యాప్నగరం

మేకప్ మెన్ చేసిన పనికి ఎమోషనల్.. ఆ డబ్బులు కూడా అంటూ యాంకర్ ఝాన్సీ పోస్ట్

యాంకర్ ఝాన్సీ తన వీలైనంతలో కొంత మందికి నిత్యావసర సరకులను అందిస్తున్నారు. ఈ మేరకు తన టీంతో ఆ కార్యక్రమాలను చేయిస్తున్నారు. తన మేకప్ మెన్, టచప్ అసిస్టెంట్ రమణ చేస్తోన్న మంచి పనుల గురించి చెప్పుకొచ్చారు.

Samayam Telugu 27 May 2021, 9:30 pm

ప్రధానాంశాలు:

  • చేతనైన సాయం చేస్తోన్న యాంకర్ ఝాన్సీ
  • మేకప్ మెన్ చేసిన పనికి ఎమోషనల్
  • ఆ డబ్బులు కూడా అంటూ యాంకర్ ఝాన్సీ పోస్ట్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu మేకప్ మెన్ చేసిన పనికి ఎమోషనల్.. ఆ డబ్బులు కూడా అంటూ యాంకర్ ఝాన్సీ పోస్ట్
Anchor Jhansi
ప్రస్తుతం కరోనాతో మన దేశం ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుందో అందరికీ తెలిసిందే. రోజుకు లక్షల్లో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. వేల మంది ప్రాణాలు కోల్పోతోన్నారు. అయితే దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా లాక్డౌన్‌ను పాటిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మినహాయింపులతో కూడిన కర్ఫ్యూలు అమలవుతున్నాయి. ఈ క్రమంలో ఎంతో మంది ఉపాధిని కోల్పోయి, తినడానికి తిండి లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సెలెబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తమకు చేతనైన సాయాన్ని చేస్తున్నారు.
అందులో భాగంగా యాంకర్ ఝాన్సీ తన వీలైనంతలో కొంత మందికి నిత్యావసర సరకులను అందిస్తున్నారు. ఈ మేరకు తన టీంతో ఆ కార్యక్రమాలను చేయిస్తున్నారు. తన మేకప్ మెన్, టచప్ అసిస్టెంట్ రమణ చేస్తోన్న మంచి పనుల గురించి చెప్పుకొచ్చారు. ఆయన చేసిన పనులకు ఝాన్సీ ఎమోషనల్ అయ్యారు. వారి కోసం ఇచ్చిన డబ్బులను కూడా ఇతరుల కోసమే వాడుతున్నారని ఝాన్సీ చెప్పుకొచ్చారు.
View this post on Instagram A post shared by Jhansi (@anchor_jhansi)

‘నాకు వీలైనంతలో ఒక 25 మందికి నెల సరుకులు ఇచ్చే పనిని రమణ దగ్గరుండి చూస్కున్నాడు, అందులో చిన్న మొత్తం మిగిలింది, అది నీ దగ్గరే ఉంచు రమణా అన్నా కూడా, ప్రస్తుతం నాకు ఇబ్బంది లేదు అంటూ తన చుట్టూ, అవసరం ఉన్న మరో నలుగురికి నిత్యావసర సరుకులు అందించాడు.. మంచితనం డబ్బుతో రాదు... మా శ్రీను , రమణ , జన్మతః గొప్ప సంస్కారం కలిగిన వ్యక్తులు .. వీరితో కలిసి పని చేయడం నా అదృష్టం’ అంటూ ఝాన్నీ చెప్పుకొచ్చారు.
ఆయన కోసమే సినిమా చూస్తున్నా.. ప్రియాంక జవాల్కర్ పోస్ట్ వైరల్
ఆ మధ్య ఝాన్సీ కరోనా మీద తన ద్వేషాన్ని ప్రకటించారు. కరోనా వల్ల లాక్డౌన్ పెట్టడంతో తన బంధువుల పెళ్లికి హాజరు కాలేక.. ఇంట్లోంచే వర్చువల్ చూసే పరిస్థితి వచ్చింది.. దీనంతటికి కారణం కరోనాయే అని ఝాన్సీ చెప్పుకొచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.