యాప్నగరం

Devatha జనవరి 17 ఎపిసోడ్: ‘దేవిపై నాకు ఏ హక్కు లేదా?’ రుక్మిణీని నిలదీసిన ఆదిత్య

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘దేవత’ సీరియల్.. నేడు(2022 జనవరి 17)న 444 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. Devatha january 17 episode హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 17 Jan 2022, 4:36 pm
గత ఎపిసోడ్‌లో మాధవ వెళ్లగానే చూసి ఇంట్లోకి వచ్చిన ఆదిత్యకు రాధ ఎదురు పడుతుంది. ‘మళ్లీ ఎందుకు వచ్చారు’ అంటుంది. దేవిని చూడాలి.. మాధవ వెళ్లడం చూసే వచ్చాను.. మాధవ లేడుగా.. ప్లీజ్ ఒకసారి దేవిని చూసి వెళ్లిపోతాను’ అని ఆదిత్య రిక్వస్ట్ చేస్తాడు. ఈ క్రమంలోనే నేటి కథనం చాలా ఆసక్తిగా మారింది.
Samayam Telugu ‘దేవత’ జనవరి 17 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Devatha january 17 episode


444వ ఎపిసోడ్‌ హైలైట్స్..
‘నా బిడ్డని చూడటానికి మీరు ఎవ్వరు? కలవడానికి వీల్లుదే అంటుంది రాధ ఆదిత్యతో.. దాంతో ఆదిత్య.. చాలా ఎమోషనల్‌గా.. ‘నా బాధ నీకూ అర్థం కానప్పుడు నాకు నీతో మాట్లాడాల్సిన అసవరం లేదు.. అయినా దేవిని చూడటానికి నీ పర్మీషన్ ఏంటీ?’ అంటూనే.. ‘దేవీ దేవీ..’ అని పిలుస్తాడు. దాంతో రాధ కోపంగా.. ‘చెబితే అర్థం కాదా.. నాతోని మాట్లాడకుండా నేరుగా నా బిడ్డతోని మాట్లాడటానికి మీరు ఎవరు? ఏ హక్కుతో దేవితో మాట్లాడతారు?’ అంటుంది. దాంతో ఆదిత్య.. ‘ఏ హక్కుతో అనేది నీకు తెలియదా? చెప్పు రాధా.. నా కళ్లల్లోకి సూటిగా చూసి సమాధానం చెప్పు.. దేవిపై నాకు ఏ హక్కులేదా?’ అంటాడు చాలా ఆవేదనగా..

ఆదిత్య మాటలకు మనసులో మథన పడిన రాధ.. ‘నా పెన్విటేంది? సీదా ఇలా అడుగుతాండు.. దేవి తన బిడ్డ అన్న సంగతి తెలిసినట్లు.. నేనే రుక్మిణీని అన్నట్లు ఇట్లా అడుగుతున్నాడేంటీ? నా పెన్విటీ ఇట్లనే అడిగితే ఎంత సేపు అని ఆపగలుగుతాను? దేవుడా నా పెన్విటీకి ఎదురు నిలబడేటి శక్తినివ్వు..’ అని అనుకుంటూ ఉంటుంది. ‘మాట్లాడవేంటీ రాధా.. దేవితో నేను మాట్లాడటానికి నాకున్న హక్కు ఏంటి అనేది నీకు తెలీదా?’ అని నిలదీస్తాడు ఆదిత్య కోపంగా.. ‘లే..దు.. నా బిడ్డమీద మీకు ఎలాంటి హక్కు లేదు.. మీరు ఎవరు? దానికి ఏంఅవుతారని హక్కు ఉంటుంది.? దారిలో కలిసి నాలుగు సార్లు మాట్లాడినంత మాత్రాన్న హక్కులొస్తాయా?’ అంటూ రివర్స్‌లో కోపాన్ని ప్రదర్శిస్తుంది.

‘అంతేనా రాధా? నీ దృష్టిలో నేను ఎవరో? అంతేనా?’ అంటూ ఆదిత్య అడిగే మాటలను ప్రేక్షకుల మనసుల్ని కూడా మెలిపెడతాయి. ‘నా దృష్టిలోనే కాదు.. నా బిడ్డ దృష్టిలో కూడా అంతే..’ అంటూ దేవిని పిలుస్తుంది. దేవి వచ్చి.. ‘నా గురించి మీరు రావద్దు ఆఫీసర్ సారు.. మిమ్మల్ని కలుసుడు నాకు ఇష్టం లేదు’ అని చెప్పడంతో.. ఆదిత్య గుండె ముక్కలైపోతుంది. అదే ఆవేదనతో ఇంటికి అక్కడే నిలబడి చాలా బాధపడతాడు. రాధ వెళ్లిపోతుంది కానీ ఆదిత్య వెళ్లలేక వెళ్లలేక చాలా ఏడుస్తాడు.

ఇక రాధకు తన అంతరాత్మ కనిపిస్తుంది. ఆదిత్యపై జాలి లేదా.. ప్రేమలేదా? అంటూ తనని తానే ప్రశ్నిస్తుంది. ఇక కమింగ్ అప్‌లో.. దేవి ఇంట్లో అంతా సంతోషంగా భోగి మంటలు వేస్తూ ఉంటే.. దేవి మాత్రం ఓ చోట కూర్చుని బాధగా ఆదిత్య గురించే బాధపడుతుంది. ఆదిత్య దొంగచాటుగా వచ్చి దేవిని దూరం నుంచి చూసి మురిసిపోతూ ఉంటాడు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! devatha కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.