యాప్నగరం

ఆన్ లైన్‌లో ఆయిల్ అమ్ముతున్న భాను శ్రీ.. ఐదే చుక్కలతో మసాజ్ అట!

గ్లామర్ ఫీల్డ్‌లో ఉండాలే కాని క్యాష్ చేసుకునేందుకు కాదేదీ అనర్హం అంటోంది బిగ్ బాస్ భామ భాను శ్రీ. ఒకవైపు టీవీ కార్యక్రమాలు, సినిమాలు చేస్తూనే మార్కెట్ రంగంలోనూ తన మార్క్ చూపిస్తుంది. తాజాగా మార్కెట్‌లోకి ఓ ఆయిల్ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేస్తూ తన సౌందర్యానికి ఇదే కారణం అంటూ ఓ వీడియో వదిలింది భాను శ్రీ.

Samayam Telugu 14 Dec 2019, 2:32 pm
గ్లామర్ ఫీల్డ్‌లో ఉండాలే కాని క్యాష్ చేసుకునేందుకు కాదేదీ అనర్హం అంటోంది బిగ్ బాస్ భామ భాను శ్రీ. ఒకవైపు టీవీ కార్యక్రమాలు, సినిమాలు చేస్తూనే మార్కెట్ రంగంలోనూ తన మార్క్ చూపిస్తుంది. తాజాగా మార్కెట్‌లోకి ఓ ఆయిల్ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేస్తూ తన సౌందర్యానికి ఇదే కారణం అంటూ ఓ వీడియో వదిలింది భాను శ్రీ.
Samayam Telugu bigg boss fame bhanu sri says my beauty secret is balu herbals face glowing oil
ఆన్ లైన్‌లో ఆయిల్ అమ్ముతున్న భాను శ్రీ.. ఐదే చుక్కలతో మసాజ్ అట!


నా గ్లామర్ సీక్రెట్ ఇదే.. ఐదే చుక్కలతో మసాజ్

నాజూకు నడుము అందాలతో కుర్రకారుకి మత్తెక్కించే భాను శ్రీ.. తన గ్లామర్ సీక్రెట్ ఇదే.. మీరు ఓ ఐదు చుక్కలు వేసుకుని మసాజ్ చేసుకున్నారంటే దెబ్బకి నాలా అయిపోవచ్చు అంటూ ఓ ఆయిల్ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేస్తూ వీడియో వదిలింది.

బాలు హెర్బల్ కుంకుమాది ఫేస్ గ్లోయింగ్ ఆయిల్

ఈ వీడియోలో భాను శ్రీ మాట్లాడుతూ..ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలు స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి ప్రస్తావిస్తూ.. మీ ఫేస్‌కి ఏం వాడుతున్నారక్కా అని నన్ను అడుగుతున్నారు. వాళ్లందరి కోసం నా దగ్గర మంచి ఆయిల్ ఉంది. బాలు హెర్బల్ కుంకుమాది ఫేస్ గ్లోయింగ్ ఆయిల్. ఈ ఆయిల్‌ను నేను లాస్ట్ వన్ మంత్ నుండి వాడుతున్నాను. నా స్కిన్ అయితే చాలా చాలా బాగుంది.

ఇది ఎవరు వాడాలి? ఎలా వాడాలంటే..!

ఆ ఆయిల్‌ ఐదు డ్రాప్స్ తీసుకుని ఫేస్‌కి పూసుకుని మాసాజ్ చేసుకోవాలి. ఒకవేళ డ్రై స్కిన్ వాళ్లైతే ఓవర్ నైట్ అలాగే పడుకోవచ్చు. ఆయిల్ స్కిన్ వాళ్లైతే ఓ రెండు గంటలైన తరువాత ఫేస్ వాష్ చేసుకోవచ్చు.

ఆడ, మగ ఎవరైనా వాడొచ్చు.. ఎక్కడ దొరుకుతుందంటే!!

