Extra Jabardasth 03 January 2020 Episode; Sudigali Sudheer Fun With Rashmi
Extra Jabardasth: ఒక కుక్క ఇంకో కుక్కని కలుస్తానని మెసేజ్ పెట్టిందా?: సుధీర్‌ని ఛీ కొట్టిన రష్మి
జబర్దస్త్ గురు, శుక్రవారాలు వస్తుందన్న మాటే కానీ.. మళ్లీ గురు, శుక్రవారాలు వచ్చే వరకూ ఎక్కడో చోట.. ఎవరోకరి ఫోన్లో జబర్దస్త్ నవ్వులు వినిపిస్తూనే ఉంటాయి. పంచ్‌లు పేలుతూనే ఉంటాయి. ఆటో పంచ్‌లు, రివర్స్ పంచ్‌లతో కడుపుబ్బా నవ్వించే స్కిట్స్ ఎన్ని ఉన్నా.. సుడిగాలి సుధీర్ టీమ్ స్కిట్‌కి ఓ క్రేజ్ ఉంటుంది. ఆ స్కిట్లో కచ్చితంగా రష్మీ పేరు ఉంటుంది. అయితే ఈ సారి ‘రష్మీకి పెళ్లి చూపులు’ అనే కాన్సెప్ట్‌తో డైరెక్ట్‌గా రష్మీనే దించారు. దాంతో స్కిట్లో పిచ్చ కామెడీ పండించారు. ఆ కథేంటో చూద్దాం!
Samayam Telugu4 Jan 2020, 11:40 pm
జబర్దస్త్ గురు, శుక్రవారాలు వస్తుందన్న మాటే కానీ.. మళ్లీ గురు, శుక్రవారాలు వచ్చే వరకూ ఎక్కడో చోట.. ఎవరోకరి ఫోన్లో జబర్దస్త్ నవ్వులు వినిపిస్తూనే ఉంటాయి. పంచ్‌లు పేలుతూనే ఉంటాయి. ఆటో పంచ్‌లు, రివర్స్ పంచ్‌లతో కడుపుబ్బా నవ్వించే స్కిట్స్ ఎన్ని ఉన్నా.. సుడిగాలి సుధీర్ టీమ్ స్కిట్‌కి ఓ క్రేజ్ ఉంటుంది. ఆ స్కిట్లో కచ్చితంగా రష్మీ పేరు ఉంటుంది. అయితే ఈ సారి ‘రష్మీకి పెళ్లి చూపులు’ అనే కాన్సెప్ట్‌తో డైరెక్ట్‌గా రష్మీనే దించారు. దాంతో స్కిట్లో పిచ్చ కామెడీ పండించారు. ఆ కథేంటో చూద్దాం!
‘నేను.. రష్మి.. సెవెన్ ఇయర్స్.. అసలు..’
హృదయం ఓర్చుకోలేనిదీ ఈ నిజం.. సాంగ్‌తో సుధీర్ ఏడుస్తూ వస్తాడు. ‘ఎందుకు ఏడుస్తున్నావ్ రా’ అని శ్రీను, రామ్ ప్రసాద్ అడగడంతో... ‘రష్మికి పెళ్లి చూపులటరా.. పువ్వుల్లో పెట్టి చూసుకుందాం అనుకున్నా’ అంటాడు సుధీర్. ఆ మాటకి రోజా ఫక్కున నవ్వుతుంది. ‘నేను.. రష్మి.. సెవెన్ ఇయర్స్.. అసలు..’ అంటూ బాధపడుతున్న సుధీర్‌తో.. ‘అర్థమైంది రష్మికి పెళ్లి అయితే ఎవరూ పట్టించుకోరని కదా నీ బాధ’ అంటుంది రోజా పంచ్ వేయడంతో సుధీర్ షాక్ అయ్యి చూస్తాడు. photo courtesy etv telugu
రష్మి పెళ్లి చూపులు.. ఆపే ప్రయత్నంలో
వెంటనే రామ్ ప్రసాద్ శ్రీనూతో.. ‘రష్మి కి పెళ్లి అయిపోయింది అనుకో.. మళ్లీ మ్యాజిక్ చేస్తాడు.. పావురాలు తీస్తాడు బయటికి’ అంటూ మరో పంచ్ వేస్తాడు. వెంటనే సుధీర్ మాత్రం బాధగా.. ‘రేయ్ ఎలాగైనా సరే రష్మీ పెళ్లి ఆపాలిరా’ అనడంతో.. శ్రీను ‘పెళ్లి చూపులు(సినిమా) ఎప్పుడో రిలీజ్ అయిపోయిందిరా ఆపడం కష్టం’ అంటూ ఆటో పంచ్ వేస్తాడు. ‘అబ్బా అది కాదురా రష్మీ పెళ్లి చూపులు ఆపాలి’ అంటూ సుధీర్.. రామ్ ప్రసాద్, శ్రీనులను తీసుకుని రష్మీ ఇంటికి వెళ్తాడు.
