యాప్నగరం

అదీ మీ క్యారెక్టర్.. దిగజారుడుతనం.. బాడీ షేమింగ్‌పై అనసూయ స్ట్రాంగ్ రియాక్షన్

‘పుష్ప’ సక్సెస్‌తో ఫుల్ ఖుషీలో ఉంది అనసూయ. దాక్షాయణి‌గా ఊర మాస్ గెటప్‌లో భయపెట్టేసింది అనసూయ. అయితే ఎప్పటిలాగే తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్‌పై రియాక్ట్ అయ్యింది అనసూయ.

Samayam Telugu 23 Dec 2021, 7:42 pm
జబర్దస్త్ యాంకర్‌గా ఫుల్ బిజీగా ఉన్న అనసూయ.. సినిమాల్లోనూ బిజీ ఆర్టిస్ట్‌గా మారింది. పుష్ప సినిమాలో ‘దాక్షాయణి’గా అందర్నీ బెదరగొట్టేసింది అనసూయ. కనిపించింది రెండు మూడు సీన్లే అయినప్పటికీ.. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఆమె రోల్‌లో... లుక్.. మ్యానరిజం.. గెటప్ ఊరమాస్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా మంగళ శీను (సునీల్) మీదికెక్కి.. బ్లేడ్‌తో పీకకోసే సీన్‌లో అయితే భయపెట్టేసింది.
Samayam Telugu యాంకర్ అనసూయ
anasuya body shaming


మొత్తానికి రంగమ్మత రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. దాక్షాయణిగా పర్వాలేదనిపించింది అనసూయ. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోయిన అనసూయ.. రిలీజ్ తరువాత ప్రమోషన్స్‌లో పాల్గొని.. స్పీచ్‌లతో దంచికొట్టింది. అయితే అనసూయ ‘పుష్ప’ లుక్ పక్కనపెడితే.. ఆమె బాగా లావు అయ్యిందంటూ బాడీ షేమింగ్ చేస్తూ యూట్యూబ్‌లో వీడియోలు దర్శనం ఇస్తుండటంతో వాటిపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యింది అనసూయ.

తాజాగా ఇన్ స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చిన అనసూయ.. ‘నేను లైవ్ వచ్చానంటే అందరికీ చాలా కంగారుగా ఉంటుంది.. ఇప్పుడేం క్లాస్‌లు పీకుతుందో అని. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ థంబ్ నెయిల్స్ చూశాను.. వాటిని పట్టించుకోకూడదని అనుకుంటా కానీ.. అన్ని సందర్బాల్లోనూ స్ట్రాంగ్‌గా ఉండలేం కదా.. అందరికీ వీక్ మూమెంట్స్ ఉంటాయి. అటెన్షన్ కోసం కామెంట్స్ చేస్తుంటారు.

ఎంత లావు అయిపోయిందో చూడండి.. ఓవర్ వెయిట్.. షాకింగ్.. లాంటి థంబ్ నెయిల్స్ పెట్టారు. మంచి వాటినే చదివి మంచి వాళ్లతోనే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నేను వెయిట్ పెరిగాను.. ఈ సందర్భంలో మీ క్యారెక్టర్.. మీ దిగజారుడుతనాన్ని ఎలా ఎత్తుకుంటారని నేను ఆ కామెంట్స్ చేసేవాళ్లని అడుగుతున్నా. నేను కూడా మీలాగే మాట్లాడగలను.. హర్ట్ చేయగలను కానీ అది నా వ్యక్తిత్వం కాదు’ అంటూ క్లాస్ పీకింది అనసూయ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.