ఎంత పొలిటిషియన్ అయినా తనలోని పాత ఫ్లేవర్‌కి సమయం దొరికినప్పుడల్లా అత్తరు అద్దతూ ఉంటుంది సినీ నటి రోజా. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టేసిన ఈ అందాల నటికి ఇప్పటికీ పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆమె నవ్వుని లవ్ చేయని వాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. రోజా పేరుకి తగ్గట్టే ఆమె నవ్వులు వెల్లువిరిసిన రోజాలే. సరే.. ఇక చాల్లే పొగడ్తలు కాని అసలు విషయానికి రా అంటారా.. వస్తున్నాం.. అక్కడికే వస్తున్నాం. నగరి ఎమ్మెల్యేగా, వైసీపీ పార్టీలో కీలక మహిళా నేతగా, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రోజా... ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే బుల్లితెరపైనా సత్తా చాటుతున్నారు. జబర్దస్త్ షోకి జడ్జిగా సింగిల్ హ్యాండ్‌తో నడిపిస్తున్న రోజా.. ఈటీవీ స్పెషల్ ఈవెంట్స్‌లోనూ తళుక్కున మెరుస్తుంటారు. తాజాగా ఉగాది పండగ సందర్భంగా ‘పండగ సార్.. పండగ’ అంటూ స్పెషల్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుండగా.. దానికి సంబంధించి రచ్చ లేపే ప్రోమోను నాలుగున్నర నిమిషాల నిడివితో విడుదల చేశారు.
Samayam Telugu9 Mar 2020, 2:02 pm
ఎంత పొలిటిషియన్ అయినా తనలోని పాత ఫ్లేవర్‌కి సమయం దొరికినప్పుడల్లా అత్తరు అద్దతూ ఉంటుంది సినీ నటి రోజా. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టేసిన ఈ అందాల నటికి ఇప్పటికీ పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆమె నవ్వుని లవ్ చేయని వాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. రోజా పేరుకి తగ్గట్టే ఆమె నవ్వులు వెల్లువిరిసిన రోజాలే. సరే.. ఇక చాల్లే పొగడ్తలు కాని అసలు విషయానికి రా అంటారా.. వస్తున్నాం.. అక్కడికే వస్తున్నాం. నగరి ఎమ్మెల్యేగా, వైసీపీ పార్టీలో కీలక మహిళా నేతగా, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రోజా... ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే బుల్లితెరపైనా సత్తా చాటుతున్నారు. జబర్దస్త్ షోకి జడ్జిగా సింగిల్ హ్యాండ్‌తో నడిపిస్తున్న రోజా.. ఈటీవీ స్పెషల్ ఈవెంట్స్‌లోనూ తళుక్కున మెరుస్తుంటారు. తాజాగా ఉగాది పండగ సందర్భంగా ‘పండగ సార్.. పండగ’ అంటూ స్పెషల్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుండగా.. దానికి సంబంధించి రచ్చ లేపే ప్రోమోను నాలుగున్నర నిమిషాల నిడివితో విడుదల చేశారు.
సామజవరగమన సాంగ్‌కి రోజా డాన్స్.. మాటల్లేవ్ అంతే
ఇంతకు ముందు జబర్దస్త్ షోలో జడ్జి రోజా ఇంట్రో సాంగ్ ఉండేది. యాంకర్స్‌తో కలిసి రోజా అదిరిపోయే స్టెప్పులతో రచ్చ చేస్తూ.. అదిరిపోయే ఎక్స్ ప్రెషన్తో ‘జబర్దస్త్’కి మంచి ఓపెనింగ్ ఇచ్చేవారు. అయితే ఎమ్మెల్యే అయ్యి ఉండి డాన్స్‌లు చేస్తారా? అనే డైలాగ్ బాగా ఎక్కువ వినిపించడంతో రెండో సారి గెలిచిన తరువాత ఏపీఐఐసీ చైర్మన్ పదవి వచ్చాక.. జబర్దస్త్‌లో ఇంట్రో సాంగ్ లేకుండానే పంచ్‌లకు పదును పెట్టి జబర్దస్త్ షోలో ‘రోజా’లు విసురుతున్నారు రోజా. ఇక ‘పండగ సార్.. పండగ’ ఉగాది ప్రోమోలో తనలోని నాట్యమయూరిని నిద్రలేపారు. శేఖర్ మాస్టర్‌తో కలిసి సామజవరగమన సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులు వేశారు.
