Jr Ntr: నాగ్ వద్దు ఎన్టీఆర్ కావాలంటున్న బిగ్ బాస్ ఫ్యాన్స్.. లాక్ డౌన్లో బోరు కొట్టకుండా..
‘బిగ్ బాస్..!’ ఈ మాట వింటే చాలు.. ‘మళ్లీ ఏంటా రచ్చా’ అనేవాళ్లు ఉన్నారు? ‘అబ్బా సూపర్! మళ్లీ రచ్చా?’ అంటూ విషయం తెలుసుకోవడానికి ఎగబడే వాళ్లు ఉన్నారు. తెలుగు బిగ్ బాస్ పేరుకి మూడు సీజన్లే పూర్తి చేసుకున్నా.. విమర్శకులు, విశ్లేషకుల నోళ్లలో బాగా నలిగిపోయింది. అయితే ఈ కరోనా టైమ్‌లో కూడా ఏంటీ బిగ్ బాస్ రచ్చ అనుకుంటున్నారా? ఇళ్లు కదిలితే.. కాళ్లు ఇరగ్గొడతాం అంటున్నారు పోలీసులు. వాళ్ల కన్నగప్పి బయటికి వస్తే.. ‘ఆ చావు దెబ్బలు తప్పించుకున్నా చావు తప్పదు’ అంటోంది కరోనా. కనీసం ఇంట్లో కూర్చుని టీవీ చూద్దాం అనుకుంటే.. చూసిన సినిమాలే చూడాలంటే బోర్ కొడుతుంది. అందుకే స్టార్ మా బఫర్ ఆఫర్ ఇస్తోంది. ‘బిగ్ బాస్ సీజన్ 3’ని రీవిజిట్ వేస్తోంది. అయితే నాగ్ వద్దు.. ఎన్టీఆర్ కావాలంటున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్. ఈ కరోనా టైమ్‌లో ఆ రచ్చేంటో? అసలు ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం!
Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu24 Feb 2022, 6:09 pm

ఎన్టీఆర్ క్లిక్ అయినట్లుగా..?
బిగ్ బాస్ హోస్ట్ అంటే అది అంత ఆషామాషీ వ్యవహారం ఏం కాదని..యాక్షన్, కట్ అనగానే లిప్ సింక్ చేసినట్టుగా కాకుండా సమయస్పూర్తి, వాక్ఛాతుర్యం వంటివి హోస్ట్‌కి చాలా ముఖ్యమని.. జనాలు ఆ విషయం బాగా గమనిస్తుంటారని... బిగ్ బాస్ మూడు సీజన్‌ల్లో బయటపడింది. అలా చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 1కి హోస్ట్‌గా ఉన్న ఎన్టీఆర్ క్లిక్ అయినట్లుగా.. తర్వాత వచ్చిన బిగ్ బాస్ 2, బిగ్ బాస్ 3 సీజన్స్‌కి హోస్ట్‌గా ఉన్న నానీ, నాగార్జునలు అంతగా క్లిక్ కాలేదు అనేది చాలా మంది మాట.
ఆ విషయంలో ఎన్టీఆర్రే కింగ్..
బిగ్ బాస్ 1కి ఎన్టీఆర్ హోస్ట్ అన్నప్పుడు కూడా చాలా మంది పెదవి విరిచారు. ఆయన వల్ల అవుతుందా? అన్నారు. అయితే.. ఆయన బిగ్ బాస్ 1కి హోస్ట్‌గా వ్యవహరించడంతో బుల్లితెర చరిత్రలోనే గతంలో ఎన్నడూ ఊహించని రేటింగ్స్ వచ్చింది. 70 రోజుల పాటు 14 మంది సెలబ్రిటీలతో జరిగిన ఆ షో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ సీజన్ 1 విజేతగా శివబాలాజీ నిలిచారు. అయితే అప్పటి కంటెస్టెంట్స్‌లో కూడా అంత కాంట్రవర్షియల్, రచ్చ చేసేవాళ్లు ఎవరూ లేదరనేది బిగ్ బాస్ ఫాలోవర్స్ అభిప్రాయం.
మధ్యాహ్నం 3 గంటలకు ‘బిగ్ బాస్ 3’ ..
కరోనా దెబ్బకు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. చెయ్యడానికి ఏ పని లేక.. సెలబ్రెటీసే.. ఎవరి వంట వాళ్లు చేసుకుంటూ.. ఎవరి అంట్లు వాళ్లు తోముకుంటూ వీడియోలు ఫోస్ చేసుకుంటున్న సమయమిది. ఇక ఏ పని లేకుండా ఇంటిపట్టునే ఉండే వాళ్లకి బోరుకొట్టకుండా ఉంటుందా? అందుకే ‘స్టార్ మా’ బంపర్ ఆఫర్ ఇచ్చింది. నాగార్జునా హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3ని రీ విజిట్ వేస్తోంది. 21 రోజుల లాక్ డౌన్ కారణంగా.. బోర్ కొట్టకుండా ఉంచే ఈ షో మీకోసం అంటోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ షో ప్రసారం కాబోతుంది.
సీజన్ 3 వద్దు.. సీజన్ 1 ముద్దు!
అయితే.. ఫేస్బుక్లో ‘ఈ షో రీ విజిట్.. మీ కోసం’ అంటూ.. ‘స్టార్ మా’ ఫోస్ట్ చెయ్యగానే.. బిగ్ బాస్ అభిమానులు వరుసగా.. సీజన్ 3 వద్దు.. సీజన్ 1 కావాలి, బిగ్ బాస్ సీజన్ వన్‌లో చాలా ఫన్, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. దాన్నే ప్లే చెయ్యండి.. ప్లీజ్, ప్లీజ్.. అంటూ చాలా మంది రిక్వస్ట్లు పెడుతున్నారు. అంతే కాదు సీజన్ త్రీ తప్ప.. మరేదైనా వేసుకోండి అనేవాళ్లు ఉన్నారు. దీని బట్టే అర్థం అవుతుంది.. సీన్ వన్‌లో షోకి, ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్ ఏంటో..!
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.