యాప్నగరం

హమ్మ బాబోయ్.. అనసూయ! ‘తల్లా? పెళ్లామా?’ ?

జబర్దస్త్ హాట్ బ్యూటీ అనసూయ.. పొట్టి బట్టలతో రచ్చ చేయడం మామూలే. అయితే ఈసారి ఇంకాస్త డోస్ పెంచి హాట్ ఫొటోలను షేర్ చేసింది.

Samayam Telugu 26 Feb 2020, 3:33 pm
బుల్లితెరపై యాంకర్ అనసూయ హంగామా మామూలుగా లేదు. ఒకవైపు ఈటీవీలో ‘జబర్దస్త్’, మరోవైపు జీతెలుగులో ‘లోకల్ గ్యాంగ్’, అలాగే ఈటీవీలో ‘ప్రతిరోజు పండగే’ ఇలా వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంటూనే సినిమాల్లోనూ సత్తా చాటుతోంది. ఇక జెమినీ ఛానల్‌ను మాత్రం ఎందుకు వదలాలి అనుకుందో ఏమో కాని.. ‘తల్లా? పెళ్లమా??’ అనే కొత్త కార్యక్రమంతో జెమినీ టీవీలో సందడి చేయబోతోంది యాంకర్ అనసూయ.
Samayam Telugu Anasuya
యాంకర్ అనసూయ



తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ‘తల్లా? పెళ్లమా??’ అనే టైటిల్ చాలా సాంప్రదాయ బద్ధంగా ఉన్నప్పటికీ ఇందులోనూ తన హాట్ నెస్‌ను మేళవించి పిచ్చ హాట్ అనిపిస్తోంది అనసూయ. ఇందులోనూ పొట్టి బట్టలతో రచ్చ చేస్తోంది. ఇక ప్రోమో విషయానికి వస్తే.. ‘తల్లా? పెళ్లమా? కాన్సెప్ట్ బేస్డ్‌గా వినూత్నంగా అనిపిస్తోంది. జీవితం అనే చదరంగం ఆటలో తల్లా? పెళ్లమా? నా ప్రశ్నకు జవాబు చెప్పాలని ఆర్డర్ వేస్తోంది అనసూయ. త్వరలో జెమినీ టీవీలో ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను తన ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసి హైప్ తీసుకువచ్చింది అనసూయ. చూడాలి మరి ‘తల్లా? పెళ్లమా?’ కార్యక్రమం ఎలా ఉండబోతుందో?? రంగమ్మత్త ఎలా అలరించబోతుందో.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.