నేలపై నాగినిలా శేఖర్ మాస్టర్.. తెగ దొల్లేశారుగా ఫ్లోర్ మొత్తం క్లీన్
పచ్చ రంగు పరికిణి, రోజ్ కలర్ కాంబినేషన్ ఓణిలో రోజా సామజవరగమన అంటూ ఓ రేంజ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక పక్కనే ఉన్న శేఖర్ మాస్టర్ అయితే చెలరేగిపోయారు.. రోజా నడుస్తూ ఉంటే.. సామజవరగమన సాంగ్‌కి సిగ్నేచర్ స్టెప్ (నేలపై పాకుతూ వెనక్కి వెళ్లడం) ఫ్లోర్ మొత్తం అరిగిపోయేలా నాగినిలా తెగ దొల్లేశాడు. ఇక తన చేయి ఇచ్చి శేఖర్ మాస్టర్ని పైకి లేపడంతో మనోడి రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్‌కి బాప్ రే అనుట్టుగానే ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసి వేసిన స్టెప్పులు తరుణ్ మాస్టర్ భాషలో చెప్పాలంటే చింపేశారంతే. Photo Courtesy ETV
ఈ సాంగ్ ముగిసిన తరువాత శేఖర్ మాస్టర్ రోజాలు కలిసి ఎవడ్నో ఒకడ్ని బకరా చేద్దాం అని ఫిక్స్ అయ్యారు. ఇప్పటిప్పుడు ఎదవని చేయాలంటే ఒక వెధవ ఐడియా కావాలి కదా అంటూ రాములమ్మ.. అదేనండి మన శ్రీముఖిని పిలిచేశారు. ‘ ఆఫ్టర్ గ్యాప్.. రాములమ్మ ఈజ్ బ్యాక్’ అంటూ ఓ రేంజ్ బిల్డప్‌లో ఎంట్రీ ఇచ్చింది శ్రీముఖి. చాలా గ్యాప్ తరువాత ఈటీవీకి వచ్చాను కదా.. నన్ను చూసి ఒకమంచి మాట చెప్పండి’ అని రోజా, శేఖర్ మాస్టర్లను కోరడంతో ‘పీకినవ్ లే తియ్’ అంటూ పంచ్ వేశారు. Photo Courtesy ETV
లౌడ్ స్పీకర్స్‌కి పంచ్ పడిందే
ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావ్ అని శేఖర్ మాస్టర్ అడగ్గా.. ‘నేను యాంకర్ ఆ సౌండ్ వినడానికి ఎంత బాగుంది కదా’ అని అనడంతో.. ‘ఒక్క నిమిషానికి ఓకే కాని మూడు గంటలు ఆ సౌండ్ వినాలంటే తల భారంగా ఉందని’ రోజా పంచ్ వేసి.. శ్రీముఖి లౌడ్ స్పీకర్ అన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇక శేఖర్ మాస్టర్ కల్పించుకుని.. ‘సౌండ్ గురించి మీరిద్దరూ చెప్తుంటే మాకు భారంగా ఉందని రివర్స్ పంచ్ వేసేశారు. దీంతో రెండు లౌడ్ స్పీకర్స్ మూడపడగా.. శ్రీముఖి పండగ సార్.. పండగ అంటూ హోస్టింగ్ మొదలుపెట్టింది. Photo Courtesy ETV
శ్రీముఖి ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తే రోజాతో హగ్ అట.. రామ రామ
