యాప్నగరం

నన్ను చూస్తే మూడ్ రాదనే వాడు నా భర్త.. అమ్మాయిల్ని ఇంటికి తెచ్చుకుని నా ముందే..: కీర్తిరెడ్డి సంచలన విషయాలు

17 ఏళ్లకే పెళ్లి.. 18 ఏళ్లకు కూతురు.. 21 ఏళ్లకు కొడుకు.. కాపురం కొన్నాళ్లు పాటు బాగానేసాగింది. అతని కోసం నా లైఫ్ స్టైల్ మొత్తం మార్చేశా. నా కెరియర్ వదిలేశా. కాని అతను పిల్లలు పుట్టాక.. నన్ను చూస్తే మూడ్ రావడం లేదంటూ నీఛంగా వేరే అమ్మాయిలతో..

Samayam Telugu 28 Apr 2020, 7:49 pm
ఈ మధ్య హైదరాబాద్ పబ్‌లో సింగర్, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై జరిగిన దాడి ఇష్యూ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఓ అమ్మాయి విషయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే తమ్ముడు, అతని అనుచరులు బీర్ బాటిల్స్‌తో రాహుల్‌పై దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ వీడియోలో రాహుల్ కూడా ఉన్న అమ్మాయి ఎవరు? అంటూ ఆరాతీయడం మొదలుపెట్టారు. అయితే ఈ వీడియోలో ఉన్నది ప్రముఖ యాంకర్, టిక్ టాక్ స్టార్ కీర్తి రెడ్డి అని న్యూస్ వైరల్ అయ్యింది. అయితే రాహుల్‌తో ఆమె పబ్‌కి వెళ్లిన మాట వాస్తమేనని అయినప్పటికీ నాటి పాత వీడియోలను వైరల్ చేశారు. ఈ ఇష్యూలో వార్తల్లోకి వచ్చిన కీర్తి రెడ్డి వాటిని ఖండిస్తూ.. తన పర్శనల్ లైఫ్‌కి సంబంధించిన షాకింగ్ విషయాలను బయటపెట్టింది.
Samayam Telugu anchor and tiktok star keerthi reddy reveals facts about her husband harassment
నన్ను చూస్తే మూడ్ రాదనే వాడు నా భర్త.. అమ్మాయిల్ని ఇంటికి తెచ్చుకుని నా ముందే..: కీర్తిరెడ్డి సంచలన విషయాలు


టీవీ యాంకర్‌గానే కాదు.. ఇండస్ట్రీ వ్యక్తులకూ దగ్గరగా

ఈటీవీలో ప్రముఖ కార్యక్రమంతో పాపులర్ అయిన యాంకర్ కీర్తి రెడ్డి తరువాత చాలా ఛానల్స్ మారుతూ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులతో పరిచయాలతో క్యాస్టింగ్ హౌస్‌ని నిర్వహిస్తోంది. అయితే రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు ప్రముఖులతో పరిచయాలు ఉన్న కీర్తి రెడ్డి సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతుంది. పబ్‌లకు వెళ్లడం మందు తాగడం సిగరెట్ తనకు అలవాటు అని ఓపెన్‌గానే చెప్తూ తన వస్త్రధారణ విషయంలో కూడా తనకు నచ్చినట్టుగానే ఉంటూ.. టిక్ టాక్‌లో సంచలనంగా మారిన ఈ యాంకర్ సంచలన విషయాలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. తన పర్శనల్ లైఫ్‌లో ఎలాంటి ఇబ్బందులు పడింది? అసలు తాను ఇలా అవ్వడానికి గత కారణాలను తెలియజేసింది.

నేను, తమ్ముడు, అమ్మ కలిపే తాగుతాం.. పార్టీలకు వెళ్తా వోడ్కా తాగుతా..

