యాప్నగరం

Anchor Rashmi: యాంకర్ రష్మీకి చేదు అనుభవం.. షాపింగ్ మాల్ ఓపెనింగ్‌‌లో ఫ్యాన్స్ అరాచకం.. చెరగని చిరునవ్వుతో జబర్దస్త్ యాంకర్

జబర్దస్త్ యాంకర్ రష్మికి చేదు అనుభవం ఎదురైంది. తరచూ షాపింగ్ మాల్స్, ప్రైవేట్ ఈవెంట్లకు హాజరయ్యే రష్మిని ఫ్యాన్స్‌ వెంటాడుతూనే ఉంటాడు. ఒకేసారి మీద పడటం లాంటివి కామన్‌గా చూస్తుంటాం.. అయితే!!

Samayam Telugu 25 Oct 2021, 6:53 pm
‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన వాళ్లలో యాంకర్ రష్మి ఒకరు. హీరోయిన్ కావాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చిన రష్మి.. నటిగా సక్సెస్ కాలేకపోయినా, యాంకర్‌గా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యారు. స్టార్ హీరోయిన్లతో సమానంగా రష్మీకి తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఉందంటే అతిశయోక్తికాదు. ఆమె ఎక్కడికైనా ఈవెంట్‌కు వెళ్లారంటే అక్కడ సందడే సందడి. అభిమానులు ఎగబడిపోతారు. తాజాగా చిత్తూరులోనూ అదే పరిస్థితి కనిపించింది.
Samayam Telugu యాంకర్ రష్మి
Rashmi Gautam


సోమవారం చిత్తూరు నగరంలో యాంకర్ రష్మి సందడి చేశారు. స్థానిక చర్చి వీధిలో నూతనంగా ఏర్పాటుచేసిన సంస్కృతి షాపింగ్ మాల్‌ను రష్మి ప్రారంభించారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంకు విచ్చేసిన రష్మీని చూసేందుకు పెద్ద ఎత్తున జనం చర్చి వీధికి చేరుకోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం రద్దీగా‌ మారిపోయింది. రష్మీతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడడంతో వారిని అదుపుచేయడం షాపింగ్ మాల్ సిబ్బంది వల్ల కాలేదు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. అరుపులు కేకలతో గందరగోళ పరిస్థితి కనిపించింది. కొంతమంది ఆకతాయిలు రష్మిని మీదికి దూసుకుని వచ్చారు. ఆమెను తాకేందుకు ప్రయత్నించారు. ఆ జనం మధ్యలోనే ఇరుక్కుపోయింది రష్మి. అయినప్పటికీ రష్మి ఎక్కడా అసహనానికి గురికాకపోవడం గమనార్హం. నవ్వుతూనే అభిమానులకు సర్దిచెప్పారు.

ఈ గందరగోళ పరిస్థితిలో రిబ్బన్ కూడా కట్ చేయడం రష్మీకి వీలుపడలేదు. జనం తోపులాట మధ్య నుంచే షాపింగ్ మాల్‌లోకి అడుగుపెట్టిన రష్మి.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆ తరవాత షాపింగ్ మాల్ స్టాఫ్‌తో ఫొటోలు దిగారు.. షాప్‌లోని చీరలను ప్రదర్శించారు. అయితే, ఈ తోపులాట, గందరగోళ పరిస్థితి రష్మి క్రేజ్‌కు అద్దంపడుతున్నా.. ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు సెక్యూరిటీ ఏర్పాటుచేయని షాపింగ్ మాల్ యాజమాన్యం తీరుపై విమర్శలు వస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.