యాప్నగరం

Suma Kanakala: అనసూయపై అలాంటి అభిప్రాయమా? కుళ్లు బయట పెట్టిన సుమ! సెన్సేషనల్ కామెంట్స్

బుల్లితెర యాంకర్లలో తనకు అనసూయను చూస్తే కుళ్లు అంటూ ఓపెన్ అయింది యాంకర్ సుమ. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఆడవాళ్లపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

Samayam Telugu 9 Jul 2020, 4:18 pm
అనసూయ, సుమ.. ఈ ఇద్దరు బుల్లితెర యాంకర్స్ తెలియని తెలుగు ప్రేక్షకుడు లేరనడంలో అతిశయోక్తి లేదు. బుల్లితెర ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడంలో వీరిద్దరూ ఎవరికి వారే సాటి. సుమ.. మాటల గారడీతో మాయ చేసి బుట్టలో వేసుకుంటే, అనసూయ గ్లామర్ కిక్కిస్తూ వలలో వేసుకుంటుంది. అయితే ఈ ఇద్దరికి సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం హాట్ ఇష్యూ అయింది.
Samayam Telugu అనసూయను చూస్తే ఆ ఫీలింగ్.. ఓపెన్ అయిన యాంకర్ సుమ!
Suma Anasuya


తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్ సుమ.. అనసూయను చూస్తే తనకు కుళ్లుని చెప్పడంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. తాను మొదట్లో.. ఇప్పుడున్న యాంకర్లలో అనసూయను చూసి బాగా ఫీల్ అయ్యేదాన్నని ఓపెన్ గానే చెప్పేసింది సుమ. అది జెలసీనో, భయమో తెలియదు కానీ బుల్లితెరపై అనసూయను చూడగానే ఒ కరకమైన ఫీలింగ్ కలిగేదని సుమ తెలిపింది.

Also Read: ఆ మాటతో పవర్ స్టార్‌ని ఒప్పించిన వర్మ.. షూటింగ్ స్టార్ట్! ఈ 12 రోజుల్లోనే..

అంతేకాదు అనసూయ చాలా తెల్లగా, అందంగా ఉంటుందని, ఆమె మొహం కూడా క్లియర్‌గా ఉంటుందని సుమ చెప్పింది. ఆడవాళ్లందరికీ సహజంగానే కుళ్లు ఉంటుంది కదా! అందుకే తనకూ అనసూయ చూస్తే అలాంటి ఫీలింగే కలుగుతోందని తన అభిప్రాయాన్ని అందరి ముందుంచింది సుమ. అంతేకాదు తమకు కుళ్లు ఉండదని చెప్పే ఆడవాళ్లను నమ్మొద్దని చెప్పి మరో షాకిచ్చింది. వాళ్ళు అలా చెప్తున్నారంటే అది అబద్దమే అంటూ ఆడవాళ్లపై సంచలన కామెంట్ చేసింది యాంకర్ సుమ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.