యాప్నగరం

Rashmi Gautam: ‘పొట్టిబట్టల వల్లే రేప్‌లు అన్నాడు.. వాడొక్కడే కాదు’.. ప్రియమణి, రష్మి, వర్షిణి కన్నీటి పర్యంతం

మహిళలపై అఘాయిత్యాలు జరిగిన ప్రతిసారీ వాళ్ల వస్త్రధారణపై విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం వల్లే రేప్‌లు జరుగుతున్నాయంటూ వాదనలు వినిపిస్తున్నారు చాలామంది.

Samayam Telugu 30 Oct 2020, 8:18 pm
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. పురుషాధిక్యత గల దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. మహిళపై పశువాంఛ తీర్చుకుంటూ దారుణంగా రేప్‌లు చేసి చంపేస్తున్నారు మృగాళ్లు.
Samayam Telugu ప్రియమణి, రష్మి, వర్షిణి
Dhee Champions Latest Promo


అయితే మహిళలపై రేప్ జరిగిన ప్రతిసారి వాళ్ల వస్త్రధారణపై విపరీతమైన చర్చ నడుస్తోంది. చాలామంది మహిళలు బయటకు రావడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని.. పొట్టి పొట్టి బట్టలు వేసుకుని బయటకు రావడం వల్లే రేప్‌లు జరుగుతున్నాయని వాదించే వాళ్లు చాలామందే ఉన్నారు.

అయితే ఇలాంటి అనుభవాన్ని తెలియజేస్తూ కన్నీరు మున్నీరైంది ప్రముఖ హీరోయిన్ ప్రియమణి.ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ ఛాంపియన్స్‌కి జడ్జీగా వ్యవహరిస్తున్న ప్రియమణి ఎమోషనల్ అయ్యింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ‘వకీల్ సాబ్’ సినిమాలోని ఈ ‘మగువా మగువా’ పాటను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయడంతో ఈ పాట మహిళా లోకాన్ని తట్టిలేపింది. ఈ పాటను ఇప్పుడు ఢీ ఛాంపియన్స్‌లో పెర్ఫామ్ చేశారు.

అన్నింటా మగువే.. జగమంతా మగువే అంటూ మహిళలు ఏయే రంగాల్లో సత్తా చూపిస్తున్నారో తెలియజేస్తూ డాన్సర్లు థీమ్ సాంగ్‌ను పెర్ఫామ్ చేయడంతో ఢీ ఛాంపియన్స్‌లో ఉన్న మహిళలంతా భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా మహిళల్ని ఏవిధంగా కించపరుస్తున్నారో తెలియజేసింది ప్రియమణి. ఆమె మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యింది.

సోషల్ మీడియాలో ఒకతను పురుషుల తరపున క్వచ్ఛన్స్ వేస్తున్నాడు.. ప్రస్తుతం మహిళలపై చాలా రేప్‌లు జరుగుతున్నాయి.. దీనికి మీ సమాధానం ఏంటి అంటే.. ఒకతను అంటున్నాడు.. ఆడవాళ్లు ఎందుకు బయటకు వచ్చి పనిచేయాలి? ఇంట్లోనే ఉండొచ్చు కదా.. ఆడవాళ్లు పొట్టి పొట్టి బట్టలు ఎందుకు వేసుకోవాలి?? ఇంట్లోనే ఉంటే రేప్‌ జరగదు కదా.. అని అన్నాడు. ఆ ఒక్కడే కాదు.. అందరూ అదే మాట అంటున్నారు’ అంటూ ఏడ్చేసింది ప్రియమణి. ఇక ప్రియమణి మాటలకు స్టేజ్‌పై ఉన్న యాంకర్ రష్మితో పాటు వర్షిణి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో రెండో స్థానంలో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.