యాప్నగరం

Extra Jabardasth: ఇదే మా మధ్య ఉన్న బంధం.. సుధీర్-రష్మి హార్ట్ టచ్చింగ్ మూమెంట్

సుధీర్-రష్మి జంట బుల్లితెరపై సంచలనం.. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయినంతగా మరే ఇతర జంటకు వర్కౌట్ కాదు.. దీంతో ఈ జంటపై అనేక రూమర్లు పుట్టుకొస్తుంటాయి.

Samayam Telugu 10 Oct 2020, 12:21 pm
ప్రతి మగాడి విజయం వెనుకాలా ఒక ఆడది ఉంటుందని అంటారు.. కానీ గత ఎనిమిదేళ్లుగా నా విజయం నా వెనుక కాదు.. నా పక్కనే ఉంది.. రష్మి రూపంలో అంటూ ఎమోషనల్‌గా మాట్లాడాడు సుధీర్.
Samayam Telugu సుధీర్, రష్మి Pic Credits: Mallemala And ETV
sudigali sudheer and rashmi


బుల్లితెరపై రష్మి-సుధీర్ జంటకు మంచి క్రేజ్ ఉంది. సుధీర్ అంటే రష్మి.. రష్మి అంటే సుధీర్ అనేంతగా వీరి మధ్య కెమెస్ట్రీ వర్కౌట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ బాగా పండటంతో ఆఫ స్క్రీన్‌లో కూడా ఏదో నడుస్తుందంటూ పుంకాను పుంకాలుగా రూమర్లు పుట్టుకొస్తుంటాయి.

అయితే వీటిపై పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చిన సుధీర్-రష్మిలు జంట.. ఎక్స్ ట్రా జబర్దస్త్ 300 ఎపిసోడ్ ప్రోమోలో మరోమారు తమ మధ్య ఉన్న రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు.

ఎక్స్ ట్రా జబర్దస్త్ జడ్జీగా ఉన్న రోజా.. సుధీర్-రష్మిలు మధ్య ఉన్న రిలేషన్ గురించి స్టేజ్‌పైనే ప్రశ్నించారు. ‘మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను.. మీ ఇద్దరి ఫ్యాన్స్ మీ రిలేషన్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు.. అసలు రష్మి మీద నీ అభిప్రాయం ఏంటి? అని సుధీర్‌ని అడిగారు రోజా.

దీంతో రష్మి గురించి చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు సుధీర్.. ‘ఆన్ స్క్రీన్‌లో నా స్కిట్‌లతో పాటు నాకు బాగా పేరు వచ్చిందంటే అది కేవలం రష్మి వల్లే.. సుధీర్ అంటే అందరూ గుర్తు పడతారు.. కానీ సుధీర్ రష్మి అంటే అందరూ గుర్తుపడతారు. ప్రతి మగాడి వెనుకు ఒక ఆడది ఉందని అంటారు.. కాని గత ఎనిమిదేళ్లుగా నా విజయం నా వెనక కాదు.. నా పక్కనే ఉంది.. రష్మి రూపంలో’ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడాడు సుధీర్. ఇక ఈ ఎమోషనల్ సీన్‌కి రొమాంటిక్ టచ్ ఇస్తూ.. ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో అనే సాంగ్‌కి అద్భుతంగా పెర్ఫామ్ చేసి మరోసారి రొమాన్స్ పిండేశారు రష్మి, సుధీర్‌ల జంట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.