యాప్నగరం

Brahmamudi: సగం మంది హీరోలు నా కొడుకులే.. సంపాదన అంతా దానికే: 'బ్రహ్మముడి' అపర్ణ

'బ్రహ్మముడి' సీరియల్‌లో హీరో రాజ్ తల్లి అపర్ణ క్యారెక్టర్‌లో అద్భుతంగా నటిస్తున్నారు శ్రీప్రియ. ఎమోషనల్ సీన్లలో ఆమె యాక్టింగ్‌కు ఆడియన్స్ మంచి మార్కులు వేస్తున్నారు. మరి తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విశేషాలు చూద్దామా?

Authored byఆర్ కే మురళీ కృష్ణ | Samayam Telugu 13 Apr 2023, 4:19 pm
'బ్రహ్మముడి', 'వైదేహి పరిణయం' సీరియల్ ప్రేక్షకులకు శ్రీప్రియ గురించి పరిచయం చేయక్కర్లేదు. ముఖ్యంగా కొత్త సీరియల్ బ్రహ్మముడిలో హీరో రాజ్ (మానస్)కు తల్లిగా ఆమె కనబరుస్తున్న నటన అద్భుతం. ఇష్టం లేని కోడలు కావ్యను నానా మాటలు అంటూ, ఇబ్బంది పెట్టే అత్త పాత్రను శ్రీప్రియ బాగా ఎంగేజ్ చేస్తున్నారు. మరోవైపు కొడుకుపై ప్రేమను చూపిస్తూ, కోడలిపై సైకోలా ప్రవర్తించే ఒకే క్యారెక్టర్‌ను ఆమె బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇక తాజాగా ఇంటర్వ్యూలో తన కెరీర్, ఫ్యామిలీ, సీరియల్స్ గురించి ఆమె బోలెడు విశేషాలను పంచుకున్నారు.
Samayam Telugu Brahmamudi
Brahmamudi: 'బ్రహ్మముడి' అపర్ణ


సగం మంది నా కొడుకులే

సీరియల్స్‌లో తల్లి క్యారెక్టర్‌లకు శ్రీప్రియ కేరాఫ్ అడ్రస్‌లా మారిపోయినట్లున్నారనే ప్రశ్నకు నవ్వుతూ సమాధానమిచ్చారు.

"'మొగలిరేకులు' సీరియల్ నుంచి తల్లి క్యారెక్టర్‌లు చేస్తున్నాను. అందులో దేవి క్యారెక్టర్‌కు తల్లి అయిన రజిని పాత్రలో నటించాను. ఓవరాల్‌గా ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అయిపోయింది. ప్రస్తుతం వైదేహి పరిణయం, బ్రహ్మముడి.. సీరియల్స్ చేస్తున్నాను. టీవీ ఇండస్ట్రీలో ఉన్న సగం మంది కూతుళ్లకు నేనే తల్లిని. ఇక కొడుకుల విషయానికి వస్తే చాలా మంది సీరియల్ హీరోలకు నేను తల్లిగా చేశాను. ఏదైనా ఈవెంట్‌కు వెళితే అందరూ "హాయ్ అమ్మ.." అని పిలుస్తూనే ఉంటారు. నిజానికి నాకు ఇద్దరూ ఆడపిల్లలు. నాకు బాబులు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈ విధంగా నాకు దేవుడు కొడుకులను ఇచ్చాడని హ్యాపీ ఫీలవుతాను. కొడుకు లేడనే బాధ ఇలా తీరిపోయింది."
- శ్రీప్రియ
View this post on Instagram A post shared by Sripriya Shreekhar (@sripriya_shreekhar)
Janaki Kalaganaledu: 'జానకి కలగనలేదు' హీరోయిన్ కిస్సింగ్ సీన్.. హమ్మయ్య క్లారిటీ ఇచ్చేసింది!
500 ఎపిసోడ్స్ దాటింది

ఇక ప్రస్తుతం చేస్తున్న వైదేహి పరిణయం సీరియల్ మొదలై దాదాపు రెండేళ్లు గడిచిపోతుంది. ప్రస్తుతం 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది.