నాకు 17 ఏళ్లకే పెళ్లి అయ్యింది. 18 ఏళ్లకు పాప పుట్టింది. 21 ఏళ్లకు బాబు పుట్టాడు. టిక్ టాక్‌లో నా పిల్లల్ని చూసి నా తమ్ముడు చెల్లెలు అంటారు. నా కూతురు నా కంటే హైట్‌గా ఉంటుంది. నా కూతురు నాతో చాలా సరదాగా ఉంటుంది. నేను వేసుకోవాల్సిన డ్రెస్‌ కూడా అదే ఇస్తుంది. మా అమ్మ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైనా తాగాలని అనిపించినప్పుడు.. నాకు ఓడ్కా అంటే బాగా ఇష్టం.. రెగ్యులర్‌గా పార్టీలకు పోతుంటా.. మందు తాగుతా.. ఫ్రెండ్స్‌తో తిరుగుతా.. బయట ఎవడూ కనిపించక ఎవడూ పార్టీలకు తీసుకుపోడు అన్నప్పుడు మా తమ్ముడికి కాని, అమ్మకి కాని చెప్తా.. చెప్పవే మమ్మీ బాటిల్ అంటా.. ముగ్గురం కలిసి తాగుతాం. మాది చిల్ ఫ్యామిలీ.

Read Also: రాహుల్‌తో ఆరోజు పబ్‌లో.. నేనే పార్టీ ఇవ్వమన్నా కానీ ఆ రాత్రి ఏమైందంటే.. అసలు నిజం చెప్పిన కీర్తి

అమ్మా.. ఓ సిగరెట్ తాగు అని నా కూతురే చెప్తుంది..!

నేను టిక్ టాక్ వీడియోలు కూడా సిగరెట్ తాగుతూ చేశా.. చాలా మంది కామెంట్స్ చేశారు.. నిన్న చూసి మీ పాపకూడా అలా తయారౌతుంది అని అంటుంటారు. వాళ్లకి ఒక్కటే ప్రశ్న.. మా అమ్మ చాలా సైలెంట్.. ఇప్పుడు నేను సిగరెట్ మందు తాగుతా.. అది మా అమ్మకి కూడా ఉండాలి కదా.. మరి ఆమెకు లేని అలవాట్లు నాకు ఎలా వచ్చాయి. మనం చేసే పనులు మన పిల్లలకు వస్తాయని అనుకోవడం మన మూర్ఖత్వం. అలవాటు చేసుకుంటేనే వస్తాయి. ఈరోజు నేను ఇంత ఫ్రీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటా.. నా పిల్లలకు ఎఫెక్ట్ కాలేదు. నేను డిప్రెషన్‌లో ఉండి అరుస్తుంటే.. అమ్మా!! పైకి పోయి ఓ సిగరెట్ తాగిరా పో అంటుంది నా కూతురు.
Read also: క్యాస్టింగ్ కౌచ్‌పై నటి ‘భావన’.. ఇండస్ట్రీకి రావాలనుకునే అమ్మాయిలు అదే తప్పు చేస్తున్నారు.. నేనైతే!!

టిక్ టాక్ కోసం మా ఆయన్ని వదిలేయలేదు!

నేను టిక్ టాక్ కోసమే మా ఆయన్ని వదిలేశా అని అంటున్నారు. కాని 2013-14లో టిక్ టాక్ రాలేదు. ఆయన్ని వదిలేసింది టిక్ టాక్ కోసం కాదు. నేను ఏడున్నరేళ్లు నా భర్తతో ఉన్నా.. అతనితో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా.. నాకు చాలా చిన్న ఏజ్‌లో పెళ్లి చేశారు. ఇంట్లో వాళ్లు మంచి సంబంధం చూసి చేశారు. అతను సెటిల్ అయిన వ్యక్తి. ఏడాదిన్నర పాటు మా కాపురం బాగానే ఉంది. ఎవరి జీవితమైన ఒక మొబైల్‌‌లోనే ఉంటుంది. నేను అతని మొబైల్ రెండు మూడు సార్లు చూశా. కొన్ని ఫొటోలు చూశా.. అతను వేరే అమ్మాయిలతో కలిసి ఉన్న ఫొటోలు చూసి తట్టుకోలేకపోయా. అప్పుడు నా వయసు 20 ఏళ్లు ఉంటాయి.
Read also: మళ్లీ వార్తల్లోకి ఆ హీరోయిన్.. జగన్‌తో ఆ ఫొటో.. నాడు దారుణమైన ట్రోల్స్, నేడు ఓ మంచి పని

నా మొగుడు అన్నం తినడం లేదని.. ఆ అమ్మాయిని వెళ్లి బతిమిలాడా.. నా మొగుడితో మాట్లాడు అని

