యాప్నగరం

నటి ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్.. అసభ్యకర ఫొటోలు ప్రత్యక్షం.. గుండె పగిలిపోయిందంటూ భావోద్వేగ పోస్ట్...

హిందీ టీవీ సీరియల్ నటి అపర్ణ దీక్షిత్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయింది. అపర్ణ ఖాతాని హ్యాక్ చేసిన దుండగులు అందులో అసభ్యకర ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. తన ఖాతా నుంచి వచ్చే మెసేజ్‌లను, లింక్‌లను ఓపెన్ చేయవద్దని ఆమె కోరింది.

Samayam Telugu 24 Apr 2021, 11:17 am
కలశ్, బెపనా ప్యార్, ప్యార్‌ కీ లుకా చుపి తదితర సీరియల్స్‌లో నటించిన అపర్ణ దీక్షిత్‌కి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఫేస్‌బుక్ ఖాతాని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. అంతేకాక.. ఆమె ఫేస్‌బుక్ స్టోరీస్‌లో అసభ్యకర చిత్రాలను పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన అపర్ణ.. వెంటనే సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. తన ఫేస్‌బుక్ నుంచి వచ్చే మెసేజ్‌లను, లింక్‌లను ఓపెన్ చేయవద్దని ఆమె కోరింది. అసలే కరోనా కారణంగా ప్రపంచమంతా బాధలు ఎదురుకుంటున్న సమయంలో ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయడం ఏంటని భావోద్వేగం వ్యక్తం చేసింది.
Samayam Telugu అపర్ణ దీక్షిత్
Aparna Dixit


‘నా ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయినట్లు నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు. నా స్టోరీస్‌లో అసభ్యకర ఫోటోలు ఉన్నాయని వాళ్లు చెప్పారు. నేను భయపడి వెంటనే లాగిన్ అవుదామని ప్రయత్నించాను. కానీ, హ్యాకర్లు నన్ను అడ్మిన్‌గా తొలగించారు. దీంతో నేను ఏం చేయలేని పరిస్థితిలో పడిపోయాను. నా ఖాతా నుంచి కొందరు ఫాలోవర్లకు అభ్యంతరకర మెసేజ్‌లు వస్తున్నాయని నాకు తెలిసింది. దయచేసి ఆ మెసేజ్‌లు కానీ లింక్‌లు కానీ ఓపెన్ చేయకండి. నిజం దీని వల్ల నా గుండె పగిలిపోయింది. నా ఖాతాని వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్లు, పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఫాలో అవుతారు. వాళ్లు తొలుత నన్ను తప్పుగా భావించి ఉంటారు. కానీ, నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయాను. విషయం తెలిసిన వెంటనే సైబర్‌క్రైమ్‌లో ఫిర్యాదు చేశాను’ అని అపర్ణ తెలిపింది.

ఇక కరోనా కారణంగా ప్రపంచం అల్లకల్లోలం అవుతున్న్ సమయంలో హ్యాకర్లు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అసలు హ్యాకర్లు ఇలాంటి పని ఎందుకు చేశారో నాకు అర్థం కావడం లేదు. అసలే కరోనా కారణం ప్రపంచం అతలాకుతలం అవుతోంది. ఈ సమయంలో ఇలాంటి తెలివితక్కువ పనులు చేయాల్సిన అవసరం ఏముంది. ఇలాంటి చెత్త పనుల చేసేందుకు వాడే తెలివితేటలను మంచి పనుల కోసం ఉపయోగిస్తే బాగుంటుంది. నేను నా ఖాతాను రికవర్ చేసుకొనేందుకు సాయశక్తుల ప్రయత్నిస్తున్నాను’ అని అపర్ణ స్పష్టం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.