"మా సొంతూరు విజయవాడ. మా ఆయన డైరెక్టర్ శ్రీకర్. చాలా సీరియల్స్, కొన్ని సినిమాలు కూడా చేశారు. 'సంధ్యా రాగం' సీరియల్‌లో హీరోయిన్‌గా నా కెరీర్ స్టార్ట్ అయింది. తర్వాత పాప పుట్టిన తర్వాత కెరీర్‌లో గ్యాప్ వచ్చింది. మళ్లీ 'మొగలిరేకలు' సీరియల్‌తో రీఎంట్రీ ఇచ్చాను. మొగలిరేకులు సీరియల్‌లో చేసిన 99 శాతం మందికి మంచి లైఫ్ వచ్చింది. ఇప్పటికీ చాలా మంది నన్ను 'రజిని' అని పిలుస్తారు."
- శ్రీప్రియ
Siddharth: 'సరిగమప' షోలో హీరో సిద్ధార్థ్.. ఆ అల్లరి, ఎనర్జీ అంతా సేమ్ టూ సేమ్!
గది మొత్తం చీరలే

మరి మేకప్, కాస్ట్యూమ్స్ సంగతేంటి అని అడిగితే చాలా డిటైల్‌గా సమాధానమిచ్చారు శ్రీప్రియ.

"ఓ గది మొత్తం నా చీరలే ఉంటాయి. రిచ్ క్యారెక్టర్‌లు అనేసరికి చీరలు, నగలకే ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ఒక సీరియల్ కాస్ట్యూమ్ ఇంకో సీరియల్‌కు వాడటానికి లేదు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా షాపింగ్ చేస్తూనే ఉంటాను. సీరియల్ షూటింగ్ కోసం ఉదయం 8 గంటలకు ఇక్కడికి వచ్చేస్తాం. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్ షీట్. ఇంటికెళ్లేటప్పటికీ రాత్రి 11 అవుతుంది. తినేసి పడుకునే సరికి 12 అవుతుంది."
- శ్రీప్రియ
View this post on Instagram A post shared by 𝑲𝒉𝒂𝒏_𝑴𝒆𝒉𝒓𝒂𝒋 (@khan_mehraj)

సినిమా ఛాన్స్‌లు

"నేను ఇంతకుముందు కొన్ని సినిమాలు చేశాను. ఇప్పుడు కూడా చాలా ఆఫర్లు వస్తున్నాయి.. కానీ నాకు వారంలో రెండు రోజులే గ్యాప్ వస్తుంది. అందుకే సినిమాలకు 10- 15 రోజులు డేట్స్ ఇవ్వడానికి అవ్వడం లేదు. కనీసం రెస్ట్ తీసుకోవడానికి కూడా అవ్వడం లేదు. నిజానికి సీరియల్స్‌లో యాక్ట్ చేయడం కష్టం. ఎందుకంటే మన చుట్టూ వందమంది ఉంటారు.. వాళ్లను మర్చిపోయి మన ఎమోషన్లు పండించాల్సి ఉంటుంది. నేను అమ్మ క్యారెక్టర్లు ఎక్కువ చేశాను. అయితే టైటిల్ రోల్స్ ఎప్పుడూ చేయలేదు. నా పేరు మీద సీరియల్ రాలేదు.. అది చేయాలని నా కోరిక. బ్రహ్మముడిలో చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్.. అందరినీ నేనే లీడ్ చేస్తుంటాను. కానీ టైటిల్ రోల్ చేయడం ఇష్టం."
- శ్రీప్రియ
View this post on Instagram A post shared by Sripriya Shreekhar (@sripriya_shreekhar)
రచయిత గురించి
ఆర్ కే మురళీ కృష్ణ
ఆర్‌కే మురళీ కృష్ణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.