నేను ఇప్పుడు ఎలాంటి డ్రెస్‌లు వేసుకుంటున్నానో.. 2004-2005 టైంలో ఇలాగే ఉండేదాన్ని. కాని పెళ్లైన తరువాత పూర్తిగా మారిపోయా. సతీసావిత్రిలా మారిపోయా. మొగుడే దైవంలా భావించా. అలాంటి టైంలో ఒక అమ్మాయి వచ్చి మా జీవితాన్ని చెడగొట్టేసింది. ఇలాంటి పనులు ఎంతమంది చేస్తారో నాకు తెలియదు కాని.. నా మొగుడు అన్నం తినకపోతే.. నేను అడిగేదాన్ని ఏమైందని.. అతను ఆ అమ్మాయి మాట్లాడటం లేదు అని చెప్పాడు. అప్పుడు నేను తొమ్మిదో నెల గర్భిణిగా ఉన్నా.. కడుపులో నా కొడుకు ఉన్నాడు. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది ఏంటి అని అడిగితే.. నీకు తెలిసిన అమ్మాయే.. మీ ఇంటిపక్కన ఉండే అమ్మాయి కజిన్ అని చెప్పాడు. ఆమెకు నేను కనెక్ట్ అయ్యా అంటే.. ఆమె కోసం నేను చైతన్య పురి నుంచి సికింద్రాబాద్ వెళ్లి అమెను బతిమిలాడా. నా మొగుడు అన్నం తినడం లేదు.. ఒకసారి మాట్లాడవా అని బతిమిలాడా..!

అ అమ్మాయి నన్ను వదిలేయమని చెప్పిందట.. దాంతో అతను..

మా అమ్మ కూడా నన్ను తిట్టేది. నేను చెప్పినా.. నా మొగుడు ఏమైనా కానియ్యి. వాడి లైఫ్ వాడిది.. నా లైఫ్ నాది.. పెళ్లంగా నైనా ఇంట్లో ఉంటా అని చెప్పా. ఎందుకంటే నాది అనుకున్న జీవితాన్ని నేను వదిలేసి ఇతని కోసం వచ్చేశా. ఇతనే సర్వస్వం అనుకున్నా. కాని ఇతను పచ్చిగా అమ్మాయిలతో తిరిగేవాడు. వారితో మితిమీరి ప్రవర్తించే వాడు.. లేట్ నైట్ ఇంటికి వచ్చేవాడు. అన్నీ భరించా.. చివరికి ఆ అమ్మాయి నిన్ను వదిలేయమంటుంది. నిన్ను వదిలేస్తే నాతో ఉంటుందట అని చెప్పాడు. నేను అప్పుడు సరే అని మా అమ్మ ఇంటికి వచ్చేశా. అప్పుడే అతని మీద రివేంజ్ తీర్చుకుందాం అనుకున్నా.

చాలా మంది అమ్మాయిలతో న్యూడ్ వీడియోలు

నేను 2003 నుంచి ఈటీవీలో వర్క్ చేయడం మొదలు పెట్టా. కాని అతని కోసం అన్నీ వదిలేశా. తరువాత స్టుడియో ఎన్‌లో వర్క్ చేయడం మొదలుపెట్టా. మీడియాలో ఉన్నా కాబట్టి.. సీసీఎస్‌లో కంప్లైంట్ చేశా. ఆ సందర్భంలో అతని కంప్యూటర్ నుంచి కొన్ని వీడియోలు, ఫొటోలు తీసుకున్నా. చాలా మంది అమ్మాయిలతో న్యూడ్ ఫొటోలు వీడియోలు తీసుకున్నాడు. వాటిని పోలీస్‌లకు ఇచ్చా. అతను నన్ను చాలా విధాలుగా ఇబ్బందులు పెట్టాడు. ఫిజికల్‌గా మెంటల్‌గా వాటిని నేను చెప్పలేను. చచ్చిపోయి మీ ముందు ఇలా ఉన్నాను. చిన్నతనంలోనే నరకంలోనే ఉన్నా. నాకు నచ్చని విషయాల్లో నో అని చెప్పకపోవడం వల్లే ఇలా జరిగింది.

