యాప్నగరం

Anchor Varshini: త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న యాంకర్ వర్షిణి.. వరుడు అతడే..!

యాంకర్ వర్షిణి సౌందరాజన్ (Varshini Sounderajan) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. తన బావను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుందట.

Authored byAshok Krindinti | Samayam Telugu 2 Oct 2022, 3:39 pm
తన చలాకీతనంతో.. మాటలతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ మంచి పేరు సంపాదించుకుంది యాంకర్ వర్షిణి సౌందరాజన్ (Varshini Sounderajan). ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. మరోవైపు ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Samayam Telugu Anchor Varshini
యాంకర్ వర్షిణి


పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని వర్షిణి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే వరుడు ఎవరో కాదండోయ్.. వర్షిణి బావతోనే ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు సినిమాల్లో ట్రై చేసిన ఈ బ్యూటీ.. పెద్దగా అవకాశాలు రాకపోవడంతో పెళ్లి వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకుందట. వరుసకు కాబోయే బావ అంటే వర్షిణికి ఎంతో ఇష్టమని.. ఆమె అంటే అతని కూడా ఇష్టమట. ఈ నేపథ్యంలోనే వారిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

వర్షణి బావ ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగి కాగా.. ఒక్కడే కొడుకు అని తెలుస్తోంది. ఈ నెల చివర్లో ఎంగేజ్‌మెంట్ చేసుకుని.. వచ్చే ఏడాది మార్చిలో పెళ్లి పీటలు ఎక్కేందుకు వీళ్లద్దరు నిర్ణయించుకున్నారట. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.