ఇక పండగ ఉంటుంది చూడండి నా సామిరంగా.. అంటూ మొదలుపెట్టిన శ్రీముఖి.. ‘నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ సమాధానం చెప్తే రోజా గారిని హగ్ చేసుకోవచ్చు’ అని బంపర్ ఆఫర్ ఇవ్వడంతో శేఖర్ మాస్టర్ కరువు బాపతు సంఘానికి అధ్యక్షుడిలా చెలరేగిపోయారు. ‘రోజా గారు నటించిన మొట్ట మొదటి సినిమా ఏంటి?’ అని అడగ్గా.. ‘ప్రేమ తపస్సు’ అని ఠక్కున సమాధానం ఇచ్చాడు శేఖర్ మాస్టర్. ఆన్సర్ కరెక్ట్‌గా చెప్పేయడంతో రోజాను హగ్ చేసుకునేందుకు తెగ సిగ్గు పడిపోతూ మెలికలు తిరిగిపోయారు శేఖర్ మాస్టర్. ఆమెను రష్మి అనుకున్నారో ఏమో కాని హగ్ అనే సరికి ఆవురావురు మంటూ ఎగబడ్డారు శేఖర్ మాస్టర్. Photo Courtesy ETV
నాకూ ఓ మూమెంట్ వచ్చు చేయమంటావా? శేఖర్
ఇక రోజాగారిని హగ్ చేసుకో అని శ్రీముఖి కోరడంతో.. శేఖర్ మాస్టర్ తెగ సిగ్గుపడిపోతూ.. ఒళ్లు విరుచుకుంటూ రోజా దగ్గరకు వెళ్లారు.. ‘ఏంటి మాస్టర్.. మీదికి వస్తున్నారు? అని గాజులు సవరించుకుంటూ చెయ్యేస్తే చస్తావ్ అన్న ఎక్స్ ప్రెషన్ ఇవ్వగా.. ‘మేడమ్ మీరు అటు చూడండి’ అంటూ పైకి చూపించి రోజాను హగ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఏంటి శేఖర్ ఇది.. అనడంతో కొత్త మూమెంట్ అంటూ కవర్ చేసుకున్నారు. నాకూ ఓ మూమెంట్ వచ్చు అని బాక్సింగ్ ఆడేస్తా అని నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చేశారు రోజా. Photo Courtesy ETV
ఇక రోజాగారు మంచం మీద పడుకుంటే.. మాంత్రికుడు ఆ మంచాన్ని మాయం చేస్తాడు ఇది ఏ సినిమా అని అడగడంతో ‘భైరవదీపం’ అని చెప్పినా లాభం లేదనుకుని ‘సాహో’ అని తప్పుచెప్తారు శేఖర్ మాస్టర్. అనంతరం డ్యాంగ్ డ్యాంగ్ అంటూ నడుము అందాలతో కనువిందు చేస్తూ హైపర్ ఆదితో రచ్చలేసే స్టెప్పులు వేసింది యాంకర్ వర్షిణి. ఫ్లోర్ మూమెంట్స్‌తో పాటు తమన్నా తలదన్నేలా నాభి సొగసుల్ని బాగానే వడ్డించి రచ్చ రచ్చ చేసింది వర్షిణి. ఇక ఆది సైతం అదిరిపోయే స్టెప్పులతో మహేష్ బాబుకి ఫాలో అయిపోయాడు. చివర్లో సుడిగాలి సుధీర్ వచ్చి.. రాజమౌళి గారు ఈ పెర్ఫామెన్స్ చూస్తున్నారా అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. మార్చి 25న ఉగాది సందర్భంగా ఈటీవీలో ఉదయం 9 గంటలకు ‘పండగ సార్.. పండగ అంతే’ అనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుంది. మిగిలిన రచ్చ చూడాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే.
Youtube-Pandaga Sir Pandaga Anthe | ETV Ugadi Special Event 2020 | Latest Promo
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.