ఇది డ్రై, ఆయిల్ స్కిన్ వాళ్లు మాత్రమే కాదు.. ఎవరైనా వాడొచ్చు. అలాగే పురుషులు కూడా ఈ ఆయిల్ వాడొచ్చు. హైదరాబాద్‌లో ఈ ఆయిల్‌ని సేల్ చేయడానికి 17 పైగా స్టోర్స్ ఉన్నాయి. ఎక్కడకు వెళ్లినా ఇది దొరుకుతుంది. అలాగే బాలు హెర్బల్ వెబ్ సైట్‌కి వెళ్లి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.

దెబ్బకి మొటిమలు మాయం.. ఫేస్ వెలిగిపోతుందట..

ఈ ఆయిల్‌ని అప్లై చేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. ముఖంపై ఉన్న మొటిమలతో పాటు బ్లాక్ అండ్ వైట్ మచ్చలు కూడా తొలిగిపోయాయి. అందరికీ అందుబాటు ధరలో ఈ ఆయిల్ ఉంటుంది’ అంటూ ఇన్ స్టార్ గ్రామ్‌లో ఓ వీడియోను విడుదల చేస్తూ.. ఆన్ లైన్‌లో ఆయిల్ అమ్మకాలను మొదలుపెట్టింది భాను శ్రీ.

నాజూకు నడుము సుందరిగా.. తమన్నాకు డూప్

డాన్సర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భాను శ్రీ.. ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’, ‘ఇద్దరి మధ్యలో 18’, ‘కుమారి 21F’ వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తరువాత ‘బాహుబలి 2’ చిత్రంలో తమన్నాకు కొన్ని సీన్లలో డూప్‌గా నటించి సన్నని శరీరాకృతితో అందాల అవంతికలా మాయ చేసింది భానుశ్రీ. అయితే ఇది తెరవెనుక జరిగిన ముచ్చట కాబట్టి బాహుబలిలో నటించాను అన్న పేరు తప్పితే.. ఆమెను ఏవిధంగాను సహాయపడలేకపోయింది. అయితే నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 2లో ఎంట్రీ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ వెండి తెర నటి.

బిగ్ బాస్ సీజన్ 2తో ఫుల్ క్రేజ్..

చిన్నా చితకా సినిమాల్లో నటిస్తూ బిగ్ బాస్‌ సీజన్ 2లో అవకాశం దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. హౌస్‌లో ఉన్న కొన్ని రోజులు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా కౌశల్ తనను తాకరాని చోట తాకాడంటూ ఆమె చేసిన రచ్చతో బాగా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ఆమె హస్కీ గొంతుకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. వంద మందిలో ఉన్నా ఆమె గొంతు వినిపిస్తే.. అది భాను శ్రీ గొంతే అని ఇట్టే గుర్తుపట్టేయొచ్చు.

Youtube-Yedu Chepala కథా Original ట్రైలర్ | Yedu Chepala కథా తాజా ట్రైలర్

ఏడు చేపల కథ.. బూతు సినిమాలో

ఇటీవల ఈ నాజూకు పోరి ‘ఏడు చేపల కథ’ అనే బూతు చిత్రంలో మెరిసి సర్‌ప్రైజ్ చేసింది. ఇటీవల విడుదలైన ‘ఏడు చేపల కథ’ చిత్రం కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లను రాబట్టింది కాని భాను శ్రీకి కెరియర్ పరంగా ఉపయోగపడలేకపోయింది.

భాను శ్రీ తదుపరి చిత్రాలు..

ఏడు చేపల కథ చిత్రం తరువాత ‘EMI’ అనే చిత్రంలో నటిస్తోంది భాను శ్రీ. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి లొకేషన్ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్‌లో విడుదల చేసింది భాను శ్రీ. తన నాజూకు నడుము అందాలను ఒయ్యారంగా చూపిస్తూ.. ‘నేను మీకు నచ్చకపోయినా పర్లేదులే.. ఎందుకంటే అందరికీ మంచి టేస్ట్ ఉండదు కదా’ అంటూ తన హాట్ వీడియోకు సెటై‌ర్‌కు కూడా జతచేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.