యాప్నగరం

Karthika Deepam Serial ట్విస్ట్: మోనిత ప్లాన్ రివీల్.. ‘ఈ 25న నాకు కార్తీక్‌కి పెళ్లి’ వినేసిన పిల్లలు

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 జూన్ 23)న 1073 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే రేపటి ప్రోమోలో అదిరిపోయే ట్విస్ట్ ఉంది. karthika deepam serial latest promo హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 24 Jun 2021, 6:29 pm
Samayam Telugu ‘కార్తీకదీపం’ ట్విస్ట్(photo courtesy by star మా and disney+ hotstar)
karthika deepam serial promo
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 జూన్ 23)న 1073 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే నేటి ఎపిసోడ్‌లో కార్తీక్ దీప ముందు ఓపెన్ అవుతాడు. జరిగిందంతా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. దాంతో నేటి కథనం చాలా ఆసక్తిగా మారింది. దీపకు ఓ ఆధారం దొరికినట్లైంది. ఆ హైలైట్స్ మిస్ అయ్యి ఉంటే.. ఈ కింద లింక్ క్లిక్ చేయండి..
Karthika Deepam జూన్ 23 ఎపిసోడ్: మోనితని ఓ ఆట ఆడించనున్న వంటలక్క! ఇక పగ్గాలు దీప చేతికే..
ప్రోమో హైలైట్స్.. karthika deepam latest promo
కార్తీక్, దీప కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ‘జరిగిన దానికి నాకు ఏమిటి సంబంధం..?’ అంటుంది దీప కోపంగా కార్తీక్‌తో.. ‘నీకు నాకు భార్యభర్తల సంబంధం ఉంది కాబట్టి..’ అంటాడు కార్తీక్ బాధగా. ‘మరి ఆ సంబంధానికి(మోనితతో రిలేషన్) ఏ పేరు పెడతారు?’ అంటుంది దీప కోపంగా. ‘ఎన్నో ఏళ్లు నేను మారతాననే నమ్మకంతో ఉన్నావ్.. ఇప్పుడు నా మీద అదే నమ్మకంతో ఉండు.. నన్ను తిట్టు.. ఇంకా కసి తీరకపోతే నా చెంప పగలగొట్టు..’ అనేసరికి దీప షాాక్ అవుతుంది. కాస్త కరిగినట్లే కనిపిస్తోంది.

సీన్ కట్ చేస్తే.. సౌందర్య, శ్రావ్య ముందు ఉన్న మోనిత.. ‘గుర్తు పెట్టుకోండి ఆంటీ.. ఈ 25వ తారీఖున మీ కొడుక్కి నాకు పెళ్లి..’ అంటుంది. సరిగ్గా అప్పుడే గుమ్మం దాకా వచ్చిన పిల్లలు ఆ మాటలు విని షాక్ అవుతారు. సౌందర్య కోపంగా షాకింగ్‌గా మోనితని చూస్తుంటే.. మోనిత మాత్రం సౌందర్య కాళ్ల మీద పడి.. ‘నన్ను ఆశీర్వదించండి అత్తయ్యా గారు..’ అంటుంది. ఆ సీన్‌తో పిల్లలు మరింత షాక్ అవుతారు. ఒకరిని ఒకరు చూసుకుంటూ షాక్‌లో ఉంటారు. అయితే నేటి ఎపిసోడ్‌లో దీప నిజాల వేటలో పడిన కారణంగా సీన్ మోనిత పెళ్లి దాకా రాదు అనిపిస్తోంది. చూడాలి ఏం జరగనుందో.

అయితే పదిరోజులు టైమ్ అంది.. చెయ్యబోయే స్కెచ్ మొత్తం ప్రియమణికి చెప్పింది. రోజులు గడుస్తున్న క్రమంలో మోనిత పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసేసింది. దాంతో కథనం చాలా ఉత్కంఠగా మారింది. ఇక ఇన్నాళ్లు ప్రతీదీ పిల్లలకు తెలియకుండా జాగ్రత్తపడుతూ వచ్చారంతా. మరి ఇప్పుడు పిల్లలకు కార్తీక్ మోనిత పెళ్లి విషయం తెలిస్తే.. ఎలా కవర్ చేస్తారు? ఎలా సద్దిచెబుతారు? అనేది కూడా ఆసక్తిగా మారింది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.