యాప్నగరం

Intinti Gruhalakshmi Kasthuri: ఏ యాంగిల్‌లో చూసినా మదర్‌‌లా లేవు.. మరదల్లా ఉన్నావ్.. ‘గృహలక్ష్మి’పై ఓంకార్ కొంటె కామెంట్లు

Sixth Sense Season 5 Promo: ఓంకార్ అన్నయ్య‌కి ఇంటింటి గృహలక్ష్మి నటి కస్తూరిపై మనసైంది. వీళ్లిద్దరూ ఏదో మేకప్‌లు వేసి కవర్ చేసుకుంటున్నారు కానీ ఇద్దరిది ముదురు వయసే.. పైగా ఇద్దరూ ఒక ఏజ్ గ్రూప్ వాళ్లే కావడంతో.. కస్తూరి ఊపుచూసి తట్టుకోలేక నోటికి పని చెప్పాడు మన ముదురు యాంకర్ ఓంకార్.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 22 May 2023, 9:13 pm
ఇంటింటి గృహలక్ష్మిలో కస్తూరి.. ఆ సీరియల్‌లో మాత్రమే అచ్చతెలుగు తులసి. ఇక సోషల్ మీడియాలో కానీ.. ప్రైవేటు ఈవెంట్‌లోకానీ.. టీవీ షోలలో కానీ కనిపించిందంటే కస్తూరి మెరుపులు మామూలుగా ఉండవు. ఐదు పదుల వయసు దాటినా హాట్ ఫొటోలతో అల్లాడించి.. బికినీతో బెంబేలెత్తించే కస్తూరి.. ఈసారి ఇంకాస్త రెచ్చిపోయింది.
Samayam Telugu Sixth Sense Season 5 Promo
intinti gruhalakshmi kasthuri


యాంకర్ ఓంకార్ (Anchor Ohmkar) హోస్ట్ చేస్తున్న ‘సిక్స్త్ సెన్స్’ (Sixth Sense Season 5) సీజన్ 5కి గెస్ట్‌గా వచ్చిన కస్తూరి ఐటమ్ అవతారం ఎత్తింది. వేర్ ఈజ్‌గా పార్టీ అంటూ తెగ ఊపేసుకుంది కస్తూరి. అది చూసిన మన ముదురు యాంకర్ ఓంకార్ కస్తూరిపై మనసు పారేసుకున్నాడు. మేకప్ కోటింగ్ కాస్త యంగ్‌గా కనిపిస్తున్నాడు కానీ.. ఆ కస్తూరిది.. ఓంకార్‌ది దాదాపు ఒకటే ఏజ్ గ్రూప్ కావడంతో.. కస్తూరి ఒంపుసొంపుల్ని చూసి నోటికి పనిచెప్పాడు ఓంకార్.

‘కస్తూరి గారూ’!! మీరు కాస్త లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి’ అని అడిగాడు ఓంకార్. అడగ్గానే కస్తూరి ఆంటీ లెఫ్ట్ టర్న్ అయ్యింది. దీంతో ఓంకార్.. ‘ఏ యాంగిల్‌లో చూసినా.. మీరు మదర్‌లా లేరు.. మరదలులా ఉన్నారు’ అంటూ కొంటె కామెంట్లు చేశాడు ఓంకార్. ఇక ఓంకార్ ఆ మాట అనడంతో.. నిజంగానే ఓంకార్‌కి మరదలు మాదిరిగానే ఫీల్ అయిపోతుంది కస్తూరి. ఇక బ్యాగ్రౌండ్‌లో ఏలే ఏలే మరదలా.. అంటూ ఆమె నటించిన ‘అన్నమయ్య’ సినిమాలోని సాంగ్‌ని అందుకున్నారు.

ఇక బ్రహ్మముడి కనకం అయితే.. లాంగ్ ఫ్రాక్ వేసుకొచ్చి.. ‘ఊ అంటావా? మావా.. ఊహూ అంటావా మామా’ అంటూ ఐటమ్ సాంగ్‌తో అల్లాడించింది. ఎవరి కంఫర్ట్ వాళ్లది కానీ.. ఈ డ్రెస్ అయితే కనకానికి అస్సలు సూట్ కాలేదు. దానికి తగ్గట్టుగా ఆమె ఊపుకి అస్సలు మ్యాచ్‌ కాలేదు.

ఇక యాంగిల్స్ అన్నీ దగ్గర నుంచి బాగా చూసిన ఓంకార్.. ‘మదర్స్‌‌‌ని పిలిస్తే.. మీరు ఇంత హాట్‌గా వచ్చారు.. మిమ్మల్ని చూసి నాకు చెమటలు పడుతున్నాయి’ అని అనేశాడు ఓంకార్. ఆ మాట విని తెగ పొంగిపోయారు కస్తూరి, కనకాలు. ఆ తరువాత ఓంకార్ పొగడ్తలకు పడిపోయిన కస్తూరి.. ఇదేదో బాగానే ఉందే అనుకుందో ఏమో కానీ.. ‘ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మామా’ అంటూ ఐటమ్ అవతారం ఎత్తింది. ఒళ్లు మొత్తం తెగ ఊపేసుకుంటూ స్టేజ్‌పై రచ్చ రచ్చే చేసింది. చివర్లో ‘బ్రహ్మముడి’ కనకం.. లకలకలక అంటూ చంద్రముఖి అవతారం ఎత్తింది. చూసినోళ్లకి చూసినంత అన్నట్టుగా తన టాలెంట్ మొత్తం చూపించింది బ్రహ్మముడి కనకం. మొత్తానికి అటు కస్తూరి ఇటు కనకం తగ్గేదేలే అన్నట్టుగా చెలరేగిపోయారు.

రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.