యాప్నగరం

ఎప్పుడూ గొడవలే భేదాభిప్రాయాలున్నాయ్.. కానీ అంటూ సంసారం గుట్టు విప్పిన అనసూయ

బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై అద్భుతమైన నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ. అలాంటి అనసూయ వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. ఆమె ప్రేమ,పెళ్లి వంటి విషయాల గురించి ఎన్నో సార్లు స్వయంగా మీడియా ముందు బహిరంగంగానే చెప్పుకున్నారు.

Samayam Telugu 6 Jun 2021, 5:33 pm

ప్రధానాంశాలు:

  • సోషల్ మీడియాలో అనసూయ రచ్చ
  • పెళ్లి రోజున రొమాంటిక్ పోస్ట్
  • భర్తపై అనసూయ ఫిర్యాదు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఎప్పుడూ గొడవలే భేదాభిప్రాయాలున్నాయ్.. కానీ అంటూ సంసారం గుట్టు విప్పిన అనసూయ
Anasuya
బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై అద్భుతమైన నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ. అలాంటి అనసూయ వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. ఆమె ప్రేమ,పెళ్లి వంటి విషయాల గురించి ఎన్నో సార్లు స్వయంగా మీడియా ముందు బహిరంగంగానే చెప్పుకున్నారు. ప్రేమ పెళ్లి ఇంట్లో వాళ్లకు నచ్చకపోవడం,పెద్దలను ఎదురించి మరీ వివాహాం చేసుకోవడం ఇలా ఆమె లవ్ స్టోరీని ఓ సినిమాగా కూడా తీయొచ్చు. అలా తన భర్త సుశాంక్ భరద్వాజ్ గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని అనసూయ చెబుతూనే ఉంటారు.
తొమ్మిదేళ్ల ప్రేమ.. తదనంతరం వివాహా బంధంగా మారిందని అనసూయ ఎప్పుడూ చెబుతుంటారు. ఈ రోజు ఈ జంట వివాహా దినోత్సవం. ఇది పదకొండో పెళ్లి రోజు. అని తమ ప్రేమకు ఇరవై యేళ్లు నిండాయ్ అని అనసూయ గాల్లో తేలిపోతోన్నారు. ఈ శుభ సందర్భంలో అనసూయ తన సంసారం గుట్టు విప్పేశారు. తాను, తన భర్త ఇంట్లో ఎలా ఉంటారో పూసగుచ్చినట్టు వివరించారు.
Samantha Akkineni : తల్లి కాబోతోన్న సమంత!.. అందరికీ దానిపై కన్ను.. అసలు మ్యాటర్ ఇదేనా?
ఎన్‌సీసీ క్యాంప్‌లో తమ ప్రేమ మొదలైందని, ఆయన ప్రపోజల్ బాగా నచ్చిందని, ప్రేమ గురించి మాట్లాడకుండా నేరుగా పెళ్లి విషయాన్నే ప్రస్థావించారని అనసూయ చెబుతుంటారు. అలా మొత్తానికి ఎన్నో మలుపుల తరువాత ఇంట్లో వాళ్లను ఒప్పించి ఇద్దరం ఒక్కటయ్యామని అనసూయ చెప్పుకొచ్చారు. అయితే తాజాగా తన భర్త మీద అనసూయ కొన్ని ఫిర్యాదులు చేశారు.
View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

మేం ఇద్దరం ఒకరినొకరం కొట్టుకుంటాం.. గొడవలు పడుతుంటాం.. చిరాకు వచ్చేలా చేసుకుంటాం.. కొన్ని సందర్భాల్లో మాకు ఒకే అభిప్రాయం ఉండదు.. భేదాభిప్రాయాలు వస్తాయ్. కొన్ని పిచ్చి పనులు కూడా చేస్తుంటాం. ఇక రేపు అనేదే లేనట్టుగా కొట్టుకుంటాం..గొడవలు పడుతుంటాం. మళ్లీ ఆ వెంటనే.. ఒకరి చేతిని ఒకరం పట్టుకుంటాం.. అన్నీ మరిచిపోతాం. అదే మమ్మల్ని ఇంత వరకు తీసుకొచ్చింది.. ఐలవ్యూ.. ఇక నేను నీకోసం చెప్పేందుకు ఇంతకన్నా నాకేమీ తెలియదు. మేం ఈరోజు కూడా గొడవలు పడ్డాం.. అందుకే కొత్త ఫోటోలేవీ పెట్టడం లేదు’ అని అనసూయ చెప్పుకొచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.