యాప్నగరం

Director Ajay Koundinya ‘సన్నీ బట్టలిప్పేసిన పోర్న్‌స్టార్.. పవన్ బట్టలేసుకున్న పవర్ స్టార్’.. మందేసి డైరెక్టర్ వాగుడు

Sunny Leone: అరాచకానికి పరాకాష్ట అంటే ఈ ఇంటర్వ్యూ అనే చెప్పాలి. ఇంటర్వ్యూ చేసేశాడు.. ఆ ఇంటర్వ్యూకి వచ్చినవాడు కూడా మందేస్తూ తాగుబోతు ముచ్చట్లు పెట్టారు. వీరిద్దరీ మందు, సెక్స్, కండోమ్స్ గురించి మాట్లాడుకోవడమే కాకుండా.. ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరో హీరోయిన్లపై హాట్ కామెంట్ చేశారు. నాటి స్టార్ హీరోయిన్‌ రమ్యక్రిష్ణపైనే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను సన్ని లియోనితో పోల్చుతూ దారుణమైన కామెంట్ చేశారు. ఇంతకీ ఆ తాగుబోతు బ్యాచ్ ఎవరంటే బూతు బంగ్లా దర్శకుడు అజయ్ కౌండిన్య.

Samayam Telugu 26 Nov 2019, 3:48 pm
Sunny Leone: అరాచకానికి పరాకాష్ట అంటే ఈ ఇంటర్వ్యూ అనే చెప్పాలి. ఇంటర్వ్యూ చేసేశాడు.. ఆ ఇంటర్వ్యూకి వచ్చినవాడు కూడా మందేస్తూ తాగుబోతు ముచ్చట్లు పెట్టారు. వీరిద్దరీ మందు, సెక్స్, కండోమ్స్ గురించి మాట్లాడుకోవడమే కాకుండా.. ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరో హీరోయిన్లపై హాట్ కామెంట్ చేశారు. నాటి స్టార్ హీరోయిన్‌ రమ్యక్రిష్ణపైనే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను సన్ని లియోనితో పోల్చుతూ దారుణమైన కామెంట్ చేశారు. ఇంతకీ ఆ తాగుబోతు బ్యాచ్ ఎవరంటే బూతు బంగ్లా దర్శకుడు అజయ్ కౌండిన్య.
Samayam Telugu director ajay kaundinya controversy comments on pawan kalyan
Director Ajay Koundinya ‘సన్నీ బట్టలిప్పేసిన పోర్న్‌స్టార్.. పవన్ బట్టలేసుకున్న పవర్ స్టార్’.. మందేసి డైరెక్టర్ వాగుడు


ఎవరీ అజయ్ కౌండిన్య..

గతంలో బూతు బంగ్లా అనే సినిమాకు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నీచమైన కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ అయ్యాడు. అప్పట్లో సీరియల్ హీరోయిన్ రోజాపై నోరు పారేసుకున్నాడు.

రోజాతో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ పార్ట్ 2 తీస్తానంటూ సంచలన ప్రకటన

రామ్ గోపాల్ వర్మ విదేశీ ఆర్టిస్ట్‌లను పెట్టి గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ సినిమా తీశారని.. ఆమెకు బదులుగా రోజాని పెట్టి తీసుంటే సూపర్ ఉండేదని.. రోజా ఒప్పుకుంటే గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ పార్ట్ 2 తీస్తా అంటూ అప్పట్లో అసందర్భ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మంత్రి తలసానిని ఆయనకు ఒక సినిమాకి ఎన్ని కెమెరాలు వాడతారు, ఎన్ని ఫ్రేమ్ లు ఉంటాయో తెలియవని.. అలాంటి పాగల్ వ్యక్తిని సినిమాటోగ్రఫీ శాఖకు మంత్రిగా చేశారంటూ అప్పట్లో హాట్ కామెంట్స్ చేసి వార్తల్లోకి వచ్చారు.

బీఎస్ టాక్ షోలో మందేస్తూ ఇంటర్వ్యూ..

శ్రీరెడ్డి, గాయత్రి గుప్త, తమన్నా లాంటి కాంట్రవర్శి నటీనటులతో ఇంటర్వ్యూలు చేసే యూట్యూబ్ యాంకర్ బీఎస్.. తాజాగా ఈ వివాదాస్పద దర్శకుడు అజయ్ కౌండిన్యతో ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ఇద్దరూ మందేస్తూ ముచ్చటించుకోవడం విశేషం. తాజాగా ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

మందుపై ప్రమాణం చేయిస్తూ రచ్చ రచ్చ

దర్శకుడు అజయ్ కౌండిన్య మందు గ్లాస్ ఇచ్చి.. అదే మందు గ్లాస్‌పై ప్రమాణం చేసి నిజాలు రాబట్టే ప్రయత్నం చేశారు యాంకర్. అసలే కోతి ఆపై కల్లు తాగింది అన్న రేంజ్‌లో వివాదాస్పద దర్శకుడు పూటుగా తాగేసరికి మనిషితో పాటు మాట తూలుతూ నోటికొచ్చినట్టు మాట్లాడేశాడు.

