ఒక షో సక్సెస్ అయితే హిట్ అంటారు.. రెండో సీజన్ కూడా హిట్ అయితే సూపర్ హిట్ అంటారు. కాని చేసిన ప్రతి సీజన్ సక్సెస్ కొడితే అది ‘ఢీ’ అంటారు అంటూ ‘ఢీ జోడీ’ 11 సీజన్‌ను మొదలుపెట్టేశారు యాంకర్ ప్రదీప్. బుల్లితెరపై వరుసగా 10 సీజన్ల పాటు తిరుగేలేని డాన్స్ షోగా ఎన్టీఆర్, బన్నీ, నాని, రాజమౌళి, ప్రభాస్ లాంటి స్టార్లు అతిథులుగా విచ్చేసిన మోస్ట్ ఎంటర్టైనర్ డాన్స్ షో ‘ఢీ 11’ ప్రారంభమైంది.
ఈ సీజన్లో ఒక్కరు మినహా పెద్దగా మార్పులు చేయలేదు. యాంకర్‌గా ప్రదీప్, న్యాయనిర్ణేతలుగా శేఖర్ మాస్టార్ , ప్రియమణిలు వ్యవహరిస్తుండగా.. గత సీజన్‌కు టీం లీడర్లుగా సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మిలు ఫుల్ ఫన్ అందించారు. అయితే ఈ సీజన్లో స్వల్ప మార్పు చేశారు యాంకర్ రష్మి ప్లేస్‌లో బిగ్ బాస్ సీజన్ 2 ఫేమ్ భాను శ్రీని తీసుకున్నారు.
మొదటి ఎపిసోడ్‌లోనే.. ‘అందమైన అమ్మాయి ఆవేశంతో వస్తే.. ఎట్టా ఉంటాదో తెలుసా? అంటూ తనదైన హస్కీ గొంతుతో ఎంట్రీ ఇచ్చి.. సుధీర్ చెంప చెల్లుమనిపించింది. సుధీర్.. రేయ్ అంటూ ‘నువ్ ఇప్పటి వరకూ అందమైన అమ్మాయిల్ని చూసి ఉంటావు.. అణకువతో ఉన్న అమ్మాయిని చూసి ఉంటావు.. భయంతో ఉన్న వాళ్లను చూసి ఉంటావు.. బలుపుతో ఉన్న వాళ్లని చూసి ఉంటావు.. కాని ఆడపులి అమ్మాయి రూపంలో వస్తుంటే.. ఎలా ఉంటాదో చూస్తావా.. చూస్తావా అంటూ సుధీర్ పైపైకి వెళ్లడం.. కాస్త ఓవర్ యాక్షన్‌గా అనిపించినప్పటికీ.. తనో ఆడపులిని అంటూ సవాల్ చేసింది. ఇక నీ మీద పడి అరవడానికి రష్మిని కాదు.. నీ వెనుక పడి బ్రతిమిలాడటానికి వర్షిణిని కాదు.. భాను.. బాక్స్ బద్దలైపోద్ది అంటూ సుధీర్‌ని వీర కుమ్ముడు కుమ్మేసి మూలన కూర్చోబెట్టింది.
అయితే యూట్యూబ్‌లో ఈ కార్యక్రమాన్ని షేర్ చేయగా.. కేవలం కొన్ని గంటల్లోనే 11 లక్షల మందికి పైగా వీక్షించారు. అయితే ఎక్కువ మంది బాబోయ్.. భాను శ్రీ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నామ్.. ఆమె గొంతును వినలేకపోతున్నామ్.. ఆమెను తీసేసి రష్మిని పెట్టాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.