యాప్నగరం

Naga Babu: జబర్దస్త్ క్లోజ్ కాదు.. నాగబాబుతో కలిసి మేం బయటకు వెళ్లడానికి కారణం అదే: చమ్మక్ చంద్ర

Chammak Chandra: ఎట్టకేలకు జబర్దస్త్‌కు స్వస్తి చెప్పారు నాగబాబు. ఏడేళ్ల పాటు జబర్దస్త్ కామెడీ షోకి జడ్జ్‌గా వ్యవహరించిన నాగబాబు.. అక్కడ నుండి జీ తెలుగు ఛానల్‌కి జంప్ చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ అసలు విషయాన్ని చెప్పారు చమ్మక్ చంద్ర.

Samayam Telugu 20 Nov 2019, 9:28 pm
జబర్దస్త్ డైరెక్టర్లు నితిన్, భరత్‌లకు మల్లెమాల ప్రొడక్షన్స్‌తో విభేదాలు రావడంతో జబర్దస్త్ షో నుండి జీ తెలుగుకు జంప్ అయ్యారని.. వీరితో పాటు జబర్దస్త్ మెయిన్ వికెట్స్ జడ్జ్ నాగబాబు, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర బయటకు వచ్చేశారని గత కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది. అయితే ఇది ప్రచారం కాదని వాస్తవమే అంటూ క్లారిటీ ఇచ్చారు జబర్దస్త్ కమెడియన్స్ చమ్మక్ చంద్ర.
Samayam Telugu Nagababu Jabardasth
నాగబాబు


ఈ ఇష్యూపై ఆయన మాట్లాడుతూ.. ‘జబర్దస్త్ కామెడీ షో నుండి ఎవరు వెళ్లినా షో ఆగదు. జడ్జ్ నాగబాబు జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చిన మాట వాస్తవమే. ఆయనతో పాటు మేం కూడా బయటకు వచ్చేశాం. మళ్లీ వెళ్లొచ్చేమో చెప్పలేం. జబర్దస్త్ అనేది మాకు లైఫ్ ఇచ్చింది. అది ఎవగ్రీన్ దాని నుండి క్విట్ అయ్యే ప్రసక్తే లేదు.. చిన్న బ్రేక్ ఇచ్చాం అంతే. కాని దాన్ని వదలడం బాధగానే ఉంది కాని.. సార్ (నాగబాబు) బయటకు వచ్చారు.. రెండు మూడు నెలలు గ్యాప్ తీసుకుందాం అని చిన్న ఆలోచన మాత్రమే.

జబర్దస్త్‌లో స్కిట్ చేయడం కంటే రాయడం బాగా ప్రెజర్‌గా ఉంది అందుకే బయటకు వచ్చాం. నాగబాబు, మేం చాలా ఫ్రెండ్లీగా జబర్దస్త్ టీంతో చెప్పేసి బయటకు వచ్చాం. ఎలాంటి గొడవలు జరగలేదు. బయట చాలా పుకార్లు నడుస్తున్నాయి. వాటిలో నిజం లేదు. నాగబాబు స్థానంలో జడ్జ్‌గా అలీగారు వెళ్లారు. అడ్జెస్ట్‌మెంట్ కోసం.. మళ్లీ నాగబాబు గారు జబర్దస్త్ షోకి వెళ్లొచ్చు’ అంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు చమ్మక్ చంద్ర.

మొత్తంగా జబర్దస్త్ కమెడియన్స్‌, జడ్జ్ నాగబాబులతో పాటు దర్శకులు నితిన్, భరత్‌లు జీ తెలుగుకి జంప్ చేయడంతో బుల్లితెర వార్ ఆసక్తికరంగా మారింది. త్వరలో ఈ జంపింగ్ జపాంగ్‌లతో జీ తెలుగు ‘గ్యాంగ్‌ స్టార్స్‌’ అనే కామెడీ షోను ప్రసారం చేయనుంది. ఈ షోకి జడ్జ్‌గా నాగబాబు వ్యవహరిస్తుండగా.. యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆదిలు హోస్ట్ చేయబోతున్నారు. అయితే యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ నుండి జంప్ చేసినట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.