Courtesy Multiplex Movies Youtube Channel

నిన్ను చూస్తే మూడ్ రావడం లేదని ముఖంపై చెప్పేవాడు.. వేరే వాళ్లను ఇంటికి తెచ్చుకుని

ఎంత దారుణంగా ఉండేవాడంటే.. నా కళ్లు ముందే ఇంటికి అమ్మాయిని తీసుకుని వచ్చి సెక్స్ చేసేవాడు. అది కూడా భరించా.. నాకు ఆయన కావాలని అనుకున్నా.. అతని మాయలో పడిపోయా. నా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండదని సర్దుకుపోయా. నాకు ఇలాంటి లైఫ్ ఉంటుందని నాకు తెలియదు. పెళ్లైతే వాడితోనే జీవితం ఏమో అనుకున్నా. ఇప్పుడు అన్నీ తెలుసుకున్నా. నన్ను బూస్టింగ్ చేసేవాడు.. నేను ఇంటికి తెచ్చుకున్నా.. బయట కూడా ఈ పని చేయొచ్చు.. కాని నీకు చెప్పి చేస్తున్నా అంటూ బూస్టింగ్ చేసేవాడు. నేను కూడా కాంప్రమైజ్ అయ్యేదాన్ని. నిన్ను చూస్తే నాకు మూడ్ రావడం లేదు.. అని ముఖంపై చెప్పేవాడు. ఆ తరువాత నీకు ఎవరిదగ్గరకు పోతే మూడ్ వస్తుందో దాని దగ్గరకే పో అని లైట్ తీసుకున్నా.

అతను ఏదైతే విషయాల్లో నన్ను దెబ్బతీశాడో.. అవే చూపిస్తున్నా

నా జీవితం ఓ నరకం.. పైకి నవ్వుతూ ఉంటా కాని.. చాలా జీవితం చూశా. ఒక అమ్మాయి ఊరికే ఇంత స్ట్రాంగ్‌గా కాదు. ఎన్నో ఫేస్ చేస్తేనే ఇలా చేస్తుంది. ఇదేంటి?? బరితెగించింది.. పబ్‌లకు పోతుంది అంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పరిస్థితులే ఇలా మార్చేస్తాయి. అతను బాగా రిచ్ అని కాదు.. బాగా సెటిల్ అయినవాడే. అప్పుడు నాకు 17 ఏళ్లు అయినప్పటికీ 30 ఏళ్ల అమ్మాయిలా కనిపించే దాన్ని. ఇప్పుడు రివర్స్‌లో ఉన్నా.. ఎందుకంటే.. అతను ఏదైతే విషయాల్లో నన్ను దెబ్బతీశాడో.. అవే చూపిస్తున్నా. నేను దేనికి సెట్ కాను.. ఇంటికే పరిమితం.. నువ్వెంత.. అనేవాడు. అందుకే వాడిని వదిలేసి మీడియాలో కొత్త జీవితం ప్రారంభించా.


Courtesy Multiplex Movies Youtube Channel

రివేంజ్ తీర్చుకున్నా..

మీడియాలో ఉన్నా కాబట్టి.. సీసీఎస్‌లో కంప్లైంట్ చేశా. ఆ సందర్భంలో అతని కంప్యూటర్ నుంచి కొన్ని వీడియోలు, ఫొటోలు తీసుకున్నా. చాలా మంది అమ్మాయిలతో న్యూడ్ ఫొటోలు వీడియోలు తీసుకున్నాడు. వాటిని పోలీస్‌లకు ఇచ్చా. నన్ను ఇంత క్షోభ పెట్టిన వాడిపై రివేంజ్ తీర్చుకున్నా.. కోర్టులో కేసుపెట్టా.. లీగల్‌గా విడాకులు తీసుకున్నా.. ఇంకా కొన్ని కేసులు జరిగాయి. వాటిని బయటపెట్టదలచుకోలేదు’ అంటూ తన గత జీవితంలో చీకటి కోణాన్ని తెలియజేసింది యాంకర్, టిక్ టాక్ సంచలనం కీర్తి రెడ్డి.

Read also: వాడు డిన్నర్‌లో.. వీడు కార్‌లో.. అలా చేస్తారని ఊహించలేదు: సీరియల్ నటి అశ్మిత రియల్ ఇన్సిడెంట్స్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.