నాకు కాబోయే వాడు చాలా పెద్ద..
అక్కడ రష్మీ.. ‘ఎక్కడెక్కడున్నాడో..’ సాంగ్‌కి డాన్స్ చేస్తుంది. ‘అంతేనమ్మా ఎక్కడెక్కడో ఉన్నోళ్లని ఊహించుకుంటూ పాడతారు.. పక్కనే ఉన్నావాళ్లు పనిరారు’ అంటూ రష్మీకి పంచ్ వేస్తాడు సుధీర్. ‘తెలుసా నాకు కాబోయే వాడు.. చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్.. పది హెలీకాప్టర్స్ ఉన్నాయి’ అంటూ ఇంగ్లీష్‌లో తిప్పుకుంటూ చెబుతుంది. ఇంతలో రామ్ ప్రసాద్ సుధీర్‌తో ‘అన్ని ఉన్నాయని తెలుస్తుంటే నాకే పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా వాడ్ని’ అనడంతో జబర్దస్త్ నవ్వులు పూస్తాయి.
బిత్తిరి ఎంట్రీ.. సుధీర్ షాక్!
ఇంతలో బిత్తిరి సత్తి మంచి ఫోష్ లుక్‌లో పెళ్లికొడుకులా ఎంట్రీ ఇస్తాడు. రావడమే.. సుధీర్ గ్యాంగ్‌ని చూస్తూ.. ‘ఊర్లో పెళ్లికి కుక్కలు హడావుడి చేస్తాయని విన్నాకు కానీ.. ఈ మధ్య పెళ్లి చూపులకు కూడా హడావిడి చేస్తున్నాయా’ అంటూ సెటైర్ వేయడంతో.. శ్రీను, రామ్ ప్రసాద్‌లు ‘నన్ను అంత మాట అంటావా?’ అంటూ రెచ్చిపోతారు. ఇంతలో సుధీర్ బాగా నవ్వుతూ.. ‘ఆయన నన్ను అంటే మీరిద్దరూ రియాక్ట్ అవుతున్నారుగా?’ అంటూ నవ్వుతాడు సుధీర్. ‘ఎన్నారై అంటున్నారు.. బిజినెస్‌లు అంటున్నారు.. మీకు పిఏ లేడా?’ అని రామ్ ప్రసాద్ అడగడంతో తను తీసుకొచ్చిన సూట్‌కేస్ జిప్ తీస్తాడు సత్తి.
సత్తి సూట్ కేస్‌లో పొట్టి రమేష్
సత్తి తెచ్చిన సూట్‌కేస్‌లోంచి నరేష్ బయటికి రావడం భలే నవ్వు వస్తుంది. ‘ఇదేంటీ ఇలా తీసుకొచ్చారు?’ అని అడగగానే ‘పాస్‌పోర్ట్ ప్రాబ్లమ్ అయ్యింది అందుకే ఇలా’ అంటూ బిల్డప్ కొడతాడు సత్తి. ఇంతలో రష్మీ వచ్చి.. ‘హాయ్ సత్తిగారూ..’ అంటూ పలకరించడం, సత్తికి కోపం వచ్చిన ప్రతిసారీ ‘సత్తిగారూ’ అంటూ తన చేత్తో రుద్దడం.. అవన్నీ చూసి సుధీర్ రగిలిపోవడం భలే కామెడీ ఉంటుంది. సుధీర్ బ్యాచ్‌ని రష్మీ ముందు తిడుతూ.. రష్మీ మీద కవిత్వం చెబుతూ, పాటలు పాడుతూ సత్తి బాగా కామెడీ పండిస్తాడు.