నన్ను వేస్ట్ ఫెలో అయితే అలా పిలిచేవాళ్లు నాకన్నా వేస్ట్ ఫెలోస్. నేను ఇండస్ట్రీకి F*** చేయడానికి వచ్చా. నేను ఎవర్నైనా F*** చేస్తా అది నా హాబీ అంటూ నోటి కొచ్చినట్టు మాట్లాడేశాడు ఈ దర్శకుడు.

రమ్యక్రిష్ణ అంటే నాకు మోజు..

రమ్యక్రిష్ణ.. రమ్యక్రిష్ణ అంటూ ఉన్నావ్.. ఆమెలో నీకు ఏం నచ్చిందని యాంకర్ అడగ్గా.. ఆమె అంటే నాకు మోజు. మహా పిచ్చి. ఆవిడను పెళ్లి చేసుకున్న క్రిష్ణవంశీ అంటే నాకు నచ్చదు అంటున్నాడు ఈ తాగుబోతు దర్శకుడు.

నాకు అమ్మాయిల పిచ్చే కాదు.. ఆంటీల పిచ్చీ
ఇంత పచ్చిగా మాట్లాడుతున్నావ్.. నీకు అమ్మాయిల పిచ్చా అని యాంకర్ అడగ్గా.. అమ్మాయిల పిచ్చే కాదు.. ఆంటీల పిచ్చి కూడా ఉంది. మీకు ఏమైనా అభ్యంతరమా? అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు.

పవర్ స్టార్‌ని పోర్న్ స్టార్‌తో పోల్చుతూ దారుణమైన కామెంట్స్

ఒకవేళ అమ్మాయిలా పుట్టాలనుకుంటే ఎవరిలా పుడతావు? అని యాంకర్ అడగ్గా.. సన్నీ లియోనిలా పుడతా అన్నాడు ఈ దర్శకుడు. ఎందుకూ అంటే.. ప్రపంచంలో ఉన్న ప్రతి మగవాడు.. అబ్బాయి కావచ్చు, అంకుల్స్ కావచ్చు ఆమె వంకే చూస్తారు. డబ్బు ఉన్న ప్రతి ఒక్కడూ ఆమె కాళ్ల దగ్గరే ఉంటాడు.

సన్నీ లియోనితో పవన్‌కి పెళ్లి చేయాలని ఉంది..

నాకు సోషల్ సర్వీస్ చేయాలని ఉంది. అది ఎలా అంటే పవన్ కళ్యాణ్‌కి సన్నీ లియోనితో పెళ్లి చేయాలని ఉంది. ఆమె బట్టలు విప్పేసిన పోర్న్ స్టార్ అయితే.. ఈయన బట్టలేసుకున్న పవర్ స్టార్. మిగతాదంతా సేమ్ టు సేమ్’ అంటూ దారుణమైన కామెంట్స్ చేశారు.

ఆ హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్‌లో కండోమ్స్..

మీకు వేరే హీరోయిన్‌తో ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి నిజమేనా అంటే.. అవును! ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో కండోమ్స్ దొరికాయి. అవి నాకోసం అనుకోడానికి అవి నేను వాడే బ్రాండ్ కాదు. ఆమె బ్యాగ్‌లో కొత్త బ్రాండ్ ఉంది అంటూ దారుణంగా మాట్లాడాడు.

నా మానసిక స్థితి ఎలా ఉందంటే..

మీ మానసిక స్థితి బాగానే ఉందా? అని యాంకర్ అడగడంతో.. నేను పిచ్చోడ్నని మీరు అంటున్నారా? మెంటల్ వాడినని అనుకుంటున్నారా? మరి అలా అనుకుంటే నాతో ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు? అంటూ ఎదురు ప్రశ్నించాడు.

యాంకర్ దారుణమైన ప్రశ్నలు.. ఎంతమంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశారు?

తాగి తిక్క తిక్క ఆన్సర్‌లు చెప్తున్న దర్శకుడ్ని తాగుతూ మరింత రెచ్చగొట్టేశాడు యాంకర్ బీఎస్. మీరు ఇండస్ట్రీలో ఎంతమంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశారు? సంఖ్య చెప్పగలరా అంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నలేశాడు. దీనికి మరింత రెచ్చిపోయిన దర్శకుడు అజయ్.. అమ్మాయిలతోనే కాదు.. ఆంటీలతోనూ ఎంజాయ్ చేశా అంటూ కుండబద్దలు కొట్టేశాడు.

తెలుగు హీరోయిన్స్‌ని ఎందుకు పెట్టుకోవాలి?

సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ చేయాలన్నా.. రొమాన్స్ సీన్ చేయాలన్నా మేం చేయము అంటారు. బికినీ, లిప్ లాక్, హగ్ ఇలా ఏది చెప్పినా నో అనేస్తారు వీళ్లకు సినిమా ఆఫర్స్ ఎందుకు ఇవ్వాలి’ అంటూ తాగుతూ తూలుతూ నోటికొచ్చినట్టు మాట్లాడారు దర్శకుడు అజయ్ కౌండిన్య.

Youtube-Film Director Ajay Kaundinya Interview PROMO | BS Talk Show | Ramya Krishna | Top Telugu TV

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.