యాప్నగరం

Karthika Deepam Serial ట్విస్ట్: సౌర్యలో సంఘర్షణ.. ప్రేమని పరీక్షించే ప్రయత్నంలో ‘మీ అమ్మలాగే నీకు కాస్త తిక్క ఉన్నట్టుంది’ డాక్టర్ బాబు సెటైర్

నేటి ఎపిసోడ్‌లో కంటతడి పెట్టించే ఎమోషనల్ సీన్‌తో పాటు రేపటి ట్విస్ట్‌లో.. దీప ఇల్లు వదిలే ప్రయత్నం చెయ్యడంతో కథ ఉత్కంఠగా మారింది. ఓ వైపు సౌర్య మనసులో సంఘర్షణ, మరోవైపు దీప ప్రయత్నం రేపటి ఎపిసోడ్‌ని ఆసక్తిగా మార్చేశాయి.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 9 Apr 2021, 8:48 am
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 ఏప్రిల్ 9)న 1009 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే రేపటి ప్రోమోలో అదిరిపోయే ట్విస్ట్ ఉంది. నేటి ఎపిసోడ్ మిస్ అయ్యి ఉంటే.. ఈ కింద లింక్ క్లిక్ చెయ్యండి.
Samayam Telugu ‘కార్తీకదీపం’ ట్విస్ట్(photo courtesy by star మా and disney+ hotstar)
karthika deepam telugu serial promo

Karthika Deepam ఏప్రిల్ 9 ఎపిసోడ్: సూపర్ హిట్ సీన్స్.. ఇందుకే కదూ కార్తీకదీపం నంబర్ 1 అయ్యింది..
ప్రోమో హైలైట్స్..
సౌర్య మేడపైనుంచి చూస్తూ.. ‘నాన్న వస్తే నేను డాక్టర్ బాబు అని పిలుస్తాను.. అలాగే పిలువు బాగుంది అని అంటే..నా మీద ప్రేమ లేనట్టే..’ అని ఓ టెస్ట్ పెట్టుకుంటుంది. సరిగ్గా అప్పుడే కార్తీక్ కారు వచ్చి ఆగడంతో.. కారుని చూసి సౌర్య కిందకి పరుగున వెళ్లి.. ‘పొద్దున్నే ఎక్కడికి వెళ్లారు డాక్టర్ బాబు..?’ అంటుంది. కార్తీక్ అయోమయంగా చూస్తూ.. ‘ఏంటే రౌడీ కొత్తగా మాట్లాడుతున్నావ్? మీ అమ్మలాగే నీకు కాస్త తిక్క ఉన్నట్టుంది..’ అంటాడు కాస్త కఠినంగా.

సీన్ కట్ చేస్తే.. దీప మెట్లు దిగుతూ బాధగా ఆవేదనగా.. ‘భగవంతుడా? ఏంటీ నాకీ పరీక్ష..?’ అనుకుంటూనే మెట్లపై కూలబడుతుంది. ‘పిల్లల భవిష్యత్ కోసం నా ఆత్మగౌరవం చంపుకోవాలా? నా మీద ప్రేమే లేదంటుంటే.. ఎందుకు ఉండాలి?’ అంటూ ఆవేశంగా అక్కడ నుంచి పైకి లేస్తుంది. మరి దీప ఉంటుందా? వెళ్లిపోతుందా? ఎవరైనా ఆపుతారా? అనేది ఉత్కంఠగా మారింది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.