రష్మీ మీద సత్తి పాట.. సిగ్గుమొగ్గలైన యాంకర్ పాప
‘నా రష్మీ పాదాలు.. హంసలకే పాదాలు.. రష్మితి పలికితే చాలు.. తేనె జలపాతాలు.. రష్మీ డాన్సేస్తే చాలు ఎపిసోడ్ రేటింగ్ ఎక్కడికో వెళ్లిపోతుంది’ అంటూ ‘నా చెలియ పాదాలు’ సాంగ్‌ని ప్యారడీ చేస్తూ పాడుతాడు సత్తి. దానికి రష్మీతో కలిసి డాన్స్ కూడా చేస్తాడు. తర్వాత కవితలు కూడా చెబుతాడు. అదంతా చూసి.. రామ్ ప్రసాద్‌తో సుధీర్.. ‘చూసావారా?’ అంటాడు బాధగా. ‘హా చూసాను.. రాంగ్ స్టెప్స్ కరెక్ట్‌గా వెయ్యట్లేదు’ అంటూ ఆటో పంచ్ వేయడంతో జడ్జ్ పోసానీ, రోజాలు పడి పడి నవ్వుతారు.
కవితకు రోజా ఫిదా!
‘ఏంది ఓ కవిత చెప్పు’ అని సత్తిని సుధీర్ గ్యాంగ్ రెచ్చగొట్టడంతో.... ‘రగులుతోంది మొగలిపొద. చరిత్రలో నిలవాలి మన ప్రేమ కథ’, ‘రింగు రింగు బిల్ల.. నన్ను పెళ్లి చేసుకోవే పిల్లా..’, ‘కుచ్ కుచ్ హోదా హై.. నీతో అమెరికా జాతాహై’ అంటూ పిచ్చి పిచ్చి కవితలు చెప్పడంతో రోజా కూడా ‘వహ్వా.. వహ్వా’ అంటూ కామెడీని పండిస్తారు. ‘ఫ్లైట్‌లో వస్తూ.. ఇవన్నీ గోడల మీద చూసి ఇలా మలిచేశాను’ అన్న బిత్తిరి సత్తి మాటలను పట్టుకుని.. సుధీర్, రామ్ ప్రసాద్, శ్రీనూలు.. సత్తి పిఏ నరేష్‌కి నాలుగు తగిలించి నిజం చెప్పిస్తారు.
ఒక కుక్క ఇంకో కుక్కని కలుస్తానని మెసేజ్ పెట్టిందా?
సత్తికి ఏం లేదని తెలుసుకున్న సుధీర్ గ్యాంగ్.. రష్మీని పిలిచి నరేష్ చేత నిజం చెప్పిస్తారు. దాంతో ‘వీడు నన్ను మోసం చేశాడు కొట్టడం’అని రష్మీ అనడంతో సత్తిని చితక్కొడతారు సుధీర్ అండ్ కో బ్యాచ్. ఆ సీన్ భలే నవ్వు తెప్పిస్తుంది. సీన్ కట్ చేస్తే.. ‘సుధీర్ మళ్లీ రష్మీకి ప్రపోజ్ చెయ్యడం, ఆమె ఓకే అనడంతో.. ఆనందంలో రష్మీతో సెల్ఫీ దిగుతున్న సమయంలో ప్రీతి అనే అమ్మాయి సుధీర్ సెల్‌కి ఈవినింగ్ కలుద్దాం అని మెసేజ్ చేస్తుంది. అది చూసిన రష్మీ.. రష్మీ.. ప్రియా ఎవరు ఈవినింగ్ కలుద్ధాం అంటుంది అని అడుగుతుంది. అది మా కుక్కపిల్ల అనడంతో ఒక కుక్క ఇంకో కుక్కకి మెసేజ్ పెడుతుందా? అని సుధీర్‌ని ఛీ కొట్టి.. నువ్ ఇంక మారవ్ అని తిట్టి వెళ్లిపోవడం.. సుధీర్ ఎప్పటిలాగే ఆమె వెనకు పడటం నవ్వులు కురిపించింది.
Youtube-Sudigaali Sudheer Performance | Extra Jabardasth | 3rd January 2020 | ETV Telugu
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.