ఒకటి.. ‘కార్తీకదీపం’ సీరియల్‌ గురించి వెన్నెల కిషోర్ స్పందించడం, రెండోది.. కిషోర్ ట్వీట్‌ను గూగుల్ ట్రాన్స్‌లేటర్ ఖూనీ చేయడం.

Also Read: అనసూయ కోసం కష్టపడుతోన్న భరద్వాజ్.. భార్య కోసం ఇంటి భోజనం!

కిషోర్ ట్వీట్‌లో తెలుగు వాక్యాన్ని గూగుల్ ట్రాన్స్‌లేటర్ ‘‘This is why Dr. Babu is such a good cook’’ అని ట్రాన్స్‌లేట్ చేసింది. నిజానికి గూగుల్ ట్రాన్స్‌లేటర్ చేసిన వాక్యం అర్థం ఏంటి.. ‘‘డాక్టర్ బాబు అందుకే మంచి వంటవాడు’’ అని కదా. అందుకే, నెటిజన్లు కిషోర్ చేసిన ట్వీట్ కన్నా గూగుల్ ట్రాన్స్‌లేట్ చేసిన సెంటెన్స్ చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దాన్ని స్క్రీన్ షాట్ తీసి కామెంట్లలో పెడుతున్నారు. మొత్తానికి వంటలక్క గురించి కిషోర్ కామెంట్ చేస్తే.. గూగుల్ ఆయనకు ఝలక్ ఇచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.